
టీమిండియా తరఫున రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన పర్వీందర్ అవానా కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత జాతీయ జట్టు తరఫున ఇంగ్లండ్‌పై 2012లో అరంగేట్రం చేసిన అతను... ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయాడు. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల అవానా రంజీ జట్టుకు తొమ్మిదేళ్లు ప్రాతినిధ్యం వహించాడు.
ఐపీఎల్‌లో 2012–14 సీజన్ల మధ్య కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడాడు. కెరీర్‌లో 62 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్డాడు. ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment