naresh agrawal
-
నా మాటలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా..
-
నేను ఆ మాటలు అనకుండా ఉండాల్సింది..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యురాలు, సమాజ్‌వాది పార్టీ నేత జయా బచ్చన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నరేశ్ అగర్వాల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో బాధపెట్టినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సినిమాల్లో డ్యాన్స్‌లు చేసే వారితో తనకు పోలికా అంటూ జయా బచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మాటలు బీజేపీని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు సమాజ్ వాది పార్టీలో ఉన్న నరేశ్ అగర్వాల్ తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ తనను సినిమా వాళ్లతో, డ్యాన్సులు చేసేవారితో పోల్చేస్థాయికి సమాజ్ వాది పార్టీ తనను దిగజార్చిందని అన్నారు. జయా వల్లనే తనకు ఎస్పీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ మాటలకు తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి కూడా ఆయన వ్యాఖ్యలు ఖండించిన నేపథ్యంలో 'నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను' అని ఆయన అన్నారు. అయితే, మీరు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లే అని తాము అనుకోవచ్చా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రిగ్రీట్ అంటే ఏమిటో నీకు అర్ధమవుతుందా అంటూ ఎదురు ప్రశ్నించారు. -
రాహుల్ గాంధీ సినిమా.. శోభనం రాత్రి!!
సాక్షి, న్యూఢిల్లీ : నోరుజారడం అలవాటుగా చేసుకున్న రాజకీయ నేతల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ టాప్ లిస్ట్‌లో ఉంటారు. ఆయన చేసేది సద్విమర్శే అయినా ఉపయోగించే పదాలు విపరీత అర్థాలకు దారి తీస్తాయి. తాజాగా రాహుల్ గాంధీని సమర్థిస్తూ.. అదే సమయంలో బీజేపీని విమర్శిస్తూ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నేతలు శోభనాన్ని వద్దనుకుంటారా? : ‘‘ఒక రాజకీయ నాయకుడి శోభనం రాత్రికి ముహుర్తం కుదురుతుంది.. సరిగ్గా అదే రోజు ఏ ఎన్నికల ఫలితాలో వెలువడ్డాయనుకోండి.. ఆ నేత ఫస్ట్‌నైట్‌ను రద్దు చేసుకుంటాడా? బీజేపీ సంకుచితంగా ఆలోచిస్తోంది. రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాలపై వారు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని నరేశ్ అగర్వాల్ అన్నారు. రాహుల్ గాంధీ సినిమా ఏంటంటే..! : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఓ మాల్లో ‘స్టార్ వార్స్’ సినిమా చూశారట! అంతే, బీజేపీ నేతలు తమ నోటికి పనిచెప్పారు. ‘‘పార్టీ ఓటమిభారంతో కుమిలిపోతుంటే, నాయకుడు(రాహుల్) మాత్రం సినిమా చూసి ఆనందించారు’’ అని వ్యాఖ్యలు చేశారు. కాగా, రాహుల్ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నేతలు టార్గెట్ చేయడాన్ని ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ తప్పుపట్టారు. బీజేపీ ఒక సంకుచిత పార్టీ అని విమర్శించారు. కానీ రాహుల్ సినిమా వీక్షణను శోభనం రాత్రితో పోల్చి అభాసుపాలయ్యారు. -
'ట్రావెల్ బ్యాన్ పవర్ విమాన సంస్థకు లేదు'
న్యూఢిల్లీ: విమానంలోగానీ, ఎయిర్‌పోర్ట్‌లోగానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అధికారం సదరు విమానాయాన సంస్థకు లేదని రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ అన్నారు. చట్టప్రతినిధులు కూడా పౌరులతోనే సమానం అని వారేదైనా తప్పు చేస్తే చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారే తప్ప వారిపై నిషేధం విధించడానికి వీల్లేదన్నారు. గురువారం రాజ్యసభలో ఎస్పీ నేత నరేశ్ అగర్వాల్ ఈ విషయాన్ని గుర్తు చేశారు. పలు దేశీయ విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో ఉల్లంఘనకు, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఎయిర్ ఇండియా వంటి పలు విమానాయాన సంస్థలు తమపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయని, అసలు ఆ సంస్థలు అలా చేయొచ్చా అని కురియన్ను వివరణ కోరారు. దీనికి స్పందించిన కురియన్.. అగర్వాల్ చాలా విలువైన పాయింట్ లేవనెత్తారని, వాస్తవానికి ఎయిర్ ఇండియా కానీ, మరింకేదైనా విమానయాన సంస్థకు గానీ అలాంటి అధికారం లేదని అన్నారు. 'ఏ ఒక్కరిని శిక్షించే అధికారం ఎయిర్‌లైన్స్‌కు లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఏ ఎంపీ అయినా నేరానికి పాల్పడితే చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలిగానీ, విమానాయాన సంస్థకాదు' అని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ జోక్యం చేసుకోని నేరాలనే మాట ఉపయోగించకుండా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ ఉల్లంఘనలు అనే పదం ఉపయోగించాలని కోరారు. అయితే, ఓ వ్యక్తి మరో వ్యక్తిని కొట్టినప్పుడు నేరం అవుతుంది కదా అని వివరణ ఇచ్చారు. ఇటీవల ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అంతకుముందు శివసేన పార్టీ నేతలపై ఎయిర్ ఇండియాతోపాటు పలు విమాన సంస్థలు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. -
‘ఎంపీల వేతనాలు పెంచండి’
న్యూఢిల్లీ: ఎంపీలు వేతనాలు, అలవెన్సులు పెంచాలని సమాజ్‌వాదీపార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ కోరారు. రాజ్యసభలో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత ఎంపీల వేతనాలు కేబినెట్ సెక్రటరీల జీతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. సమాజ్‌వాదీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ కూడా గతేడాది ఇదే అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. ఎంపీల వేతనాలు, అలవెన్సులు పెంచాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం.. ఎంపీల వేతనాలు 100 శాతం పెంచనుందని గతేడాది వార్తలు వచ్చాయి. దీంతో ఎంపీల నెల వేతనం రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెరగనుందని ప్రచారం జరిగింది. ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిన తర్వాత కేబినెట్ కార్యదర్శి నెల వేతనం రూ. 2.5 లక్షలకు పెరిగింది. -
జీఎస్టీ.. చప్పట్లు తప్ప చేసేదేముంది?
న్యూఢిల్లీ: ఒకవైపు దేశమంతా ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. మరోవైపు ఈ విధానాన్ని ప్రతిపక్షాలే కాదు దేశ ప్రజలు స్వాగతించడం లేదని నేతల నుంచి నూతన పన్ను విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ విధానం అనేది ఎవరికీ ఆమోదయోగ్యం కాని నల్ల చట్టమని రాజ్యసభ సభ్యుడు, సమాజ్ వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదంతో సంబంధం లేకుండా మీడియా అయితే కచ్చితంగా ఈ సమావేశానికి హాజరవుతుందన్నారు. కేవలం జీఎస్టీ వ్యతిరేఖ వైఖరిని మాత్రమే తాము అవలంభిస్తున్నామని, అయితే కొత్త వివాదాలను తెరపైకి తేవడం తమ ఉద్దేశం కాదని ఎస్పీ ఎంపీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా నూతనంగా అమల్లోకి రానున్న ఏకపన్ను విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడికి వచ్చి కూర్చుని చప్పట్లు కొట్టడం తప్ప.. చేయాల్సిందేమీ లేదన్నారు. జీఎస్టీ విధానంపై దేశంలో మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదని తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు మాత్రమే ఏక పన్ను విధానాన్ని స్వాగతించారని, అయితే దీన్ని మొత్తం దేశంపై రుద్దుతున్నారని విమర్శించారు. కాగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా లాంచ్ కాబోతున్న జీఎస్టీ వేడుకకు, ప్రతిపక్షాలన్నీ దాదాపు బాయ్ కాట్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే జీఎస్టీ వేడుకకు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరుకావాలని సమాచార, ప్రసారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ వేడుకను బాయ్ కాట్ చేయడం సరియైనది కాదని నాయుడు పేర్కొన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం ఈవెంట్‌కు హాజరయ్యేలా కనిపించడం లేదని తెలుస్తోంది. -
‘సోషల్ మీడియాలో మమ్మల్ని కించపరిచే పోస్ట్‌లు’
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పార్లమెంట్ సభ్యుల్ని కించపరుస్తూ అనేక పోస్టులు వస్తున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కోరారు. ఆయన గురువారం రాజ్యసభ జీరో ఆవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. సామాజిక మాధ్యమాలు విస్తృతం అవడంతో ఎంపీలను, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ రాజకీయ ప్రత్యర్థులు తమను అవమానిస్తున్నారని ఎంపీ నరేష్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ఎదుర్కొవడానికి చట్టాల్లో మార్పులు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంపీల జీతభత్యాలపై ప్రజల్లో లేనిపోని అపోహాలు సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులు కల్పిస్తున్నారని నరేష్ అగర్వాల్ ఆరోపించారు. ఎంపీలకు అన్ని సౌకర్యాలు, వారికి జీతాలు అంత పెంచారు...ఇంత పెంచారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనివల్ల తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటువంటి పోస్టులను ఎదుర్కొవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట విధివిధానాల్ని రూపొందించాలని అన్నారు. కాగా, నరేష్ అగర్వాల్ వాఖ్యలు సభలో కాసేపు నవ్వులు విరిసాయి. మరోవైపు ఈ అంశంపై ఎంపీ నరేష్ అగర్వాల్‌కు కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా మద్దతు తెలిపారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ మాట్లాడుతూ..తాను కూడా సోషల్‌మీడియా బాధితుడినే అంటూ వాఖ్యానించారు. నరేష్ అగర్వాల్ వాఖ్యలపై పార్లమెంట్వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. ఈ అంశంపై ఏం చేయాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని, త్వరలో దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సభలో ప్రకటించారు. -
‘భగత్ సింగ్ ఉగ్రవాది కాదు’
న్యూఢిల్లీ: భగత్‌సింగ్ వంటి దేశభక్తులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావించిన రచయితలపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎంపీ నరేష్ అగర్వాల్ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇందుకు డిప్యూటీ చైర్ పర్సన్ పీజే కురియన్ స్పందిస్తూ ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. సమస్యను పరిష్కరించే విధంగా తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకున్నా భగత్‌సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉగ్రవాదులనే నెపంతో బ్రిటిష్ అధికారులు 1931లో లాహోర్‌లో విచారించి ఉరితీశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పాఠ్యపుస్తకంలో భగత్‌సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, సూర్య సేన్లు విప్లవాత్మక ఉగ్రవాదులంటూ ప్రచురితం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
‘ఉల్లి’ భారం తగ్గిస్తాం: కేంద్ర మంత్రి థామస్
న్యూఢిల్లీ: కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు 15-20 రోజుల్లో దిగొస్తాయని వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉల్లి పంట చేతికి రానుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్త పంట త్వరలోనే మార్కెట్‌కు రానుందని కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కె.వి.థామస్ చెప్పారు. ఉల్లిపాయలు, ఇతర అత్యవసర వస్తువుల ధరలు నింగినంటడంపై చర్చ జరగాలని రాజ్యసభలో శనివారం ఎంపీ నరేష్ అగర్వాల్ (ఎస్పీ) డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వల్పకాలిక చర్చ చేపట్టారు. మంత్రి థామస్ స్పందిస్తూ, జూలై-అక్టోబర్ మధ్యకాలంలో ఉల్లి ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. రబీ సీజన్లో దేశవ్యాప్తంగా 60 శాతమే ఉల్లి ఉత్పత్తి జరిగిందని చెప్పారు. మిగతాది ఖరీఫ్‌లో చేతికొస్తుందని తెలి పారు. ఉల్లిని దాచిపెట్టి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులను అరెస్టు చేసినట్లు చెప్పారు.