నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని రాక | Union Minister Smriti Irani today arrival | Sakshi
Sakshi News home page

నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని రాక

Published Tue, Jun 7 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని రాక

నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరాని రాక

విజయవాడ (భవానీపురం) : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం నగరంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు సోమవారం ఓ  ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె నగరంలో పర్యటించనున్నట్లు ఉమామహేశ్వరరాజు తెలిపారు.  ఉదయం 11.30 గంటలకు వన్‌టౌన్ కేబీఎన్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో, సాయంత్రం 4గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement