సాక్షి, చండీగర్ : కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూపై పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ విరుచుకుపడ్డారు. సిక్కుల స్మారకచిహ్నాలను అవమానించిన సిద్ధూను ఆయన కోతితో పోల్చారు. సిద్ధూ కోతి మాదిరిగా వ్యవహరిస్తూ తాము నిర్మించిన సిక్కు మెమోరియల్స్‌ను తెల్ల ఏనుగులని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. సిక్కు చరిత్రకు చిహ్నమైన విరాసత్ ఈ ఖల్సా తెల్ల ఏనుగని ఆయన భావిస్తున్నారా అంటూ అకాలీదళ్ నేత ప్రశ్నించారు.
సిక్కుల చరిత్రకు, మత, సంస్కృతికీ ప్రతీకైన విరాసత్ ఈ ఖల్సాపై సిద్ధూ ప్రకటన ఆమోదయోగ్యం కాదన్నారు. దీన్ని వాణిజ్య సంస్థగా తీర్చిదిద్దేందుకు పాలక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి బాదల్ ఇటీవల దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిక్కు వ్యతిరేక అల్లర్లను రాజీవ్ స్వయంగా పర్యవేక్షించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment