బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావులమీద వస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని, ప్రభుత్వం
మంత్రి పదవిలో ఉండే వారు ప్రైవేటు కంపెనీల్లో భాగస్వాములుగా ఉండడానికి వీలులేదని, అయితే కేటీఆర్ హిమాన్షు మోటార్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని తమ్మినేని తెలిపారు. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో, 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖకు కంపెనీ తరఫున కేటీఆర్ వివరాలను సమర్పించారన్నారు. మంత్రిగా ఉండి ఇలా చేయడం చట్టవిరుద్ధమని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యతతో కేటీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని చెప్పారు.