105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! క‌ట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్‌ | Akshay Wakhare calls time on 19-year career | Sakshi
Sakshi News home page

105 మ్యాచ్‌లు.. 344 వికెట్లు! క‌ట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్‌

Published Mon, Mar 3 2025 12:46 PM | Last Updated on Mon, Mar 3 2025 1:45 PM

Akshay Wakhare calls time on 19-year career

విద‌ర్భ స్టార్ ఆఫ్ స్పిన్న‌ర్ అక్షయ్‌ వాఖరే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌ ఫైన‌ల్ విజ‌యనంత‌రం వాఖరే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నాగ్‌పూర్ వేదిక‌గా కేర‌ళ‌తో జ‌రిగిన రంజీ ట్రోఫీ ఫైన‌ల్లో విద‌ర్బ విజ‌యం సాధించింది. ఫైనల్‌ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా విదర్భ ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. 

అయితే ఈ మ్యాచ్‌లో వాఖ‌రేకు ఆడే అవ‌కాశం ల‌భించలేదు. అత‌డు చివ‌ర‌గా త‌మిళ‌నాడుతో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో విద‌ర్బ‌కు ప్రాతినిథ్యం వ‌హిచాడు.  ‘రంజీ చాంపియన్‌ జట్టులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. విజేతగా వీడ్కోలు పలకడం కంటే ఇంకేం కావాలి. 100 మ్యాచ్‌ల అనంతరం తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ జట్టు అవసరాల దృష్ట్యా సీజన్‌ ముగిసేవరకు కొనసాగాను’ అని 39 ఏళ్ల వాఖరే వెల్లడించాడు. 

2006-07 రంజీ సీజ‌న్‌తో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అక్ష‌య్‌.. విద‌ర్బ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. త‌న సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌నతో విద‌ర్భ‌కు ఎన్నో చారిత్ర‌త్మ‌క విజ‌యాల‌ను అందించాడు. మూడోసారి విద‌ర్భ విజేత‌గా నిల‌వ‌డంతో వాఖ‌రే త‌న‌వంతు పాత్ర పోషించాడు. దేశవాళీల్లో 105 మ్యాచ్‌లాడిన ఈ కుడిచేతి వాటం స్పిన్నర్‌ 344 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అతడి ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 3 పది వికెట్‌ హాల్స్‌, 21 ఫైవ్‌ వికెట్ల హాల్స్ ఉన్నాయి.

విదర్భకు భారీ నజరానా..
మూడోసారి రంజీ టైటిల్‌ నెగ్గిన తమ జట్టుకు విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ (వీసీఏ) భారీ నజరానా ప్రకటించింది. టీమ్‌ మొత్తానికి రూ. 3 కోట్లు నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని తెలిపింది. ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి రికార్డు నెలకొలి్పన హర్ష్ దూబేకు రూ. 25 లక్షలు... నాలుగు సెంచరీలతో అదరగొట్టిన కరుణ్‌ నాయర్‌కు రూ. 10 లక్షలు... ఈ రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన యశ్‌ రాథోడ్‌కు రూ. 10 లక్షలు... హెడ్‌ కోచ్‌ ఉస్మాన్‌ ఘనీకి రూ. 15 లక్షలు... అసిస్టెంట్‌ కోచ్‌ అతుల్‌ రనాడేకు రూ. 5 లక్షలు... ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ నితిన్‌ ఖురానాకు రూ. 5 లక్షలు... స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ యువరాజ్‌ సింగ్‌ దసోంధికి రూ. 5 లక్షలు... వీడియో ఎనలిస్ట్‌ అమిత్‌ మాణిక్‌రావుకు రూ. 5 లక్షలు ప్రకటించారు.
చదవండి: Champions Trophy: ఆసీస్‌తో సెమీఫైనల్‌.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement