bhagyashree
-
ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా...
ఒకరు కాదు... ఇద్దరు కాదు... ముగ్గురు కాదు... నలుగురు కాదు... ఏకంగా పదిహేను మందికి పైగా కొత్త కథానాయికలు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిశారు. ‘ఇంతందం తెలుగు తెరకు మళ్లిందా..’ అన్నట్లు గత ఏడాదితో పోల్చితే 2024లో ఎక్కువమంది తారలు పరిచయం అయ్యారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారల గురించి తెలుసుకుందాం.ఒకే సినిమాతో దీపిక... అన్నా బెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపికా పదుకోన్. గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్‌తో తెలుగు ఎంట్రీ ఇచ్చారామె. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు. ఈ సినిమాలో కైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్. డాటర్ ఆఫ్ శ్రీదేవి దివంగత ప్రముఖ తార శ్రీదేవి తెలుగు వెండితెర, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీలో నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్నుంచి జాన్వీ తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలషించారు. వీరి నీరిక్షణ ‘దేవర’ సినిమాతో ఫలించింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో తంగమ్ పాత్రలో నటించారామె. కల్యాణ్‌రామ్ సమర్పణలో కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదలైంది. అలాగే ఇదే సినిమాతో నటి శ్రుతీ మరాఠే కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో దేవర పాత్రకు జోడీగా శ్రుతి, వర పాత్రకు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. భాగ్యశ్రీ బిజీ బిజీ పరభాష హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు, తొలి సినిమాకే వారి పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు. కానీ తన తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని తన పాత్ర జిక్కీకి భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమాలో ఓ కమర్షియల్ హీరోయిన్ రోల్ భాగ్యశ్రీకి దక్కింది. తెరపై మంచి గ్లామరస్‌గా కనిపించారు. భాగ్యశ్రీ నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆమె దుల్కర్ సల్మాన్, రామ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలతో భాగ్యశ్రీ బిజీ. తెలుగు తెరపై మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ (2017) మానుషీ చిల్లర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఓ కమాండర్ రోల్లో నటించారు మానుషి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా హీరో వరుణ్ తేజ్‌కు హిందీలో తొలి సినిమా కాగా, మానుషీకి తెలుగులో తొలి సినిమా. సోనీ పిక్చర్స్, సిద్ధు ముద్దా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. ఎప్పుడో కాదు... ఇప్పుడే! గత ఏడాది తెలుగులో అనువాదమైన కన్నడ చిత్రాలు ‘సప్తసాగరాలు దాటి’ ఫ్రాంచైజీలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్. అప్పట్నుంచి రుక్ష్మిణి వసంత్ ఫలానా తెలుగు సినిమా సైన్ చేశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అగ్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ సడన్‌గా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాదే జరిగిపోయింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలైంది. కాగా హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోని హీరోయిన్ పాత్ర రుక్మిణీ వసంత్‌కు దక్కిందని తెలిసింది. ఒకేసారి మూడు సినిమాలు ఓ హీరోయిన్ కెరీర్‌లోని తొలి మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల్వడం అనేది చిన్న విషయం కాదు. హీరోయిన్ నయన్ సారికకు ఇది సాధ్యమైంది. అనంద్ దేవరకొండ నటించిన ‘గంగం గణేషా’, నార్నే నితిన్ ‘ఆయ్’, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాల్లో నయన్ సారిక హీరోయిన్గా నటించగా, ఈ మూడు సినిమాలు 2024లోనే విడుదలయ్యాయి. ఇందులో ‘ఆయ్, ‘క’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలవగా, ‘గం గం గణేషా’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమాలో నటించారు కన్నడ బ్యూటీ తన్వీ రామ్. తన్వీ ఓ లీడ్ రోల్లో నటించిన తొలి తెలుగు సినిమా ‘క’. ఈ చిత్రం అక్టోబరులో విడుదలైంది. ఇటు తెలుగు... అటు తమిళం తెలుగు, తమిళ భాషల్లో ఈ ఏడాదే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రీతీ ముకుందన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. హర్ష దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై, ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక కెవిన్ హీరోగా చేసిన ‘స్టార్’తో ఇదే ఏడాది తమిళ పరిశ్రమకు పరిచయం అయ్యారు ప్రీతీ ముకుందన్. అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇంకా నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో సిరీ లెల్లా, సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ, నవదీప్ ‘లవ్ మౌళి’తో పంఖురి గిద్వానీ, ‘వెన్నెల’ కిశోర్ ‘చారి 111’తో సంయుక్తా విశ్వనాథన్, సాయిరామ్ శంకర్ ‘వెయ్ దరువెయ్’తో యషా శివకుమార్, చైతన్యా రావు ‘షరతులు వర్తిస్తాయి’తో భూమి శెట్టి, అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటి అడక్కు’తో ప్రముఖ నటుడు జానీ లివర్ వారసురాలు జేమీ లివర్ (ఓ కీలక పాత్రతో..) తదితరులు పరిచయం అయ్యారు. – ముసిమి శివాంజనేయులు -
జాన్వీ కపూర్ జిగేలు.. బచ్చన్ బ్యూటీ చాన్నాళ్ల తర్వాత
మాల్దీవుల్లో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ మౌనీ రాయ్జిగేలు మనిపిస్తున్న 'దేవర' హీరోయిన్ జాన్వీ కపూర్చాన్నాళ్ల తర్వాత మళ్లీ కనిపించిన 'మిస్టర్ బచ్చన్' భాగ్యశ్రీజిమ్నాస్టిక్స్ చేస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్ నేహాశర్మబ్లాక్ డ్రస్సులో క్యూట్ అండ్ స్వీట్‌గా మీనామెట్లు ఎక్కి తిరుపతి వెళ్తున్న బిగ్‌బాస్ నయని పావనిభర్తతో కలిసి ఆటోలో షికార్లు చేస్తున్న తమిళ నటి ప్రియ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shwetha Srivatsav (@shwethasrivatsav) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Mimi chakraborty (@mimichakraborty) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) -
నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!
ఏమాత్రం కదల్చడానికి వీలులేనంత తీవ్రంగా భుజం నొప్పి రావడం ఇంటి పనులు, కంప్యూటర్ల ముందు çకూర్చుని పనిచేసేవారికి తెలిసిందే. కారణాలు ఎన్ని ఉన్నా భుజాల నొప్పులు ఇటీవల చాలా సాధారణమయ్యాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికీ ఉండచ్చు. నొప్పిని భరిస్తూ అలాగే ఉండిపోతే భుజాల కదలికలు తగ్గుతాయి. సమయానికి చికిత్స చేయక΄ోతే సమస్య దీర్ఘకాలికంగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ పది నిమిషాలు చేయదగిన వ్యాయామాలను నటి భాగ్యశ్రీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.వ్యాయామ బ్యాండ్రెండు చేతులతో వ్యాయామ బ్యాండ్ రెండు చివర్లను పట్టుకోవాలి.బ్యాండ్ సాయంతో వ్యాయామం చేయడానికి చేతులను ముందుకు చాచాలి. తిరిగి యధాస్థానానికి తీసుకురావాలి. ఇలాంటప్పుడు మోచేతులు తుంటిపక్కన నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాయామాన్ని 8 సార్లు చేయాలి.ఫ్రెంచ్ ప్రెస్చేతులను ఎంత వీలైతే అంత వెనకకు కదల్చాలితర్వాత ఒక చేతిని ముందు వైపుకు తీసుకోవాలి. తిరిగి ప్రారంభ స్థానానికి 3 దశలుగా రావాలి.ఈ వ్యాయామం 10–15 సార్లు చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు విరామం తీసుకోవాలి.ఓవర్ హెడ్నిటారుగా నిలబడి,. చేతులను తుంటి భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ∙వీలైనంత వరకు చేతులను తలమీదుగా పైకి ఎత్తాలి. వెన్నెముక వంపు రాకుండా నిటారుగా ఉంచాలి. తిరిగి మెల్లగా యధాస్థానంలోకి రావాలి. ఈ విధంగా 10–12 సార్లు చేయాలి. ఈ వ్యాయామాల గురించి డాక్టర్ కపూర్ మాట్లాడుతూ ‘ఫ్రోజెన్ షోల్డర్ కోసం చేసే వ్యాయామాల కదిలికల పరిధిని పెంచడానికి వీటిని రూపొందించారు. ఫ్రెంచ్ ప్రెస్, బ్యాండ్ ఫుల్ రెండూ వేరు వేరు పద్ధతుల్లో ఉండటం వల్ల భుజాలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది’ అని తెలియజేశారు. దీంతోపాటు మరో రెండు వ్యాయామాల గురించి వివరించారు.లోలకం మాదిరి.. గడియారంలోని లోలకం కదలికలు ఉన్నట్టు ఈ వ్యాయామం ఉంటుంది. ఫ్రోజెన్ షోల్డర్ చేయి కిందికి వేలాడదీయడానికి వీలుగా కొద్దిగా వంగాలి. ఒక అడుగు వ్యాసంతో చేతిని చిన్న వృత్తంలా తిప్పాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు.టవల్‌తో సాగదీయడం..రెండు చేతులతో వీపు వెనక నుంచి ఒక టవల్‌ను సమాంతరంగా పట్టుకోవాలి. నొప్పి ఉన్న భుజం వైపుకు టవల్‌ను లాగడానికి మరో చేతిని ఉపయోగించాలి.లోపలి వైపుకు... మూసి ఉన్న తలుపు పక్కన నిలబడి, డోర్ నాబ్ చుట్టూ వ్యాయామ బ్యాండ్ ఒక చివర కట్టాలి. మోచేతిని 90 డిగ్రీల కోణంలో ఉంచి, నొప్పి ఉన్న చేతితో వ్యాయామ బ్యాండ్ మరొక చివరన పట్టుకోవాలి. బ్యాండ్‌ని మీ శరీరం వైపు రెండు లేదా మూడు అంగుళాలు లాగి కొన్ని సెకన్లపాటు పట్టుకోవాలి.ఇలా 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి. (చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!) -
పారాలింపిక్స్ సమయం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా భారత అథ్లెట్ల బృందం శుక్రవారం ఫ్రాన్స్‌కు పయనమైంది. ఇటీవల పారిస్ వేదికగా ఒలింపిక్స్ ముగియగా.. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్ 8 వరకు అక్కడే పారాలింపిక్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. విశ్వ క్రీడలకు బయలుదేరే ముందు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ నుంచి 54 మంది బరిలోకి దిగి 19 పతకాలు (5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు) సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, సైక్లింగ్, బ్లైండ్ జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలో మన అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ‘ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మన పారా అథ్లెట్లు ఒలింపిక్స్ వరకు చేరుకున్నారు. ‘పారిస్’ పారాక్రీడల్లో సత్తా చాటి అధిక సంఖ్యలో పతకాలు సాధిస్తారనే నమ్మకముంది. ఈ బృందంలో చాలా మంది అథ్లెట్లు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా లబ్ది పొందినవారే. అథ్లెట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశ్వక్రీడల్లో అధిక సంఖ్యలో పతకాలు సాధించి దేశ ఖ్యాతిని మరింత పెంపొందించాలి’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అన్నారు. ఫ్లాగ్ బేరర్లుగా భాగ్యశ్రీ, సుమిత్ పారిస్ పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. టోక్యో పారాలింపిక్స్ ఎఫ్64 విభాగంలో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్.. గత ఏడాది ప్రపంచ పారా చాంపియన్íÙప్లోనూ బంగారు పతకం సాధించాడు. మహిళల ఎఫ్34 కేటగిరీలో పోటీపడుతున్న భాగ్యశ్రీ ఆసియా పారా క్రీడల్లో రజతం సాధిచింది. ఈ నేపథ్యంలో పీసీఐ అధ్యక్షుడు ఝఝారియా మాట్లాడుతూ.. ‘విశ్వక్రీడల ఆరంభ వేడుకలో సుమిత్, భాగ్యశ్రీ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారు. వీరిద్దరూ గత కొంతకాలంగా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధిస్తామనే నమ్మకముంది. అనేక క్రీడాంశాల్లో మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. దాని వెనక వారి కఠోర శ్రమ, కృషి ఉంది. పారిస్ పారాలింపిక్స్‌లో దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఈ క్రీడల్లో తెలంగాణ నుంచి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో జివాంజి దీప్తి పోటీపడనుంది. -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
ఆ హీరో సడన్‌గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ
మైనే ప్యార్ కియా(తెలుగులో ప్రేమ పావురాలు) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది భాగ్యశ్రీ. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ఆ మధ్య ప్రభాస్ రాధేశ్యామ్, బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మూవీ ఛత్రపతిలోనూ కనిపించింది. తాజాగా ఈ నటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'నాన్న చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. అందువల్ల స్కూల్లో చదువుకునే రోజుల్లో మా క్లాస్‌లో అబ్బాయిలతో మాట్లాడేదాన్నే కాదు. కానీ అనుకోకుండా హిమాలయ దస్సానీతో ప్రేమలో పడ్డాను. మా ప్రేమ విషయం నాన్నకు ఎక్కడ తెలిసిపోతుందో? తను ఎలా స్పందిస్తాడో? అని టెన్షన్ పడేదాన్ని. ఊటీలో షూటింగ్.. ఆ రోజు సినిమాల్లోకి వచ్చేంతవరకు కూడా అది సీక్రెట్‌గానే ఉంచాను. మైనే ప్యార్ కియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా విషయం సల్మాన్‌కు తెలిసింది. ఆ తర్వాత మేము దిల్ దీవానా బిన్ సజ్నాకే సినిమా చేశాం. ఈ మూవీ షూటింగ్ కోసం ఊటీలో నెలరోజులపాటు ఉన్నాం. అప్పుడు సల్మాన్ వచ్చి నా చెవిలో పాట పాడాడు. పదేపదే ఏదో గుసగుసలాడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి పాటలు పాడుతూనే ఉన్నాడు. అంతకుముందెన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇతడేంటి? నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడు? తనకిది సరదాగా ఉందా? అని చిరాకెత్తుకొచ్చింది. హీరోను తిట్టేశా.. తనను పక్కకు తీసుకెళ్లి ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు.. బుద్ధిగా నడుచుకో అని చెప్పాను. అప్పుడతడు నీ ప్రేమ విషయం తెలిసిపోయిందిలే, అందుకే ఆటపట్టిస్తున్నా అన్నాడు. నీ ప్రియుడిని సెట్స్‌కు పిలువు.. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలా హీరో అండతో దస్సానీని కలుసుకుని మాట్లాడేదాన్ని. అందరూ అతడిని సల్మాన్ ఫ్రెండ్ అనుకున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా భాగ్యశ్రీ.. 1990లో హిమాలయ దస్సానీని పెళ్లాడింది. వీరికి అవంతిక, అభిమన్యు సంతానం. చదవండి: ఆ బుజ్జిని గుర్తుపట్టారా? ఈమె మిడిల్ క్లాస్ మదర్! -
సినిమా వాళ్లపై ప్రజల్లో అలాంటి అభిప్రాయం: రాధేశ్యామ్ నటి కామెంట్స్!
మైనే ప్యార్ కియా (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఈ ఏడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ కిసీ కీ జాన్ చిత్రంలో కనిపించింది. అంతేకాక గతేడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాదిలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన చత్రపతి చిత్రంలోనూ కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భాగ్యశ్రీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో పనిచేసేవారు మంచి వ్యక్తులు కాదని ప్రజలు భావిస్తారని అన్నారు. అయితే వారి అభిప్రాయాల కారణంగా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని భాగ్యశ్రీ చెప్పింది. ఇలాంటివి ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయనే అనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంది. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) బాలీవుడ్లో ఉన్న అభిప్రాయాల గురించి అడిగినప్పుడు, భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'బాలీవుడ్లో పనిచేసే వ్యక్తులు మంచి వ్యక్తులు కాదనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఈ విషయంలో మనం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉండాలి. ఎవరైనా వంట చేస్తున్నట్టు లేదా శుభ్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ చేస్తే.. ప్రజలు వాటికి కూడా.. 'మీరు అవన్నీ చేయకూడదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు కదా' అని సలహాలిస్తారు. నిజంగా చెప్పాలంటే మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. మన ఆహారం మనమే వండుకోవాలి. మేము మీలాగా సాధారణ మనుషులమే. కానీ ప్రజలు మరింత రూడ్‌గా, సున్నితంగా మారినప్పుడే ఇలాంటి సమస్య ఎదురవుతుందని' ఆమె అన్నారు. గతంలో సినిమాలపై భాగ్యశ్రీ మాట్లాడుతూ.. 'నేను 80వ దశకంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశా. సినిమాల్లోకి ప్రవేశించినప్పుడే ఇలాంటి భావం ప్రజల్లో అప్పటికే ఉంది. సినిమాలు చాలా చెడ్డ ప్రపంచం. మంచి కుటుంబం నుంచి వచ్చిన ఏ వ్యక్తిని చిత్ర పరిశ్రమకు వెళ్లనివ్వరు. ఇలాంటి అభిప్రాయం 30 సంవత్సరాల క్రితమే చూశా. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ప్రస్తుతం సెట్ డిజైనింగ్ నుంచి మేకప్ వరకు ప్రతి అంశంలోనూ మహిళలు ఉన్నారు. ఇది ఎప్పటికీ పరిశ్రమలో ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నా.' అని అన్నారు. భాగ్యశ్రీ ప్రస్తుతం సజిని షిండే కా వైరల్ వీడియోలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రాధికా మదన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో సుబోధ్ భావే కూడా నటించారు. (ఇది చదవండి: సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!) -
ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ కొడుకు ఇప్పుడు హీరో.. ఎలా ఉన్నాడో తెలుసా? (ఫొటోలు)
-
సల్మాన్‌తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్
మైనే ప్యార్ కియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజైంది. సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్లో ఎదురైన చేదు సంఘటనలను పంచుకుంది. (ఇది చదవండి: ఏజెంట్‌పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..) మైనే ప్యార్ కియా సినిమా తనకు సక్సెస్‌తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని భాగ్యశ్రీ వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు సల్మాన్‌తో రిలేషన్లో ఉందని బీటౌన్‌లో మాట్లాడుకున్నారు. పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ' నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్ వచ్చారు. విషెస్ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఓ ప్రశ్న అడిగింది. సల్మాన్‌ఖాన్‌తో మీ భార్య రిలేషన్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి నేను ఫిల్మ్ మ్యాగజైన్స్ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: బాలీవుడ్ క్వీన్.. సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!) అంతేకాకుండా.. సల్మాన్ ఎంతో మంచి వ్యక్తి అని.. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘మైనే ప్యార్ కియా’ రిలీజైన కొంతకాలానికే తన స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నారు భాగ్యశ్రీ. ఇక పెళ్లి తర్వాత కూడా భాగ్యశ్రీ తక్కువ సినిమాలే చేశారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. ఇందులో ఆమె ప్రభాస్‌కు తల్లిగా కనిపించారు. ఇటీవల విడుదలైన హిందీ వర్షన్ ఛత్రపతి హీరోకు తల్లి పాత్రలో నటించారు. -
న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా
అగ్రరాజ్యం అమెరికాలో ఎంతో సేవ చేస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ -ఆపి 41వ వార్షిక కన్వెన్షన్ ముహూర్తం ఖరారైంది. ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది జులై 6 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఆపి కన్వెన్షన్ లాంచ్ రెడ్ కార్పెట్ డిన్నర్ గాలా జరిగింది. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, బాలీవుడ్ ఐకాన్ భాగ్యశ్రీతో పాటు ఆపి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ ఆహుతులను ఆకట్టుకుంది. ఫిలడెల్ఫియాలో జరిగే ఆపి 41వ కన్వెన్షన్‌కు అందరూ విచ్చేసి, విజయవంతం చేయాలని న్యూజెర్సీ స్టేట్ ఆపి ఫ్రెసిడెంట్ డాక్టర్ ప్రదీప్ షా కోరారు. కన్వెన్షన్ అద్భుతంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆపి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
Beauty: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే!
Bhagyashree- Beauty Tips: ఐదు పదుల వయసులోనూ కాంతులీనే తన ముఖ సౌందర్య రహస్యానికి కారణం ఓట్స్ అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ. మరాఠా రాజకుటుంబానికి చెందిన ఆమె.. మై నే ప్యార్ కియా సినిమాతో బీ-టౌన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. బుల్లితెర నుంచి వచ్చి వెండితెర మీద మ్యాజిక్ చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న భాగ్యశ్రీ.. 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే అంటున్నారు. అయితే, తన చర్మ సౌందర్యానికి కారణం అమ్మ చెప్పిన చిట్కాలే అంటూ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేశారామె. ‘‘గ్రైండ్ చేసిన ఓట్స్‌కి కొన్ని పాలు, తేనె కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేసుకుని తడి ఆరే వరకు ఉంచుకుంటాను. ముఖం కడుక్కునే ముందు ముఖంపై ఎండిన పేస్ట్ రాలిపోయే విధంగా మృదువుగా వేళ్లతో స్క్రబ్ చేసుకుంటాను. తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటాను. ఓట్స్‌లో మృత కణాలను తొలగించే లక్షణం ఉంటుంది. పాలు తేమనిచ్చి చర్మం మృదువుగా టోన్ అయేలాగా చేస్తాయి. తేనెలో యాంటీ సెప్టిక్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవన్నీ కలసి అలసిన చర్మాన్ని కొద్దిసేపట్లోనే తాజాపరచి ముఖానికి మెరుపునిస్తాయి’’ అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. కాగా రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించి ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించారు భాగ్యశ్రీ. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. చదవండి: Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్.. అందుకే ఇలా! View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) -
ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త, కారణమేంటంటే?
బాలీవుడ్ నటి భాగ్య శ్రీ భర్త హిమాయ్ దాసానీకి సర్జరీ జరిగింది. అతడి కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారని నటి సోషల్ మీడియాలో వెల్లడించింది. 'భుజంలోని రొటేటర్ కఫ్ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్ కఫ్ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోయి చేయి కదలిక కోల్పోతుంది. వైద్యులు నా భర్త భుజంలోని రొటేటర్ కఫ్‌కు శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు నాలుగన్నర గంటల సమయం పట్టింది. ఇప్పుడతడు కోలుకుంటున్నాడు, తిరిగి నవ్వుతున్నాడు' అంటూ భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. కాగా భాగ్యశ్రీ... సల్మాన్ ఖాన్‌తో మైనే ప్యార్ కియా(ప్రేమ పావురాలు) అనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మరుసటి ఏడాది (1990) హిమాలయ్ను పెళ్లాడింది. వీరికి అభిమన్యు అనే కొడుకు, అవంతిక అనే కూతురు ఉన్నారు. తన ఫ్యామిలీతో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్న భాగ్యశ్రీ రాధేశ్యామ్ చిత్రంతో ఇటీవలే టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) చదవండి: షాకింగ్ ఎలిమినేషన్: బిగ్‌బాస్ దెబ్బకు గీతూ అబ్బ! కేరళ స్టోరీ: నర్సు కావాలనుకున్న ఆమె టెర్రరిస్ట్ ఎలా అయింది? -
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నటి భాగ్యశ్రీ కూతురు, బెల్లంకొండ హీరోతో జోడి
బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుదలైంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలయ్యారు. తర్వాత బాలకృష్ణ నటించిన యువరత్నరాణా లో నటించి టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు. చేసింది కొన్ని సినిమాలే అయిన ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె సడెన్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల రాధేశ్యామ్‌తో రీఎంట్రీ ఇచ్చారు. చదవండి: ‘ఓకే ఒక జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కూతురు అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె బెల్లంకొండ హీరోతో టాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. ప్రముఖ దర్శకులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా సతీష్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సార్’. ఈ మూవీలో భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి కథ అందించారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్! -
అలనాటి స్టార్ హీరోయిన్ కూతురే అవంతిక దాసానీ!
అవంతిక దాసానీ.. డిజిటల్ స్క్రీన్ మీద మెరిసిన మరో నటనా వారసురాలు. ‘మైనే ప్యార్ కియా (ప్రేమ పావురాలు)’ తో వెండి తెర సంచలనమైన తార గుర్తుంది కదా! భాగ్యశ్రీ!! అవును ఆ తల్లి బిడ్డే ఈ అవంతిక దసానీ. లండన్‌లోని క్యాస్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేసొచ్చి.. నటనారంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. ముందుగా డిజిటల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది జీ5 ఒరిజినల్ ‘మిథ్య’ అనే వెబ్ సిరీస్‌తో. నటనారంగంలోకి రావడానికి వారసత్వం ఉపయోగపడుతోందేమో కానీ నిలబడ్డానికి మాత్రం ప్రతిభే అవసరం అని నిరూపిస్తోంది. ► పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లి.. భాగ్యశ్రీ.. నటి. తండ్రి.. హిమాలయ్ దాసానీ.. బిజినెస్‌మన్. అవంతికకు ఒక సోదరుడూ ఉన్నాడు. అభిమన్యు దాసానీ. అతనూ నటుడే. ► చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. ఫ్యాషన్ డిజైన్ పట్లా ప్రేమ కనబరచేది. ఇంకో వైపు కుటుంబ వ్యాపారాల్లోనూ తండ్రికి సాయంగా ఉండాలని ఉత్సాహపడేది. చివరకు నటనా రంగంలోకి రావాలనే నిర్ణయించుకుంది. ► జీ5లో స్ట్రీమ్ అవుతోన్న ‘మిథ్య(2022)’తో అవంతిక తన లక్ష్యాన్ని సగం వరకు చేరుకుంది. తన అభినయాన్ని వెండితెర మీద చూపించాలనేది ఆమె లక్ష్యం. అదీ త్వరలోనే నెరవేరనుందట. ► క్రీడల్లోనూ ఫస్టే. ఆమె..ప్రొఫెషనల్ కిక్ బాక్సర్. తన కిక్ బాక్సింగ్ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ►డాన్స్, ట్రావెలింగ్లు ఆమె అభిరుచులు. -
రాధే శ్యామ్ లో ప్రభాస్ తల్లి.. ప్రేమ పావురాలు భాగ్యశ్రీ ఇంటర్వ్యూ
-
బాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్..
Bhagyashree Shocking Comments On Bollywood: ఒకప్పుడు టాలీవుడ్‌ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్ నటీనటులు ఇప్పుడు తెలుగు సినిమాలపై కన్నేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు మన తెలుగు హీరోలతో నటించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొందరు హీరోహీరోయిన్లు కూడా ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు చాలా మంది హీరోలు, నటులు తెలుగు నటించాలని ఉందంంటూ వారి మనసులో మాట చెప్పేస్తున్నారు. అంతేకాదు మన తెలుగు సినిమాలను సైతం అక్కడ రిమేక్ చేస్తున్నారు. చదవండి: సమంతపై జిమ్ ట్రైనర్ జునైద్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో సీనియర్ నటి భాగ్యశ్రీ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 80, 90లలో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ వెలుగువెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించనున్నారు. రాధేశ్యామ్ మార్చి 11న విడుదలకు కాబోతున్న తరుణంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ ప్రస్తుతం బాలీవుడ్లో అన్ని పాత కథలు, కాపీ స్క్రీప్ట్స్ వస్తున్నాయని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్ అలాగే తెలుగు మలయాళ ఇండస్ట్రీలో కొత్త స్క్రిప్ట్స్, కొత్త కథలు వస్తున్నాయన్నారు. కొత్త టాలెంట్, ఓటిటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా స్థాయి రోజు రోజుకు ఇంటర్నేషనల్ స్థాయికి మారుతుందని, ప్రజలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను, అలాంటి కథలనే ఇష్ట పడుతున్నారని చెప్పారు. భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, యంగ్ జనరేషన్ నుంచి కొత్త కథలు, కొత్త సినిమాలు వస్తున్నాయన్నారు. అందుకే తానూ న్యూ టాలెంట్ పీపుల్స్‌తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
అందుకే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు అప్పటి ‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ. ఈ సినిమాలో నటించడం గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా నా మొదటి సినిమా ‘మైనే ప్యార్ కియా’ (హీరోగా సల్మాన్ ఖాన్‌కి కూడా ఇది తొలి సినిమా). ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేశాను. కెరీర్ బాగున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి అది సరైన సమయం అని, అప్పుడు చేసుకుంటే మంచి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుందని హిమాలయ్‌ని పెళ్లి చేసుకున్నాను. కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణతో బిజీగా ఉన్నందువల్ల సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అందుకని నా భర్త, పిల్లలు తిరిగి నన్ను సినిమాల్లో నటించమని సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాను. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, కంగనా రనౌత్ ‘తలైవి’ (తమిళనాడు మాజీ సీయం, ప్రముఖ నటి జయలలిత బయోపిక్) చిత్రాల్లో యంగ్ మదర్ క్యారెక్టర్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అయితే కరోనా వల్ల ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలో తల్లి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ప్రభాస్ గొప్ప నటుడు.. నిగర్వి కూడా. ఈ చిత్రనిర్మాతలు మేకింగ్ విషయంలో రాజీ పడలేదు. జార్జియాలో గడ్డకట్టే చలిలో షూటింగ్ జరిగినప్పుడు కూడా యూనిట్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌వారు ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలవైపే చూస్తున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. తెలుగులో మదర్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అన్ని పాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. -
తన పెళ్లి గురించి చెబుతూ ఏడ్చేసిన టాప్ హీరోయిన్..
Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్‌కు 2015లో బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్‌ప్లస్ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్‌తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
కొడుకు సినిమా హిట్ టాక్: హీరోయిన్ డ్యాన్స్ వీడియో వైరల్
సాక్షి,ముంబై: ‘మైనే ప్యార్ కియా’ అంటూ బాలీవుడ్ డెబ్యూ మూవీతోనే అదరగొట్టిన అలనాటి అందాల నటి భాగ్యశ్రీ పుత్రోత్సాహంతో పొంగిపోతోంది. తన కుమారుడు అభిమన్యు దాసాని సినిమాలోని మీనాక్షి సుందరేశ్వర్‌లోని ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. టిట్టర్ బిట్టర్ పాటకు డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తన వారసుడి సినిమాను సెలబ్రేట్ చేసుకుంటూ తన సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది “కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం! నా కొడుకు మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం మీనాక్షి సుందరేశ్వర్ విడుదలైంది. ఇప్పటికే ప్రేమను కురిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడకపోతే, మీ ప్రియమైన వ్యక్తితో, సినిమా చూసేయండి..పాప్‌కార్న్ తింటూ మళ్లీ ప్రేమలో పడండి. మీ ఆశీర్వాదాలకు అందరికీ ధన్యవాదాలు’’అని పేర్కొంది. దీంతోపాటు మైనే ప్యార్‌కియా చిత్ర జ్ఞాపకాలను కూడా సోమవారం సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రేమ్, సుమన్‌లను సజీవంగా గుండెల్లో దాచుకున్నందుకు సినీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్‌తో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేయడం విశేషం. కాగా మీనాక్షీ సుందరేశ్వర్ మూవీకి మనోహరమైన హృద్యమైన చాలా గొప్ప చిత్రం అlo ప్రశంసలు లభిస్తున్నాయి. నేటితరం హీరోల మాదిరిగా కాకుండా, చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడంటూ భాగ్యశ్రీ కుమారుడుడు, అభిమన్యు దసానీ ముద్దపప్పులా ఈ పాత్రకి సరిపోయాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. దంగల్ బ్యూటీ సన్యా మల్హోత్రా దసానీకి జోడీగా నటించింది. తమిళ మధ్య తరగతి నేపధ్యంతో తెరకెక్కిన ఈ మూవీకి దర్శకుడు వివేక్ సోనీ. కాగా అభిమన్యు దాసాని 2018లో వాసన్ బాలా చిత్రం మర్ద్ కో దర్ద్ నహీ హోతాతో అరంగేట్రం చేశాడు. నికమ్మ, ఆంఖ్ మిచోలీలో కనిపించనున్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ సరసన బ్లాక్‌బస్టర్ మూవీలో నటించిన తరువాత చాలా సంవత్సరాలు నటనకు దూరంగా ఉన్న భాగ్యశ్రీ ఇటీవల కంగనా రనౌత్ చిత్రం తలైవిలో కనిపించింది. -
సింహగిరిపై నటి భాగ్యశ్రీ
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ప్రేమపావురాలు సినిమాతో తెలుగు ప్రేక్షక హృదయాలను ఉర్రూతలూగించిన నటి భాగ్యశ్రీ సింహగిరిపై తళుక్కుమన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం ఆమె దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. హిందీ సినిమా మైనే ప్యార్ కియా ద్వారా హీరోయిన్గా పరిచయమైన భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన యువరత్న రాణా సినిమాలో నటించారు. చదవండి: (రాజమహేంద్రవరానికి చిరంజీవి.. అందుకేనా..?) -
బాలీవుడ్ నటికి ప్రభాస్ సర్ప్రైజ్ గిఫ్ట్!
Bhagyashree: ప్రభాస్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో ఇప్పటికీ సింప్లిసిటీని మెయింటెన్ చేస్తుంటాడు. సెట్లో నటీనటులతోపాటు టెక్నీషియన్స్‌తోనూ డార్లింగ్ సరదాగా, స్నేహంగా మెదులుతాడు. ఏదైనా పండుగలు, పుట్టినరోజులతో పాటు సాధారణ సమయాల్లోనూ వారికి ఏవైనా స్పెషల్ గిఫ్ట్‌లు పంపుతూ సర్ప్రైజ్ చేస్తుంటాడు. తాజాగా అతడు బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఇంటికి ఓ గిఫ్ట్ పంపి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇది చూసిన భాగ్యశ్రీ దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేఇసంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారు? నోరూరించే పూత రేకులు. తన సహనటి భాగ్యశ్రీకి పూతరేకులు గిఫ్ట్‌గా పంపాడు. ఇవి అందుకున్న ఆమె "ఎంతో రుచికరమైన, కమ్మనైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్ ప్రభాస్, మొత్తానికి నా అభిరుచినే మార్చేశావు" అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌లో భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. Another stack of the tasty hyderabadi sweets #pootharekulu Thank you #Prabhas ... you spoil me. pic.twitter.com/em1A6RbGpE — bhagyashree (@bhagyashree123) July 1, 2021 చదవండి: మన స్టార్ హీరోహీరోయిన్లు ఏం చదివారో తెలుసా? Aha OTT Releases: ఆహాలో ఒకేరోజు ఏకంగా 15 సినిమాలు విడుదల -
ప్రభాస్ సినిమాలో 'మైనే ప్యార్ కియా' నటి
భాగ్యశ్రీ.. ఈ పేరు ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోయినా.. సల్మాన్ నటించిన మైనే ప్యార్ కియా సినిమా చూసిన వాళ్లకు మాత్రం తప్పకుండా గుర్తుంటుంది. మైనే ప్యార్ కియాలో హీరోయిన్గా నటించి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు భాగ్యశ్రీ. నటించిన మొదటి సినిమానే భాగ్య శ్రీకి స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాలు కొన్ని సీరియళ్లలో కూడా ఆమె నటించారు. అయితే కొన్ని సినిమాలతో ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో కొంత కాలంగా భాగ్యశ్రీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 51 ఏళ్ల ఈ నటి మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధం అవుతున్నారు. (బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త..! ) ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగ్యశ్రీ ఈ వివరాలు వెల్లడించారు. లాక్‌డౌన్‌కు ప్రకటించకముందే సినిమా షూటింగ్‌లు పాల్గొన్నట్లు తెలిపారు. రెండు మూడు సినిమా స్క్రిప్ట్‌లు వింటున్నట్లు, ఇప్పటికే సినిమాల్లో నటించడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వాటిలో ఒకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తున్నట్లు ఈ నటి తెలిపారు. అయితే ఏ సినిమా అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రభాస్ సినిమాలో ఆసక్తికర పాత్ర పోషిస్తున్నట్లు, ఇందుకు నటనలో కొంత శిక్షణ తీసుకోవాల్సి ఉందన్నారు. (అది తల్చుకుంటేనే వణికిపోతున్నాను: నటి) ప్రభాస్‌తో నటిస్తున్నట్లు భాగ్య శ్రీ చెప్పడంతో ఏ పాత్రలో నటిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభాస్‌కు తల్లిగా ఆమె నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మైనే ప్యార్ కియాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భాగ్య శ్రీ.. సల్మాన్ ఖాన్, చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యా సమక్షంలో హిమాలయ దసాని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు దస్సాని అనే కుమారుడు, అవంతిక దాసాని అనే కుమార్తెకు ఉన్నారు. (ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్ ) -
అవును.. మేమిద్దరం విడిపోయాం: నటి
‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాతో కుర్రకారును విశేషంగా ఆకర్షించిన ఈ హీరోయిన్ ప్రేమికుడు హిమాలయా దస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది. ఇక భర్తే తన సర్వస్వమనుకుని సినిమాలకు సైతం దూరంగా ఉన్న ఆమె అతని నుంచి విడిపోయినట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. తన పెళ్లి, విడిపోవడానికి దారి తీసిన పరిణామాల గురించి ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (‘ప్రేమ పావురాలు’ ఫేం భాగ్యశ్రీ భర్త అరెస్ట్) ‘అవును, నాకు తొలిసారిగా ప్రేమ చిగురించింది హిమాలయా పైనే. ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాను కూడా. కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు నా మనస్సు కుంగిపోయింది. అంటే నా జీవితంలో అతనికి ఇంక చోటు లేదా? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ఊహించుకుంటే చాలు.. ఇప్పటికీ భయంతో నిలువెల్లా వణికిపోతున్నాను. ఎందుకంటే మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.(విడాకులకు దరఖాస్తు చేసకున్న బాలీవుడ్ జంట) కాగా ఆమె తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ వారినెదురించి హిమాలయానే వివాహమాడేందుకు నిశ్చయించుకుంది. దేవుని సాక్షిగా ఆలయంలో అతనితో మూడు ముళ్లు వేయించుకుంది. హీరో సల్మాన్‌ఖాన్, దర్శకుడు సూరజ్ బర్జాత్యా వంటి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. భాగ్యశ్రీకి ఇద్దరు సంతానం. కాగా ఏడాదిన్నర కాలం నుంచి వీళ్లిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ప్రభాస్ తదుపరి చిత్రంలో అతనికి తల్లిగా నటిస్తోంది. (ఆనంద భాష్పాలు ఆగలేదు: భాగ్యశ్రీ) View this post on Instagram #bhagyashree talks about her seperation with her husband Himalaya which was for few years. #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Feb 27, 2020 at 1:20am PST -
‘ప్రేమ పావురాలు’ ఫేం భాగ్యశ్రీ భర్త అరెస్ట్
సాక్షి, ముంబై : ప్రేమ పావురాలు కథానాయిక, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లాంబింగ్ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపార వేత్త అయిన హిమాలయాను అంబోలి పోలీసులు నిన్న (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్ మీద హిమాలయ విడుదలయ్యారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా మేనే ప్యార్ కియా ( ప్రేమ పావురాలు) అనే తొలిచిత్రం తోనే భాగ్యశ్రీ బాగా పాపులయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె చిత్ర సీమకు దూరంగా ఉన్నారు. భాగ్యశ్రీకి ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. Maharashtra: Himalaya Dasani, businessman and husband of actress Bhagyashree was arrested in connection with a gambling racket by Amboli police, yesterday. He was later released on bail. — ANI (@ANI) July 3, 2019 -
ఆనంద భాష్పాలు ఆగలేదు
‘మైనే ప్యార్ కియా’తో భాగ్యశ్రీ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆమెకు సూపర్ క్రేజ్ సంపాదించి పెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చిన 29 ఏళ్ల తర్వాత ఆమె తనయుడు అభిమన్యు దాసాని బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. విశేషమేటంటే ‘మైనే ప్యార్ కియా’ చిత్రాన్ని భాగ్యశ్రీ థియేటర్లో చూడలేదట. అప్పట్లో తన తొలి చిత్రానికి ఎంత ఎగై్జట్ అయ్యానో ఇప్పుడు తనయుడు చిత్రం రిలీజ్‌కీ అంతే ఎగై్జట్ అవుతున్నానని పేర్కొన్నారామె. వసన్ బాలా దర్శకత్వంలో అభిమన్యు దాసాని హీరోగా రూపొందిన చిత్రం ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’. నొప్పి అనేదే తెలియని విచిత్రమైన సమస్యతో బాధపడే హీరో పాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ సినిమా గురించి భాగ్యశీ మాట్లాడుతూ – ‘‘ముంబైలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో మా అబ్బాయి నటించిన సినిమా స్క్రీనింగ్ అవుతున్న థియేటర్ బయట పొడవైన క్యూ ఉండటం ఆనందంగా అనిపించింది. అలాగే ప్రదర్శింపబడిన థియేటర్స్ మొత్తం హౌస్‌ఫుల్ అయ్యాయి. నా ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియదు. ఆనంద భాష్పాలు ఆగలేదు’’ అని పేర్కొన్నారు.