Pootharekulu
-
రుచితో అదరగొట్టే మధురాలు, ఈ పూతరేకులు
-
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం.. ఫలించిన మూడేళ్ల కృషి
ఒక్కో ప్రాంతానికి వేరువేరు ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన రుచులు ఉంటాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు వంటల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆత్రేయపురం పూతరేకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. పూతరేకులకు పుట్టిల్లుగా ఉంది ప్రస్తుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం. పూతరేకు అనగానే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆత్రేయపురం పూతరేకులకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం అంటే గుర్తుకు వచ్చేది పూతరేకు. పూతరేకు అంటే గుర్తుకువచ్చేది ఆత్రేయపురం. ఈ రెండింటి మధ్య అంత బంధం ఉంది. తాజాగా ఆ బంధం మరింత బలపడింది. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ)తో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేరింది. తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న పూతరేకుల తయారీలో ఈ ఊరికే పూర్తిస్థాయి గుర్తింపు..హక్కులు ఉన్నాయని తేలింది. ఈ నెల 15న విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. నాలుగు శతాబ్దాల పేద మహిళల నైపుణ్యం, కష్టానికి గుర్తింపు దక్కే అపూర్వ సన్నివేశం ఆరోజు ఆవిష్కారం కానుంది. జీఐ కోసం ఎంతో కృషి తమ ఊరితో ఇంతగా అనుబంధాన్ని పెనవేసుకున్న పూతరేకుకు భౌగోళిక గుర్తింపు రావాలని ఆత్రేయపురం వాసులు చాన్నాళ్లుగా కోరుకుంటున్నారు. మూడేళ్లుగా ఇందుకోసం గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ధర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల సంక్షేమ సంఘంతోపాటు మరికొందరు ఈ ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ విభాగం ఆధ్వర్యంలో లా స్టూడెంట్స్ వీరికి కృషికి తోడయ్యారు. ఆత్రేయపురం వచ్చి పూతరేకుకూ ఈ గ్రామానికి ఏర్పడిన విడదీయరాని బంధానికి సంబంధించి వివిధ ఆధారాలను సేకరించారు. ఉపాధిగా మారి ఎగుమతుల స్థాయికి చేరిన ఈ ఆహార ఉత్పత్తిపై డాక్యుమెంట్లను తయారు చేశారు. 2021 డిసెంబర్ 13న చైన్నెలోని జియో ఐడెంటిటీ కార్యాలయానికి అధికారికంగా దరఖాస్తును సమర్పించారు. కొద్ది నెలల అనంతరం చైన్నె కార్యాలయంలో దరఖాస్తు ప్రాసెస్ మొదలైంది. ఆధారాలతో సహా హాజరుకావాలని ఇక్కడివారికి ఆహ్వానం అందింది. ఆత్రేయపురం నుంచి ఏడుగురు సభ్యులు జీఐ కార్యాలయానికి వెళ్లారు. వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది నిపుణులు వీరిని లోతుగా ప్రశ్నించారు. సమాధానాలు రాబట్టారు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా హాజరైన ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన గోనెల రాజేంద్రప్రసాద్ జీఐ అధికారుల ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వగలిగారు. దీంతో వారు సంతృప్తి చెందారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న జీఐ జర్నల్ ఆత్రేయపురం పూతరేకుల గురించి ప్రచురించింది. దీనిపై అభ్యంతరాలుంటే 120 రోజుల్లో తెలియజేయాలని సూచించింది. ఈ గడువు జూన్ 13వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో ఆత్రేయపురం వాసుల కల నెరవేరింది. భౌగోళిక గుర్తింపు(GI) లభించింది. -
పూతరేకులు..చాలా ఈజీ
సాక్షి, అనకాపల్లి: పూతరేకులంటే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఆత్రేయపురం. ఆంధ్ర సంప్రదాయ స్వీట్ల వంటకాల్లో వీటిది ప్రత్యేక స్థానం. నోట్లో వేస్తే చటక్కున కరిగిపోయే లక్షణమున్న వీటిని ఉమ్మడి తూర్పు గోదావరి, విజయనగరం– విశాఖపట్నం, గుంటూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సాధారణ పద్ధతుల్లో ఎక్కువగా తయారుచేస్తుంటారు. కానీ, ఈ ప్రాంతాలు ఆత్రేయపురం అంత ప్రసిద్ధి కాదనే చెప్పుకోవచ్చు. ఇక సంప్రదాయ పద్ధతిలో కొంచెం కష్టతరమైన వీటి తయారీ ఇప్పుడు చాలా సులభతరమైంది. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు వీటి తయారీకి ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. సాధారణ పద్ధతిలో తయారీ ఇలా.. పూతరేకుల తయారీకి ప్రత్యేకంగా తయారుచేసిన మట్టికుండను వాడతారు. కుండ పైభాగం నున్నగా వెడల్పుగా ఉంటూ. మంటపెట్టడానికి కింది భాగంలో రంధ్రాన్ని పెడతారు. ఇక బియ్యాన్ని ఒకరోజు ముందుగా నీటిలో నానబెట్టి మరుసటి రోజు రుబ్బురోలులో రుబ్బేవారు. ఈ ప్రక్రియ కష్టతరంగా మారడంతో మారుతున్న కాలానుగుణంగా గ్రైండర్లలో రుబ్బుతున్నారు. ఇలా.. మెత్తగా రుబ్బిన పిండిలో తగిన మోతాదులో నీటిని కలిపి పలచగా జాలుగా వచ్చేలా చేస్తారు. బోర్లించిన కుండ అడుగుభాగం నుంచి కొబ్బరి ఆకులతో సన్నని మంట పెడుతూ కుండ వేడెక్కిన తర్వాత పూతరేకుల తయారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. మంచినూనే లేదా నేతిని కుండ పైభాగాన రాస్తారు. పలుచని వస్త్రాన్ని జాలుగా ఉన్న బియ్యపు పిండిలో ముంచి కుండ వేడెక్కిన తరువాత ఆ వస్త్రాన్ని కుండపై ఒకవైపు నుంచి మరొక వైపుకు లాగుతారు. కుండ వేడికి పిండి పలుచని పొరలా వస్తుంది. మంట ఎక్కువైనా తక్కువైనా పూతరేకులు విరిగిపోతాయి. ఇలా వీటిని ఈ విధానంలో రోజుకు కేవలం 200వరకు మాత్రమే చేయగల్గుతారు. అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు తయారుచేసిన పూతరేకుల తయారీ యంత్రం తయారీ సులభతరానికి యంత్రం ఈ నేపథ్యంలో.. సాంకేతికత జోడించి పూతరేకుల తయారీని సులభతరం చేయాలన్న ఆలోచన అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలకు 2016లో కల్గింది. అంతే.. ఈ ఆలోచనను శాస్త్రవేత్తలు డాక్టర్ పీవీకే జగన్నాథరావు, డాక్టర్ పి. శ్రీదేవిలు కార్యరూపం దాల్చారు. పూతరేకులను తయారుచేసే యంత్రాన్ని రూపొందించారు. కరెంట్ ఆధారంగా పనిచేసే ఈ యంత్రంపై పూతరేకులను ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తీయ్యొచ్చు. అదే పాత విధానంలో అయితే కుండకు పెట్టే మంట అటు ఎక్కువ కాకుండా, ఇటు తక్కువ కాకుండా చూసుకోవడంలో ఎక్కువ సమయం పడుతుంది. దీంతో యంత్రం రాకతో వాటి తయారీ మరింత సులభతరమైంది. నాలుగు పేటెంట్లు సాధించిన ఆర్‌ఏఆర్‌ఎస్ గతంలో అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఉప్పుడు బియ్యం యంత్రానికి, ప్రాసెస్ పౌడర్ బెల్లానికి, మిషనరీ పౌడర్ బెల్లానికి మూడు పేటెంట్లు పొందారు. ఇప్పుడు తాజాగా పూతరేకుల తయారీ యంత్రానికి చెన్నైలో ఉన్న సౌత్ ఇండియా ఇంటెలెక్చువల్ సంస్థ ఈనెల 7న పేటెంట్ హక్కులను కల్పిస్తూ ఆర్‌ఏఆర్‌ఎస్‌కు అనుమతినిచ్చింది. రోజుకు 200 నుంచి 1,200కు పెరుగుదల సాధారణ విధానంతో రోజుకి గరిష్టంగా 200 వరకు పూతరేకులు తయారుచేస్తారు. పెట్టుబడిపోను రూ.650 వరకు మిగులుతోంది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఏఆర్‌ఎస్ వారు తయారుచేసిన యంత్రం ద్వారా అయితే రోజుకు గరిష్టంగా 1,200 వరకు తయారుచేయవచ్చు. పెట్టుబడి ఖర్చులు పోను..రూ.2వేల వరకు లాభం ఆర్జించవచ్చు. ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.35 వేలు. రుచిలో ఏమాత్రం తేడాలేదు ఆత్రేయపురంలో మా బృందం నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించాం. పూతరేకుల తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నాం. యంత్రం రూపొందించిన తర్వాత తయారుచేసిన పూతరేకులకు, సా«ధారణ పద్ధతుల్లో తయారుచేసిన పూతరేకులకు మధ్య రుచి వ్యత్యాసం కూడా పరిశీలించాం. రెండింటికీ ఒకే రుచి వచ్చాయి. – పీవీకే జగన్నాథరావు, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త -
బాలీవుడ్ నటికి ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్!
Bhagyashree: ప్రభాస్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్ చేస్తుంటాడు. సెట్లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్ సరదాగా, స్నేహంగా మెదులుతాడు. ఏదైనా పండుగలు, పుట్టినరోజులతో పాటు సాధారణ సమయాల్లోనూ వారికి ఏవైనా స్పెషల్ గిఫ్ట్‌లు పంపుతూ సర్ప్రైజ్ చేస్తుంటాడు. తాజాగా అతడు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇంటికి ఓ గిఫ్ట్ పంపి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇది చూసిన భాగ్యశ్రీ దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేఇసంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారు? నోరూరించే పూత రేకులు. తన సహనటి భాగ్యశ్రీకి పూతరేకులు గిఫ్ట్‌గా పంపాడు. ఇవి అందుకున్న ఆమె "ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్, మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు" అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌లో భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. Another stack of the tasty hyderabadi sweets #pootharekulu Thank you #Prabhas ... you spoil me. pic.twitter.com/em1A6RbGpE — bhagyashree (@bhagyashree123) July 1, 2021 చదవండి: మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా? Aha OTT Releases: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల