ఎందుకు ఆగిపోయావు అశ్విన్‌..? | ashwin trolled for not mankading aaron finch against rcb | Sakshi
Sakshi News home page

ఎందుకు ఆగిపోయావు అశ్విన్‌..?

Published Tue, Oct 6 2020 12:48 PM | Last Updated on Tue, Oct 6 2020 3:47 PM

ashwin trolled for not mankading aaron finch against rcb - Sakshi

'మన్కడింగ్‌' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఇంతకు ముందు మన్కడింగ్‌ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్‌ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఢిల్లీ​: 'మన్కడింగ్‌' అని వినగానే మనకు గుర్తొచ్చే పేరు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఇంతకు ముందు మన్కడింగ్‌ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. క్రికెట్‌ లవర్స్‌కు దీన్ని పరిచయం చేసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 197 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్‌సీబీ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్‌లోని మూడో ఓవర్‌ వేసేందుకు వచ్చిన అశ్విన్‌ తన నాలుగో బంతి వేస్తుండగా ఆరోన్‌ ఫించ్‌ క్రీజు దాటి బయటకు వెళ్లాడు. అశ్విన్‌ బంతి వేయకుండా అలాగే ఆగిపోయి ఫించ్‌వైపు కోపంగా చూశాడు. అక్కడ మన్కడింగ్‌ చేసే అవకాశం ఉన్నా అశ్విన్‌ ఆ పని చేయలేదు. దీంతో ఒక్కసారిగా అందరికీ గతేడాది బట్లర్‌ను మన్కడింగ్‌ చేసింది గుర్తొచ్చింది. ఐతే ఈ సారి మన్కడింగ్‌ ఎందుకు చేయలేదని క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోయారు.
 
అప్పుడు చేశాడని... ఇప్పుడు చేయలేదని!
గత ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ తరుపున ఆడిన అశ్విన్‌... రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేశాడు. అప్పట్లో ఈ అంశం వివాదంగా మారింది. ఐతే మన్కడింగ్‌ అనేది క్రికెట్‌ రూల్స్‌లో భాగమైనప్పటికీ ఇది క్రికెట్‌ స్ఫూర్తికి విరుద్ధమని క్రికెట్‌ ఫా​న్స్‌తో పాటు పలువురు ఆటగాలు అశ్విన్‌ తీరుపై మండిపడ్డారు. రూల్‌ ఉన్నప్పుడు మన్కడింగ్‌ చేస్తే తప్పేంటని అశ్విన్‌ సమర్థించుకున్నాడు. ఏదైమైనా మన్కడింగ్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అది కూడా అశ్విన్‌ వల్లనే సాధ్యం అయ్యింది. గతేడాది బట్లర్‌ను మన్కడింగ్‌ చేశాడని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయగా ఈసారి అవకాశం ఉన్నా ఫించ్‌ను ఎందుకు చేయలేదని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. బట్లర్‌కు మద్దతుగా కొన్ని ఫన్నీ ఫోటోలు విడుదల చేయగా ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

మాన్‌కడింగ్‌ చరిత్ర ఏంటంటే...
అసలు మన్కడింగ్‌ అనేది కొత్తగా వచ్చింది కాదు. 1947-48లో భారత్‌, ఆస్ర్టేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో మొదటిసారి మన్కడింగ్‌ జరిగింది. భారత స్పిన్నర్‌ 'విన్నూ మన్కడ్‌' బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌స్ర్టైక్‌లో ఉన్న బిల్‌ బ్రౌన్‌ క్రీజు దాటి బయటికి వెళ్లాడు. అప్పుడు విన్నూ మన్కడ్‌ వికెట్లు పడగొట్టి అతడిని అవుట్‌ చేశాడు. అలా మాన్‌కడ్‌ అనే పదం వెలుగులోని వచ్చింది. అప్పట్లో ఆసిస్‌ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా మన్కడ్‌ క్రికెట్‌ రూ​ల్స్‌లో ఉన్నప్పటికీ ఇది క్రికెట్‌ స్ఫూర్తికి విరు​ద్ధమని ఆటగాలు భావిస్తున్నారు.  

(ఇదీ చదవండి: అశ్విన్‌ వదిలేశాడు.. కెమెరాలన్నీ పాంటింగ్‌వైపే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement