Diwas
-
Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్)గా జరుపుకుంటారు. దేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉపకరించేలా ప్రభుత్వం అందిస్తున్న కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ ఆరు వేలు ఆర్థిక సహాయంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందిస్తారు. ఈ మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది.2. ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ధన్ యోజన (పీఎం-కేఎంవై) ఈ పథకం లక్ష్యం రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ప్రతీనెలా రూ. 55 నుంచి రూ. 200 వరకూ ఈ పథకంలో చెల్లిస్తే, వారికి 60 ఏళ్లు వచ్చాక ప్రతీనెలా రూ. 3,000 పెన్షన్ రూపంలో పొందవచ్చు.3. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ఈ పథకం కింద, రైతులు నారు వేయడం లేదా విత్తనం నాటడం నుండి పంట కోసే వరకు పంటల రక్షణ కోసం బీమాను అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి ఇది రైతులకు సహాయపడుతుంది.4. జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ (ఎన్బీహెచ్ఎం) తేనెటీగల పెంపకానికున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించడమే ఈ పథకం లక్ష్యం. ‘తీపి విప్లవం’ లక్ష్యాన్ని సాధించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తేనెటీగల పెంపకందారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.5. నమో డ్రోన్ దీదీప్రభుత్వం ఇటీవలే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందజేస్తున్నారు. గ్రామాల్లో నివసించే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం.6. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ (కేసీసీ)ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుంది. అలాగే రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది.ఇది కూడా చదవండి: తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్ -
దేశంలో హిందీపై వ్యతిరేకత ఎందుకు?
నేడు (సెప్టెంబరు 14) హిందీ దినోత్సవం. దీనిని హిందీ పక్షోత్సవంగానూ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పలుచోట్ల హిందీ భాషకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందీకి తగిన గౌరవం అందించేందుకే హిందీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో అత్యంత విస్తృతమైన మనుగడ కలిగిన ఈ భాషకు దేశ జాతీయ భాష హోదాను ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయి. హిందీని దేశ జాతీయ భాషగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా పలు చోట్ల ప్రజలు నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో హిందీ చాలా విస్తృతంగా మాట్లాడే భాష. ఇది అనేక విభిన్న మాండలికాలు, రూపాలను కలిగి ఉంది. ప్రాథమికంగా హిందీ ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు చెందిన ఇండో-ఆర్యన్ సమూహం మాట్లాడే భాషగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో అధికారిక భాషగానూ కొనసాగుతోంది. స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి హిందీకి తగిన గౌరవం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హిందీపై వ్యతిరేకత ఏర్పడటానికి దాని చరిత్ర, నేపథ్యం కూడా కారణంగా నిలుస్తోంది. హిందీ భాష దేశంలోని ఇతర రాష్ట్రాలకు చేరుకోగలిగినంత సులభంగా తమిళనాడు, కేరళకు చేరుకోలేకపోయింది. బ్రిటీష్ వారు సముద్ర మార్గం ద్వారా దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాలకు చేరుకున్నారు. అక్కడి నుంచే ఉత్తర భారతదేశంలోకి తమ చొరబాట్లను విస్త్రృతం చేశారు. ఫలితంగా ఆ రెండు రాష్ట్రల్లో ఇంగ్లీష్ భాషా వినియోగం అధికంగా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాదిరిగా ఈ రాష్ట్రాల ప్రజలు హిందీలో మాట్లాడటం సులభతరంగాలేదని భావించారు. దీంతో ఈ రాష్ట్రాల్లో హిందీని విదేశీ భాషగా వర్ణించే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కేరళ ప్రజలు తమపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించడానికి ఇదే కారణంగా నిలిచింది. 1937లో స్వాతంత్ర్య సమరయోధుడు సి రాజ్‌గోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రాజ్యాంగ సభలో హిందీని అధికార భాషగా చేయడంపై చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో మరోసారి నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశంలో హిందీకి ఎదురవుతున్న వ్యతిరేకతను పరిణలోకి తీసుకుని, 1950లో కేంద్ర ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాల పాటు ఆంగ్లంతో పాటు ఇతర భాషలు దేశంలో అధికారిక భాషలుగా ఉండాలనే నిర్ణయం తీసుకుంది. అయితే 1965లో హిందీపై వ్యతిరేకత మరోసారి మొదలైంది. దీంతో 1950లో తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని ప్రభుత్వం తీర్మానించింది. కాగా భాషకు సంబంధించి కేంద్రం నుంచి ఎప్పుడైనా ఏదైనా చట్టం, ప్రతిపాదన వచ్చినప్పుడల్లా హిందీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్‌లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
రేపు సెలవు ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ : షాహిద్ దివస్ సందర్భంగా రేపు అంటే మార్చి 23న సెలవుగా ప్రకటించాలని శిరోమణి అకాళీ దళ్ పార్టీ కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుముజ్రా గురువారం లోక్‌సభలో ఓ లేఖను సమర్పించారు. ‘వారి గౌరవార్థం పార్లమెంట్‌కు సెలవు దినం ప్రకటించాలి. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశాను. ఆమె సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని ప్రేమ్ సింగ్ మీడియాకు తెలిపారు. గదర్ కుట్రలో నిందితులుగా తేలటంతో లాహోర్‌లోని జైల్లో 1931, మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీశారు. వారి గుర్తుగా మార్చి 23ను ప్రతీ ఏటా షాహిద్ దివస్‌గా జరుపుకుంటున్నాం. అంతేకాదు పార్లమెంట్ హౌజ్‌లోలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాడు(1929, ఏప్రిల్8వ తేదీన) భగత్ సింగ్, భటుకేశ్వర దత్‌లు చేసిన బాంబు దాడికి గుర్తుగా సందర్శకుల గ్యాలెరీలో వారికి రెండు కుర్చీలు కేటాయించాలని అకాళీదల్ కోరింది. -
వైభవంగా మరాఠీ భాషా దినోత్సవం..
ముంబై: మహరాష్ట్రలో భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మరాఠీ సాహిత్యకారుడు వి.వి.షిర్వాద్కర్, అలియాస్ కుసుమగరాజ్ జయంతి సందర్భంగా జరిపే మహరాష్ట్ర భాషా దివస్ ను పురస్కరించుకొని పలు సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా షిర్వాద్కర్ స్వంత గ్రామం నాసిక్ లో కుసుమగరాజ్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. భాషా దినోత్సవం సందర్భంగా మహరాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని సుమారు 568 బస్ స్టేషన్ల నుంచి 18,000 బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి బస్సుకు కుసుమగరాజ్ సహా.. పలువురు ప్రముఖుల కవితలు, సాహిత్యంతో కూడిన హోర్డింగులు, బ్యానర్లతో ప్రత్యేకంగా అలంకరించడం సాహిత్యాభిమానులను అమితంగా ఆకర్షించింది. 1999 లో జ్ఞానపీఠ్ అవార్డు అలంకరించిన కుసుమగరాజ్ మరణం తర్వాత మహరాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును మరాఠి రాజ్యభాషా గౌరవ దినంగా నిర్వహిస్తూ... మరాఠీ సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది నుంచి మరాఠీ సాహిత్యంలో ప్రతిభ చూపిన ఇద్దరికి ప్రత్యేక పురస్కారాలు అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా మొదటి భాషా సంవర్థక్ అవార్డును అహ్మద్ నగర్ కు చెందిన కూరగాయల వ్యాపారి బెబితాయ్ గైక్వాడ్ కు అందించింది. తన సంపాదనలో ప్రతిరోజూ ఐదు రూపాయల చొప్పున పొదుపుచేసి సుమారు 900 పుస్తకాలను కొనేందుకు వెచ్చించిన హైస్కూల్ డ్రాపవుట్ బెబితాయ్ ఇప్పటివరకూ సుమారు 3,000 మరాఠీ సాహిత్య పుస్తకాలను చదివింది. పార్టీలో మరాఠీ అనుకూల వైఖరి ఉన్నప్పటికీ తమ పిల్లలను కాన్వెంట్ చదువులకు పంపడంపై వేడుకలకు హాజరైన ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ థాకరే సమర్థించుకున్నారు. -
గో పూజ నిర్వహించిన స్వామి పరిపుర్ణానంద