
తాజాగా అతడు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇంటికి ఓ గిఫ్ట్ పంపి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇవి అందుకున్న ఆమె "ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి..
Bhagyashree: ప్రభాస్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్ చేస్తుంటాడు. సెట్‌లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్ సరదాగా, స్నేహంగా మెదులుతాడు. ఏదైనా పండుగలు, పుట్టినరోజులతో పాటు సాధారణ సమయాల్లోనూ వారికి ఏవైనా స్పెషల్ గిఫ్ట్‌లు పంపుతూ సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. తాజాగా అతడు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇంటికి ఓ గిఫ్ట్ పంపి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇది చూసిన భాగ్యశ్రీ దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేఇసంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారు? నోరూరించే పూత రేకులు. తన సహనటి భాగ్యశ్రీకి పూతరేకులు గిఫ్ట్‌గా పంపాడు. ఇవి అందుకున్న ఆమె "ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్, మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు" అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌లో భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు.
Another stack of the tasty hyderabadi sweets #pootharekulu
— bhagyashree (@bhagyashree123) July 1, 2021
Thank you #Prabhas ... you spoil me. pic.twitter.com/em1A6RbGpE