భగత్‌సింగ్ ఉగ్రవాదట!
ఢిల్లీ వర్సిటీ చరిత్ర పుస్తకంలో ప్రచురితం
న్యూఢిల్లీ: భగత్‌సింగ్‌తోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఢిల్లీవర్సిటీ పుస్తకం విప్లవాత్మక ఉగ్రవాదులుగా పేర్కొంది. డీయూలోని బీఏ (చరిత్ర) కోర్సులో భాగంగా ఉన్న ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’ పుస్తకంలోని 20వ అధ్యాయంలో భగత్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్యసేన్‌తో పాటు పలువురు విప్లవాత్మక ఉగ్రవాదులని ప్రచురితమైంది. చరిత్రకారులు బిపిన్ చంద్ర, మృదుల ముఖర్జీ రాసిన ఈ పుస్తకంలో చిట్టాగాంగ్ ఉద్యమాన్ని, బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్యను ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు.
తాజాగా ఈ విషయం బయటపడటంతో దుమారం రేగింది. దీనికి అప్పటి కాంగ్రెస్ మంత్రులు, అధికారులు బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. భగత్ సింగ్ బంధువులూ వర్సిటీ పుస్తకాలపై మండిపడ్డారు. కాగా, హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై రాజ్యసభలో మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం వేసిన సభాహక్కుల తీర్మానాన్ని రాజ్యసభ స్వీకరించింది.