‘లయన్స్ ’అసిస్టెంట్ కోచ్‌గా కైఫ్
రాజ్‌కోట్: ఐపీఎల్ జట్టు గుజరాత్ లయ న్స్ అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఎంపికయ్యాడు. లయన్స్ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. గుజరాత్ హెడ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్‌తో కలిసి కైఫ్ పని చేస్తాడు.
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 10 వేలకు పైగా పరుగులు సాధించిన 36 ఏళ్ల కైఫ్ తాజా రంజీ సీజన్ లో ఛత్తీస్‌గఢ్ జట్టు తరఫున ప్లేయర్ కం మెంటార్‌గా బరిలోకి దిగాడు. భారత్‌కు 13 టెస్టుల్లో 125 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఐపీఎల్‌లో రాజస్థాన్, పంజాబ్, బెంగళూరు జట్ల తరఫున ఆడాడు.