gamblers arrested
-
నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : తంగెళ్ళమూడి పంట కాలువ సమీపంలో పేకాట యథేచ్చగా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 29060 నగదుతో పాటు 3 సెల్ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డీఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్సై రామారావు దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
పేకాట స్థావరంపై దాడి.. 21 మంది అరెస్ట్
కొవ్వూరు(పశ్చిమ గోదావరి): పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 21 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 89 వేల నగదు, 18 సెల్ఫోన్లు, 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరులో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పలువురు టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
16 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
హైదరాబాద్: హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్ఫోన్లు, రూ. 2.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: రూ. 20 వేలు స్వాధీనం
ఆదిలాబాద్ : తానూర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి... ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డి.కుప్పంలో 16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 16 మందిని పేకటారాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు కార్లతోపాటు 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వారిలో అధికంగా తమిళనాడుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారంతా ప్రముఖులే అని పోలీసులు వెల్లడించారు. -
19 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలో బైలార్దేవులపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై పోలీసులు ఆదివారం దాడి చేసి... 19 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 92 వేల నగదుతోపాటు 20 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పేకాటపై ఎస్వోటీ పోలీసులకు ఆగంతకులు సమాచారం అందించారు. దీంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. -
51 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
మెదక్: మెదక్ జిల్లా తుప్రాన్లోని ఓ ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి... 51 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లతోపాటు రూ. 65 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తుప్రాన్‌లో పేకాట రాయుళ్ల ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తరచుగా పలు నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్, 1.69లక్ష నగదు స్వాధీనం
గుంటూరు: జిల్లాలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని తిప్పలవారిపాలెం మండలం సత్యనారాయణపురంలో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 1.69లక్షల రూపాయల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
13మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్- హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 57 వేల రూపాయలు, 13 మొబైల్ ఫోన్లు, 3 కార్లు, 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లలో బ్రాహ్మణపల్లి ఉపసర్పంచ్ బాల్‌రాజు కూడా ఉన్నాడు.