రిషభ్‌ సూపర్బ్‌.. గంభీర్‌పై సెటైర్లు | Social Media Reaction On Rishabh Pant Maiden IPL Hundred | Sakshi
Sakshi News home page

రిషభ్‌.. సూపర్బ్‌!

Published Fri, May 11 2018 10:33 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Social Media Reaction On Rishabh Pant Maiden IPL Hundred - Sakshi

రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ విన్యాసం

సాక్షి, న్యూఢిల్లీ: రికార్డుల మోత మోగించిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, ప్రముఖులు అతడిని పొగడ్తల్లో ముంచెత్తున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో గురువారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రిషభ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్‌ సూపర్బ్‌, అన్‌బిలీవబుల్‌ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు.

పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇది కూడా ఒకటని పేర్కొంటున్నారు. రిషభ్‌ ‘సౌ’రభాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదని ప్రశంసిస్తున్నారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాతీయ జట్టులో రిషభ్‌కు స్థానం కల్పించివుంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు. భవిష్యత్తులో అతడు కచ్చితంగా మళ్లీ టీమిండియాకు ఆడతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టుకు భారంగా మారిన గౌతమ్‌ గంభీర్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement