Bhagyashree reveals the secret behind her glowing skin in 50's - Sakshi
Sakshi News home page

Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

Published Thu, Dec 8 2022 11:40 AM | Last Updated on Thu, Dec 8 2022 1:07 PM

Bhagyashree Beauty Secrets: Glowing Face In 50s Get Rid Of Dead Skin - Sakshi

Bhagyashree- Beauty Tips: ఐదు పదుల వయసులోనూ కాంతులీనే తన ముఖ సౌందర్య రహస్యానికి కారణం ఓట్స్‌ అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ. మరాఠా రాజకుటుంబానికి చెందిన ఆమె.. మై నే ప్యార్‌ కియా సినిమాతో బీ-టౌన్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. బుల్లితెర నుంచి వచ్చి వెండితెర మీద మ్యాజిక్‌ చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న భాగ్యశ్రీ.. 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే అంటున్నారు.

అయితే, తన చర్మ సౌందర్యానికి కారణం అమ్మ చెప్పిన చిట్కాలే అంటూ బ్యూటీ సీక్రెట్‌ రివీల్‌ చేశారామె.  ‘‘గ్రైండ్‌ చేసిన ఓట్స్‌కి  కొన్ని పాలు, తేనె కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేసుకుని తడి ఆరే వరకు ఉంచుకుంటాను. ముఖం కడుక్కునే ముందు ముఖంపై ఎండిన పేస్ట్‌ రాలిపోయే విధంగా మృదువుగా వేళ్లతో స్క్రబ్‌ చేసుకుంటాను.

తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటాను. ఓట్స్‌లో మృత కణాలను తొలగించే లక్షణం ఉంటుంది. పాలు తేమనిచ్చి చర్మం మృదువుగా టోన్‌ అయేలాగా చేస్తాయి. తేనెలో యాంటీ సెప్టిక్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవన్నీ కలసి అలసిన చర్మాన్ని కొద్దిసేపట్లోనే తాజాపరచి ముఖానికి మెరుపునిస్తాయి’’ అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. కాగా రాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించి ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించారు భాగ్యశ్రీ. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే భాగ్యశ్రీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ అందిస్తూ ఉంటారు.

చదవండి: Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌.. అందుకే ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement