
ప్రభాస్
యూరప్ చుట్టేయడానికి రెడీ అయ్యారు ప్రభాస్. తనతో పాటు పూజా హెగ్డే కూడా తోడయ్యారని సమాచారం. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్). యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ తల్లి పాత్రలో ‘మైనే ప్యార్ కియా’ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ చిత్రకథ ఉండబోతోందట. ప్రస్తుతం యూరప్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నారు. ఈ ఏడాది దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment