మోక్స్’ ఈ లెర్నింగ్ విద్యార్థులకు ఉపయోగం
పొంగులేటి ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానం
ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్ (మోక్స్) అనే పథకాన్ని ఆమోదించిందని, ఇది ఈ-లెర్నింగ్ విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ‘స్వయం’ అనే ప్లాట్‌ఫాంలో ఈ స్కీమ్‌లను అభివృద్ధి చేసి 9 నుంచి 12 తరగతుల వరకు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నెట్‌వర్క్, క్లౌడ్ ద్వారా అవగాహన కల్పిస్తారన్నారు. దేశంలో మోక్స్ ఆన్‌లైన్ కోర్సుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందా? ధ్రువీకరణ పత్రాలు, తదితర వివరాలను వెల్లడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం స్వయం పథకం ద్వారా జారీ అయిన సర్టిఫికెట్లను గుర్తించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మైక్రో, మధ్య సంస్థల్లో మేథో సంపత్తి హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారా? అని ఎంపీ పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఎంఎస్‌ఈఎం సంస్థలు ఎంతవరకు లబ్ధిపొందాయని, ఏమైనా కొత్త కేంద్రాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందా? అని అడిగారు. దీనికి సంబంధిత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమాధానమిస్తూ డెవలప్‌మెంట్ కమిషనర్ మైక్రో, చిన్న, మధ్యతరగతి సంస్థల మంత్రిత్వ శాఖ ఐపీఆర్‌మీద బిల్డింగ్ అవగాహన విషయంలో అమలు చేస్తున్నామని, ఎంఎస్‌ఎంఈ సంస్థలక