చండీఘర్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నా విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకను పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా. తాజాగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. బాదల్ తన లేఖలో.. రైతుల పట్ల కేంద్రం తీసుకున్న చర్య పట్ల తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైతుల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కారణంగా అలాంటి రైతులు బాధ పడుతుంటే.. ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషన్ పురస్కారం వల్ల వచ్చిన గౌరవం తనకు అవసరం లేదని బాదల్ రాసుకోచ్చారు.
కాగా 2015లో భారత ప్రభుత్వం బాదల్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేటి కేంద్ర మంత్రుల భేటీలో రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment