బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగూళురుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ తొలుత రాయల్ చాలెంజర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన రాయల్ చాలెంజర్స్ అందులో విజయం సాధించగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడిన రెండింటిలో ఒక దాంట్లో ఓడి, మరొక మ్యాచ్లో గెలిచింది.
క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్ , సర్పరాజ్ ఖాన్, కేదర్ జాదవ్లతో రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండగా, ఢిల్లీలో డీ కాక్, జేపీ డుమినీ, ఐయ్యర్, సంజూ శ్యాంసన్లు కీలకం కానున్నారు.