ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి | Bhagat Singh and comrades deserve Bharat Ratna | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి

Published Sun, Oct 27 2019 5:11 AM | Last Updated on Sun, Oct 27 2019 5:11 AM

Bhagat Singh and comrades deserve Bharat Ratna - Sakshi

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్‌ నేత, ఆనంద్‌పుర్‌ సాహెబ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్‌ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్‌ ఎ ఆజమ్‌’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్‌ విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్‌ తివారీ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement