'ఉడ్తా పంజాబ్లో ఆ మాటలకు షాక్ అయ్యా..'
పంజాబ్: ఉడ్తా పంజాబ్ చిత్రంపై తొలిసారి ప్రభుత్వం తరుపున స్పందించారు. ఈ చిత్రంలో కొన్ని మాటలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. కొన్ని కులాలను, వ్యవస్థలను తప్పుబట్టేలా ఎన్నో మాటలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కంజర్, బంజర్ లాంటి పదాలు విని తాను షాక్ అయ్యానని చెప్పారు. ఈ చిత్రానికి అనుమతిని ఇచ్చి ప్రశాంతంగా ఉన్న పంజాబ్ వాతావరణాన్ని ఎలా చెడగొట్టమని అంటారని ప్రశ్నించారు.
కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా చాలా సినిమాలు వస్తుంటాయని, అలాంటి చిత్రాల్లో ఇదొకటి అని, దీనిని అనుమతిస్తే పంజాబ్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థానంలో ఉన్న, రాజకీయాల్లో ఉన్నా, ఒక అధికారిగా ఉన్నా లేక మరింకేదైన స్థాయిలో ఉన్నా సరే.. ఒక ఏవగింపు కలిగించేలా, ఒకరిని కించపరిచేలా రూపొందించిన ఒక అంశాన్ని ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పంజాబ్ సమాజంలోకి ఎలా వదలమని పెట్టమంటారు అని ప్రశ్నించారు. ఈ చిత్రంపై తమకు ఏవిధమైన రాజకీయ కక్ష సాధింపు లేదని అన్నారు.