‘ప్రేమ పావురాలు’  ఫేం భాగ్యశ్రీ భర్త  అరెస్ట్‌ | Bollywood actress Bhagya Sri Husband Businessman Himalaya Dasani arrested | Sakshi
Sakshi News home page

‘ప్రేమ పావురాలు’ ఫేం భాగ్యశ్రీ భర్త  అరెస్ట్‌

Published Wed, Jul 3 2019 3:01 PM | Last Updated on Wed, Jul 3 2019 3:07 PM

Bollywood actress Bhagya Sri Husband Businessman Himalaya Dasani arrested - Sakshi

భాగ్యశ్రీ, హిమాలయ దాసాని దంపతులు ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై : ప్రేమ పావురాలు కథానాయిక, అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌  భాగ‍్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  గ్లాంబింగ్‌ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపార వేత్త   అయిన హిమాలయాను అంబోలి పోలీసులు  నిన్న (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం బెయిల్‌ మీద హిమాలయ విడుదలయ్యారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

కాగా  మేనే ప్యార్‌ కియా ( ప్రేమ పావురాలు)  అనే  తొలిచిత్రం తోనే భాగ్యశ్రీ బాగా పాపులయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె  చిత్ర సీమకు దూరంగా ఉన్నారు. భాగ్యశ్రీకి  ఇద్దరు సంతానం. కుమారుడు  అభిమన్యు దాసాని ‘మర్ద్‌  కో దర్ద్‌ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement