హైదరాబాద్ విజయలక్ష్యం 163 | gujarat lions set target of 163 runs for sunrisers hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ విజయలక్ష్యం 163

Published Fri, May 27 2016 9:44 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM

హైదరాబాద్ విజయలక్ష్యం 163 - Sakshi

హైదరాబాద్ విజయలక్ష్యం 163

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఏకలవ్య ద్వివేది(5) నిరాశపరిచాడు. అనంతరం సురేష్ రైనా(1) వైఫల్యం చెందడంతో గుజరాత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆపై బ్రెండన్ మెకల్లమ్(32;29 బంతుల్లో5 ఫోర్లు), దినేష్ కార్తీక్(26;19 బంతుల్లో  4 ఫోర్లు, 1సిక్స్)తో ఫర్వాలేదనిపించడంతో గుజరాత్ తేరుకుంది.

 

అటు తరువాత డ్వేన్ స్మిత్(1) నిరాశపరిచినా, అరోన్ ఫించ్(50;32 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించి జట్టు పరిస్థితిని చక్కదిద్దాడు. ఇక చివర్లో రవీంద్ర జడేజా(19 నాటౌట్;15 బంతుల్లో 1ఫోర్),  డ్వేన్ బ్రేవో(20; 10 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 162 పరుగులు నమోదు చేసింది.  హైదరాబాద్ బౌలర్లలో కట్టింగ్, భువనేశ్వర్ కుమార్ లు చెరో రెండు వికెట్లు సాధించగా,  ట్రెంట్ బౌల్ట్, బిపుల్ శర్మలకు తలో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement