పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొవ్వూరు(పశ్చిమ గోదావరి): పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 21 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 89 వేల నగదు, 18 సెల్‌ఫోన్లు, 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరులో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పలువురు టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.