నవన్‌షహర్: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్‌ను లాహోర్‌లో ఉరి తీసిన కేసును తిరిగి తెరిపించాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ ప్రేమ్‌సింగ్ చందుమజ్రా శనివారం కేంద్రాన్ని కోరారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్‌సింగ్ లాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం వారిని అవమానించడమే అవుతుందన్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేకున్నా భగత్‌సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉగ్రవాదులనే నెపంతో బ్రిటిష్ అధికారులు 1931లో లాహోర్‌లో విచారించి ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంలో భగత్‌సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్‌లు విప్లవాత్మక ఉగ్రవాదులంటూ ప్రచురితం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
‘భగత్‌సింగ్’ కేసు తిరిగి తెరవాలి
Published Sun, May 1 2016 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM
Advertisement
Advertisement