భగత్‌సింగ్ వంటి దేశభక్తులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించిన రచయితలపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎంపీ నరేష్ అగర్వాల్ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: భగత్‌సింగ్ వంటి దేశభక్తులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించిన రచయితలపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎంపీ నరేష్ అగర్వాల్ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇందుకు డిప్యూటీ చైర్ పర్సన్ పీజే కురియన్ స్పందిస్తూ ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించే విధంగా తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు లేకున్నా భగత్‌సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉగ్రవాదులనే నెపంతో బ్రిటిష్ అధికారులు 1931లో లాహోర్‌లో విచారించి ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంలో భగత్‌సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్‌లు విప్లవాత్మక ఉగ్రవాదులంటూ ప్రచురితం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.