రాణించిన సంజూ శ్యాంసన్, డుమినీ | Samson, Duminy take Delhi to 165 | Sakshi
Sakshi News home page

రాణించిన సంజూ శ్యాంసన్, డుమినీ

Published Sat, Apr 23 2016 5:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

Samson, Duminy take Delhi to 165

ఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ముంబై తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆదిలోనే డీ కాక్(9) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఐయ్యర్(19), కరుణ్ నాయర్(5) కు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

అయితే ఫస్ట్ డౌన్ లో వచ్చిన సంజూ శాంసన్(60;48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ తేరుకుంది. అతనికి జతగా జేపీ డుమినీ (49 నాటౌట్; 31బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లాన్గన్  రెండు వికెట్లు సాధించగా, హర్భజన్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement