gambling game
-
నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి
సాక్షి, హైదరాబాద్, కొండపాక(గజ్వేల్): మొన్నటికి మొన్న ఈడీ మనీలాండరింగ్ కేసు... నిన్నటికి నిన్న థాయ్‌లాండ్‌లో గుట్టురట్టయిన అక్రమ కెసినో వ్యవహారం... ఈ రెండింటిలోనూ ప్రధానంగా వినిపించిన పేరు చీకోటి ప్రవీణ్ కుమార్. నగరానికి చేరుకున్న ప్రవీణ్ పటాయా కెసినో వ్యవహారంపై స్పందిస్తూ మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఆ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ... ‘థాయ్‌లాండ్‌లో నేను ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆ ఈవెంట్ దేవ్, సీత అనే వాళ్లు నిర్వహించారు. పోకర్ టోర్నమెంట్ 4 రోజులు పాటు జరుగుతోందని నాకు ఆహ్వానం పంపారు. నేను అక్కడకు వెళ్లిన నాలుగో రోజు సదరు హోటల్లోని కాన్ఫరెన్స్ రూమ్‌ను సందర్శించా. అందులో అడుగుపెట్టిన 15 నుంచి 20 నిమిషాల్లోనే పోలీసులు దాడి చేశారు. అప్పుడే నాకు వాళ్లు పంపింది నకిలీ ఆహ్వానపత్రిక అని తెలిసింది. ఆ అక్రమ కెసినో నిర్వహించింది నేనే అయితే ఇంత తేలిగ్గా తిరిగి రాలేను. అలాంటి వాటికి అక్కడ కఠినమైన శిక్షలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో అక్రమంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్షపడుతుంది. నా పాస్‌పోర్టు కూడా బ్లాక్‌లిస్ట్ చేసే వాళ్లు. పోలీసులు దాడి చేసిన రోజు అక్కడి న్యాయస్థానానికి సెలవు. మరుసటి రోజు కోర్టులో స్వల్ప జరిమానాతో విడిచిపెట్టారు’ అని వివరించారు. నామీద చాలా కుట్రలు ‘నా చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి. నేను రాజకీయ పార్టీలోకి వస్తున్నానని కొందరు అనుకుంటున్నారేమో..! ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పటాయాలో అక్రమ కెసినోతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు దేవ్, సీత కూడా అక్కడి పోలీసుల వద్ద అంగీకరించారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నేను అక్కడ రూ.50 లక్షలు లంచం ఇచ్చానని జరుగుతున్న ప్రచారం సత్యదూరం. ఆ ఈవెంట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు’అని ప్రవీణ్ అన్నారు. నాకేం సంబంధం లేదు: దేవేందర్‌రెడ్డి థాయ్‌లాండ్‌లోని పటాయాలో జరిగిన గ్యాంబ్లింగ్ డెన్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విహార యాత్రకు వెళ్లగా.. అక్కడి హోటల్లో ఇండియన్ ఫుడ్ తయారు చేయించామంటూ స్నేహితులు చెప్పడంతో ఆ హోటల్‌కు వెళ్లామన్నారు. 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్పారు. అక్కడ ఫోకర్ గేమ్ మాత్రమే పెట్టారని తెలిపారు. తమపై పెట్టిన కేసు నిరాధారమంటూ కోర్టు కొట్టివేసిందన్నారు. కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చీకోటి ప్రవీణ్ -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. -
‘ప్రేమ పావురాలు’ ఫేం భాగ్యశ్రీ భర్త అరెస్ట్
సాక్షి, ముంబై : ప్రేమ పావురాలు కథానాయిక, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లాంబింగ్ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపార వేత్త అయిన హిమాలయాను అంబోలి పోలీసులు నిన్న (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్ మీద హిమాలయ విడుదలయ్యారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా మేనే ప్యార్ కియా ( ప్రేమ పావురాలు) అనే తొలిచిత్రం తోనే భాగ్యశ్రీ బాగా పాపులయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె చిత్ర సీమకు దూరంగా ఉన్నారు. భాగ్యశ్రీకి ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.. ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. Maharashtra: Himalaya Dasani, businessman and husband of actress Bhagyashree was arrested in connection with a gambling racket by Amboli police, yesterday. He was later released on bail. — ANI (@ANI) July 3, 2019 -
పేకాట స్థావరంపై దాడి.. 21 మంది అరెస్ట్
కొవ్వూరు(పశ్చిమ గోదావరి): పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 21 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 89 వేల నగదు, 18 సెల్ఫోన్లు, 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరులో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పలువురు టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.