Minister Smriti Irani
-
తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మరువలేం
- ఢిల్లీ బతుకమ్మ ఉత్సవాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ - హాజరైన కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటల సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎ న్నటికీ మర్చిపోలేమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా తొలుత తెలంగాణ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ సంప్రదాయం ప్రకారం.. గౌరమ్మను పూజించి, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తానూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాననీ, ఆనాటి ఉద్యమ రూపాల్ని, ప్రజల స్పందనను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పండుగలకు, సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమనీ, పంటలన్నీ చేతికొచ్చాక ప్రజలు సంతోషంగా జరుపుకొనే ప్రకృతి పండుగ.. బతుకమ్మ అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద్ భాస్కర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని రాక
విజయవాడ (భవానీపురం) : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం నగరంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె నగరంలో పర్యటించనున్నట్లు ఉమామహేశ్వరరాజు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు వన్‌టౌన్ కేబీఎన్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో, సాయంత్రం 4గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. -
ఐఐటీ ప్రిపరేషన్‌కు యాప్
13భాషల్లో అందుబాటులోకి: కేంద్రమంత్రి స్మృతిఇరానీ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్‌పోర్టల్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అందుబాటులోకి తేనుంది. ఐఐటీ ఫ్యాకల్టీల ఉపన్యాసాలు, గత యాభై ఏళ్ల ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలను ఇందులో ఉచితంగా పొందవచ్చని బుధవారం ఇక్కడ ‘ఎడ్యుకేషన్ ప్రైవేట్ సొసైటీ ఫర్ ఇండియా’ (ఈపీఎస్ఎఫ్ఐ) నిర్వహించిన సభలో ఆ శాఖ మంత్రి స్మృతిఇరానీ వెల్లడించారు. అన్ని ప్రాంతాల వారికీ ఉప యుక్తంగా ఉండేలా 13 భాషల్లో పాఠ్య సామగ్రిని అందుబాటులో ఉంచుతామన్నారు. వ్యాపారాత్మకంగా మారిన కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘ఐఐటీ ప్రవేశపరీక్ష సన్నాహకాల్లో విద్యార్థులకు ఎదురయ్యే అతి ముఖ్యమైన అంశం కోచింగ్. ఈ క్రమంలో వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం ఐఐటీ-పాల్ పోర్టల్, మొబైల్ యాప్ రూపొందించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని మంత్రి తెలిపారు. నకిలీ విశ్వవిద్యాలయాలతో విద్యా రంగానికి మచ్చ తెచ్చేవారికి అడ్డుకట్ట వేసేందుకు ఈపీఎస్ఎఫ్ఐ కృషిచేయాలన్నారు. నూతన విద్యా విధానంపై స్మృతి మాట్లాడుతూ... దీనిపై అధ్యయనం చేసేందుకు మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. అలాగే మొబైల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుమూల గ్రామాలకూ విస్తరించేలా ‘భారత్‌వాణి’ మొబైల్ యాప్ రూపొందిస్తున్నామని తెలిపారు. 22 భాషల్లో స్టడీ మెటీరియల్ ఇందులో లభిస్తుందన్నారు. -
భగత్‌సింగ్ ఉగ్రవాదట!
ఢిల్లీ వర్సిటీ చరిత్ర పుస్తకంలో ప్రచురితం న్యూఢిల్లీ: భగత్‌సింగ్‌తోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఢిల్లీవర్సిటీ పుస్తకం విప్లవాత్మక ఉగ్రవాదులుగా పేర్కొంది. డీయూలోని బీఏ (చరిత్ర) కోర్సులో భాగంగా ఉన్న ‘ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్’ పుస్తకంలోని 20వ అధ్యాయంలో భగత్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్యసేన్తో పాటు పలువురు విప్లవాత్మక ఉగ్రవాదులని ప్రచురితమైంది. చరిత్రకారులు బిపిన్ చంద్ర, మృదుల ముఖర్జీ రాసిన ఈ పుస్తకంలో చిట్టాగాంగ్ ఉద్యమాన్ని, బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్యను ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. తాజాగా ఈ విషయం బయటపడటంతో దుమారం రేగింది. దీనికి అప్పటి కాంగ్రెస్ మంత్రులు, అధికారులు బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. భగత్ సింగ్ బంధువులూ వర్సిటీ పుస్తకాలపై మండిపడ్డారు. కాగా, హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై రాజ్యసభలో మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం వేసిన సభాహక్కుల తీర్మానాన్ని రాజ్యసభ స్వీకరించింది. -
ఉన్నతవిద్యలో మార్పులు: స్మృతి
సాక్షి, బెంగళూరు: ఉన్నతవిద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం కేంద్రం అనేక సంస్కరణలు చేపడుతోందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఎడ్యుకేషన్ ప్రమోషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఈపీఎస్ఐ) ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో భారత్ పురోగతిపై మంగళవారం జరిగిన సదస్సులో స్మృతి ఇరానీ పాల్గొన్నారు. విద్యావిధానం ఎలా ఉండాలన్నదానిపై దేశంలోని ఐదు వేలకుపైగా విద్యారంగ సంస్థల అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆమె చెప్పారు. ఉన్నత విద్యకు సంబంధించి వృత్తివిద్యా కోర్సుల పై కళాశాలలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రముఖ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, వైస్ చాన్స్లర్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరించింది. -
ఐఐటీ ఫీజు మూడురెట్లు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆమోదమే తరువాయి {పతి విద్యార్థికీ తనఖాలేని వడ్డీ రహిత రుణం న్యూఢిల్లీ: ఐఐటీల్లో విద్యాభ్యాసానికి అయ్యే వార్షిక ఫీజులను మూడురెట్లు పెంచే ప్రతిపాదన (ప్రస్తుత ఫీజు రూ. 90 వేలు)కు ఐఐటీ కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఈ పెంపును కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆమోదించాల్సి ఉంది. దీంతోపాటు, ఐఐటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల యోగ్యత తెలుసుకునేందుకు నేషనల్ అథారిటీ ఆఫ్ టెస్ట్ (న్యాట్) రూపొందించే పరీక్షను 2017 నుంచి నిర్వహించాలని కూడా ఐఐటీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ (ఎస్సీఐసీ) నిర్ణయించింది. ఐఐటీ బాంబే డెరైక్టర్ దేవాంగ్ ఖాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీ.. ఫీజును మూడు లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, ఐఐటీల ఆర్థిక వనరులను పెంచుకునే వివిధ మార్గాలను సూచించింది. అయితే, ఫెలోషిప్తో చదువుకునే పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కూడా ఈ పెంపును వర్తింపచేసే అవకాశాన్ని పరిశీలించాలని సబ్ కమిటీని ఎస్సీఐసీ కోరినట్లు తెలిసింది. ప్రతి ఐఐటీ విద్యార్థికి విద్యాలక్ష్మి పథకం కింద ఎలాంటి తనఖా పెట్టుకోకుండా.. వడ్డీ రహిత రుణాన్ని అందించాలని కూడా కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఎస్సీఐసీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి ఆమోదం లభిస్తే.. విదేశీ విద్యార్థులు కూడా ప్రస్తుతమున్న 4వేల డాలర్లకు బదులుగా 10వేల డాలర్ల ఫీజు కట్టా ల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు.. కనీసం ఎనిమిది దేశాల్లో ఐఐటీ పరీక్షను నిర్వహించాలని కూడా ఎస్సీఐసీ నిర్ణయించింది. ఐఐటీ విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించేలా అశోక్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ రూపొందించిన నేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (జేఈఈలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష) ను వచ్చే ఏడాది నుంచి నిర్వహించనున్నారు. ఐఐటీ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ఆన్లైన్లోనే ప్రభుత్వం కోచింగ్ అందించాలని కూడా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. -
మోక్స్’ ఈ లెర్నింగ్ విద్యార్థులకు ఉపయోగం
పొంగులేటి ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానం ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ (మోక్స్) అనే పథకాన్ని ఆమోదించిందని, ఇది ఈ-లెర్నింగ్ విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ‘స్వయం’ అనే ప్లాట్‌ఫాంలో ఈ స్కీమ్‌లను అభివృద్ధి చేసి 9 నుంచి 12 తరగతుల వరకు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెట్వర్క్, క్లౌడ్ ద్వారా అవగాహన కల్పిస్తారన్నారు. దేశంలో మోక్స్ ఆన్లైన్ కోర్సుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందా? ధ్రువీకరణ పత్రాలు, తదితర వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం స్వయం పథకం ద్వారా జారీ అయిన సర్టిఫికెట్లను గుర్తించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మైక్రో, మధ్య సంస్థల్లో మేథో సంపత్తి హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారా? అని ఎంపీ పార్లమెంట్లో ప్రశ్నించారు. ఎంఎస్ఈఎం సంస్థలు ఎంతవరకు లబ్ధిపొందాయని, ఏమైనా కొత్త కేంద్రాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందా? అని అడిగారు. దీనికి సంబంధిత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమాధానమిస్తూ డెవలప్మెంట్ కమిషనర్ మైక్రో, చిన్న, మధ్యతరగతి సంస్థల మంత్రిత్వ శాఖ ఐపీఆర్మీద బిల్డింగ్ అవగాహన విషయంలో అమలు చేస్తున్నామని, ఎంఎస్ఎంఈ సంస్థలక -
రాహుల్ అబద్ధాల కోరు
అమేథీలో స్మృతి ఇరానీ విమర్శనాస్త్రాలు * సైకిల్ ఫ్యాక్టరీ భూమిని రాజీవ్ ట్రస్ట్ ఎలా కొనుగోలు చేసిందని నిలదీత అమేథీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంతగడ్డపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అమేథీలో సైకిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఉన్న భూమిని ఆయన కుటుంబం అధీనంలోని ట్రస్ట్ ఎలా కొనుక్కుందని మండిపడ్డారు. రాహుల్ అబద్ధాల కోరు అని దుయ్యబట్టారు. ఆదివారమిక్కడ జరిగిన సభలో స్మృతి ఇరానీ మాట్లాడారు. అమేథీ అభివృద్ధి కోసం ఎన్నో హామీలు కురిపించిన గాంధీ కుటుంబం చేతల్లో మాత్రం ఏమీ చేయలేదని ఎద్దేవాచేశారు. సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ కోసం ఉన్న 65 ఎకరాల భూమిని గత ఫిబ్రవరి 24న రాజీవ్‌గాంధీ ట్రస్ట్ కొనుగోలు చేసిందని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ‘80ల్లో సైకిల్ ఫ్యాక్టరీ కోసం రైతుల నుంచి భూమిని తీసుకున్నారు. ఫ్యాక్టరీ రాలేదు. ఒక్క ఉద్యోగమూ రాలేదు.ఈ భూమి ఏమైందని ఏ ఒక్కరూ ధైర్యం చేసి ప్రశ్నించరు. అయితే భూమిని రాజీవ్ ట్రస్ట్ కొనుగోలు చేసినట్లు స్టాంప్ పత్రాలుఉన్నాయి’ అని చెప్పారు. రాహుల్ భూసేకరణ బిల్లుపై మాట్లాడేటప్పుడు రైతుల భూములను ఇతరులు ఒక్క అంగుళమూ తీసుకోవడానికి అనుమతించబోమని చెబుతారు.. అంటే ఆ భూములను తానే స్వయంగా తీసుకుంటానన్నది ఆయన ఉద్దేశమంటూ ఆమె మండిపడ్డారు. స్మృతి ఇరానీ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ మూసివేతకు, భూమి కొనుగోలుకు సంబంధమేంటని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా వేలం జరిగిందని, నిరాధార ఆరోపణలు చేస్తూ మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. -
గురుకులాల ఏర్పాటుకు సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గురుకుల పాఠశాలల ఏర్పాటు పథకానికి సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి 10 చొప్పున.. 1,190 గురుకులాలను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీటి ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బుధవారమిక్కడ కొత్త విద్యావిధానం అమలు తీరుతెన్నులపై కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. బాలికా విద్య కోసం కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త విద్యా విధానం ద్వారా ్రైపైవేటు, ప్రభుత్వ పాఠశాలల మధ్య అంతరం మరింత పెరిగే ప్రమాదం ఉందని, దీనిపై ప్రాథమిక, ఉన్నత పాఠశాల, సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో ఉప కమిటీలు ఏర్పాటు చేసి సంప్రదింపులు చేస్తే బాగుంటుందని సూచించారు. తాము సంప్రదింపుల ప్రక్రియను వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో మొదలుపెడతామని చెప్పారు. విద్యాహక్కు చట్టం ద్వారా లాభనష్టాలున్నాయని, వాటిని సమీక్షించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల నుంచి 25 శాతం పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించి, వారి ఖర్చులను ప్రభుత్వమే తిరిగి చెల్లించే ప్రక్రియలో అవినీతికి ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు బడులకు చెల్లించే డబ్బును ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఉపాధ్యాయుల భర్తీ, అత్యున్నత శిక్షణకు వినియోగిస్తే సర్కారు బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. తెలంగాణలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఆ విషయం తెలియదు నాయకులు, అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజ్యాంగపరంగా అమలు చేయవచ్చో.. లేదో..? న్యాయపరంగా ఎలా ఉంటుందో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో అలహాబాదు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అడిగిన ప్రశ్నకు కడియం బదులిచ్చారు. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాల్లో యోగ్యులైన టీచర్లున్నారని, సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రావడంలేదన్నారు. -
స్మృతి ఇరానీకి వెసులుబాటు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ హైకోర్టు ఆమెకు మినహాయింపునిచ్చింది. కేంద్రమంత్రి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు పరస్పరం పిటిషన్ దాఖలు చేసుకున్న క్రమంలో గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వారిద్దరి మధ్య రాజీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్మృతి ఇరానీ ఆగస్టు ఒకటిన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆమె పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం ఆమోదించింది. 2012 గుజరాత్ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన టీవీ చర్చలో తనను స్మృతి దుర్భాషలాడారని సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఇదే విషయంపై స్మృతి కూడా నిరుపమ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పరం రాజీపడాలని ఢిల్లీ కోర్టు గతంలో సూచించింది. అయితే నిరుపమ్ తరఫున న్యాయవాది రాజీకి సిద్ధ పడగా, స్మృతి తరఫు న్యాయవాది దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో వివాదం కొనసాగుతోంది. -
ఐఐఎం ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కడియం విజ్ఞప్తి న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్‌తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐఐఎం ఏర్పాటు వీలు పడదని, వచ్చే విద్యాసంవత్సరంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై కూడా పరిశీలిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. దత్తాత్రేయతో కడియం భేటీ కడియం శ్రీహరి శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. ఐఐఎం ఏర్పాటు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, ఖాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్రంతో సంప్రదించాలని కోరారు. అందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీకి రెండు హైకోర్టులు ఉండాలని, ఆ దిశగా చర్యలు చేపడుతోందని దత్తాత్రేయ తెలిపారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలసి వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపై చర్చించారు. వారం రోజుల్లో అనుమతి ఉత్తర్వుల జారీకి హామీ ఇచ్చినట్లు కడియం తెలిపారు. ఆయన వెంట ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు. -
స్మృతి డిగ్రీలు నకిలీవేమో.. ఆమె నిజం
పట్నా: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీలు నకిలీవి కావచ్చునేమో కానీ.. ఆమె నకిలీ కాదని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆమె తన విద్యార్హతలను తప్పుగా చూపారంటూ దాఖలైన కేసును ఢిల్లీ కోర్టు స్వీకరించటంపై లాలు గురువారం పట్నాలో స్పందించారు. ‘డిగ్రీలతో చేసేదేముంది? ఇరానీ నిజంగా ఉన్నారు. ఆమె ఒక మహిళ. ఆమె ‘సాస్ భీ కభీ బహూ థీ’ టీవీ సీరియల్లో నటించారు. ఆమె నన్ను గౌరవిస్తారు’ అని విలేకరులతో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం మొత్తం నకిలీదని విమర్శించారు. -
ఐఐటీ ముట్టడి
కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు గర్జించాయి. చెన్నై ఐఐటీ వద్ద తీవ్రస్థాయిలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫొటోను త గలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఐఐటీలో దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నతవిద్య నభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగానే అనేక విద్యార్థి సంక్షేమ సంఘాలు వెలిశాయి. ఎవరికి వారు తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. ఇలా ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ విద్యార్థి సంఘం ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రధాని మోదీ పరిపాలన, పథకాల ను విమర్శించడమేగాక కరపత్రాలు ముద్రించి ప్రచారం చేపట్టింది. సదరు విద్యార్థి సంఘం కార్యకలాపాలను మద్రాసు ఐఐటీ యాజమాన్యం ఈనెల 7వ తేదీన కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ దృష్టికి తీసుకెళ్లింది. విద్యార్థి సంఘం సమావేశంలో రాజకీయాలను ప్రస్తావించడమేగాక, ప్రధాని మోదీపై కరపత్రాలు ప్రచురించినందుకు ప్రతిచర్యగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సదరు విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. సంబంధిత శాఖా మంత్రి స్మృతిఇరానీ సైతం విద్యార్థి సంఘం రద్దును సమర్థించారు. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. వివిధ విద్యార్థి సంఘాలన్నీ ఏకమై చెన్నై అడయారులోని ఐఐటీ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఓఎంఆర్ రోడ్డు నుంచి మధ్యకైలాష్ మీదుగా ఐఐటీ ప్రధాన ద్వారం వరకు వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా నడిరోడ్డుపై నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తందెపైరియార్ ద్రావిడ కళగం, పురట్చికర మానవర్, ఇలైంజర్ మున్నని, ఇండియ జననాయక వాలిబర్ సంఘం తదితర సంఘాలకు చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి స్మృతి ఇరానీ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అయితే పోలీసులు మధ్యలో అడ్డుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు గంటపాటు సాగిన ఆందోళన కారణంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించి పోయింది. మద్రాసు ఐఐటీని ముట్టడిం చేందుకు దూసుకురాగా బ్యారికేడ్లతో పోలీ సులు అడ్డుకున్నారు. ముట్టడి, ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినులు సైతం పోలీసులకు భయపడకుండా ఆందోళనలో పాల్గొని అరెస్టయ్యారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం శాస్త్రి భవన్ వద్ద కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు ఆందోళన జరిపారు. సుమారు రెండు వందల మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనల కారణంగా ఐఐటీ, శాస్త్రిభవన్ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అరెస్టయిన విద్యార్థులను సమీపంలోని కల్యాణ మండపంలో ఉంచారు. అలాగే పుదుచ్చేరిలో రైలురోకోకు యత్నించిన విద్యార్థులను పోలీ సులు అరెస్టు చేశారు. విద్యాసంస్థకు చెందిన వివాదాన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కోరారు. రాజకీయ లబ్ధికోసం కొందరు గొడవలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థి సంఘంపై తీసుకున్న రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలని ఎండీఎంకే అధినేత వైగో విజ్ఞప్తి చేశారు. -
బీమా పథకాలు చరిత్రాత్మకం
కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్: సామాన్యుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ఒకేరోజు 3 బృహత్ బీమా పథకాలను ప్రారంభించడం చరిత్రాత్మకమని, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజునే ఈ పథకాల్ని ప్రారంభించడం శుభసూచకమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పింఛన్ యోజన పథకాలను హైదరాబాద్ కేంద్రంగా శనివారం ఆమె ప్రారంభించారు. పలు బ్యాంకుల ద్వారా పథకాలను నమోదు చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలనే యోచనతోనే కేంద్రం బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సురక్ష బీమా పథకం కింద నెలకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 12 చెల్లిస్తే రూ. 2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. కేవలం కాఫీ తాగే ఖర్చుతో రూ. 2 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. జన్‌ధన్ యోజన ద్వారా ప్రతి పౌరుడికీ బ్యాంకు ఖాతా కల్పించామన్నా రు. దేశ ఆర్థికాభివృద్ధి పథంలో ఈ పథకాలు చరిత్రాత్మకంగా నిల్చిపోతాయని స్మృతి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జన్‌ధన్ యోజన కింద రాష్ట్రం లో 63 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు తెరి చామన్నారు. కోల్‌కతా కేంద్రంగా ప్రధాని మోదీ బీమా పథకాల్ని ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం విశ్వనాథన్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సీతాపతి శర్మ, రిజర్వ్ బ్యాంక్ జీఎం జి.ఆర్. రపోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, ఎన్వీవీఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ లోథా, జి.సాయన్న, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి హైదరాబాద్‌లో అత్యాధునిక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకుడు శంకర్.. స్మృతి ఇరానీని కోరారు. శనివారం ఆయన కేంద్ర మంత్రిని కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కాగా కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన బీమా పథకాలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా హన్మకొండలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రారంభించారు. -
లైబ్రరీలోకి అమ్మాయిలు రావొద్దు!
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు అమ్మాయిలొస్తే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందన్న వీసీ వెల్లువెత్తిన నిరసనలు; నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం అలీగఢ్: ‘అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు’ అంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. షా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం వీసీ జమీరుద్దీన్ షా నుంచి వివరణ కోరింది. ‘మనకు స్వాతంత్య్రం లభించింది అంటే.. విద్య, రాజ్యాంగ హక్కులు అందరికీ సమానమేనని భావిస్తున్నాం. అయితే, మన మనోభావాలు దెబ్బతినే, మన కూతుళ్లు అవమానపడేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి’ అని ఢిల్లీలో మౌలానా ఆజాద్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఏఎంయూ వీసీ నుంచి నివేదిక కోరామన్నారు. విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జమీరుద్దీన్ షా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీకి చెందిన అండర్గ్రాడ్యుయేట్ అమ్మాయిలను ప్రధాన ‘మౌలానా ఆజాద్’ లైబ్రరీలోకి అనుమతించకపోవడంపై మాట్లాడుతూ.. ‘ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాదు. మౌలానా ఆజాద్ లైబ్రరీలో తగినంత స్థలం లేదు. ఇప్పటికే అది నిండిపోయింది. అబ్బాయిలు కూర్చోడానికే స్థలం లభించడం లేదు’ అన్నారు. అయితే, తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంగళవారం షా వివరణ ఇచ్చారు. పీజీ చదువుతున్న వారందరినీ వర్సిటీ లైబ్రరీలోకి అనుమతిస్తున్నామని, డిగ్రీ కోర్సుల్లో ఉన్న 2,500 మంది అమ్మాయిలను మాత్రం రానివ్వడం లేదని పేర్కొన్నారు. వారంతా ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారని, అక్కడి లైబ్రరీనే వారు వినియోగించుకోవచ్చునని చెప్పారు. ‘యూనివర్సిటీలో దాదాపు 4 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులు ఉన్నారు. వారందరినీ అనుమతిస్తే లైబ్రరీలో స్థలం సరిపోదు. అందువల్లే వారిని అనుమతించడం లేదు. ఇవేమీ కొత్తగా విధించిన ఆంక్షలు కావు. 1960లో లైబ్రరీ ఏర్పాటైనప్పటి నుంచీ ఈ నిబంధన కొనసాగుతోంది. మహిళా సాధికారతకు మేం వ్యతిరేకం కాదు’ అని వివరించారు. లైబ్రరీలోకి తమను అనుమతించకపోవడంపై విద్యార్థినులు మండిపడుతున్నారు. కూర్చుని చదువుకునేందుకు అనుమతించకపోయినా.. కనీసం పుస్తకాలు తెచ్చుకునేందుకైనా అనుమతించాలని కోరుతున్నారు. ఇది షాకింగ్..: కాగా, ఏఎంయూ వీసీ వ్యాఖ్యలను కేంద్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన మంత్రులు నజ్మా హెప్తుల్లా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తప్పుబట్టారు. వీసీ వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నాయని నజ్మా హెప్తుల్లా, నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని నఖ్వీ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకుండా, లైబ్రరీని వినియోగించరాదంటూ కొందరిపై నిషేధం విధించడం సరికాదని సామాజికన్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. యూనివర్సిటీ అధికారుల మహిళా వ్యతిరేక మనస్తత్వానికి ఈ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని మరోమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యానించారు. ఈ వివక్షను తక్షణమే ఆపాలంటూ జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. హుందాగా ఉండే, సరైన దుస్తులనే ధరించాలని, ఒకటి కన్నా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడరాదంటూ విద్యార్థినులకు నిబంధనలు విధించి గతంలోనూ ఈ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం గమనార్హం.