
బాలీవుడ్ నటి భాగ్య శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు మంచి మంచి హెల్త్ టిప్స్‌ని షేర్ చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలగజేస్తుంటుంది. అలాసే ఈసారి సరికొత్త హెల్త్ చిట్కాని నెట్టింట షేర్ చేసింది. అదే తన ప్రతిరోజూ ఉదయం తీసుకునే సూపర్‌ఫుడ్ అని చెబుతోంది. దీనివల్ల చర్మ, జుట్లు, ఆరోగ్యం బాగుంటాయని నమ్మకంగా చెప్పింది. ఇంతకీ అదెంటంటే..
మెంతి గింజల ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది ఇన్‌స్టాలో. నానబెట్టిన మెంతిగింజలు ఒక సూపర్ ఫుడ్ అని అది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుందని, రక్తాన్ని శుభ్రపరిచి..ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని, అద్భుతమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని చెప్పుకొచ్చారు.
వీటిని గనుక డైలీ లైఫ్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో చక్కటి మార్పుని చూస్తారని అన్నారామె. ముఖ్యంగా కాంతులీనే చర్మాన్ని అందివ్వడంలోనూ, జుట్టు ఆరోగ్యంలోనూ కీలకంగా ఉంటుందని పేర్కొంది.
నిపుణులు ఏం అంటున్నారంటే..
మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మెంతుకు సాటిలేదని చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..
దీనిలోని ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది
గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది
బరువుని అదుపులో ఉంచుతుంది, ఆకలిని అరికట్టి జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది
కీళ్ల నొప్పులు, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుంది
మెరుగైన తల్లిపాల ఉత్పత్తిలో కీలకంగా ఉంటుంది.
చక్కెర స్థాయిల నియంత్రిస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది
మొటిమలు, ముడతలను తగ్గిస్తుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది
పీసీఓఎస్ సమస్యలు అదుపులో ఉంటాయి.
శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.
కాగా, నటి భాగ్యశ్రీ గతంలో చర్మ సౌందర్యానికి ఉపయోగ పడే గ్రీన్‌జ్యూస్ ప్రయోజనాలను గురించి పంచుకున్నారు. తాజాగా మరో ఆరోగ్య చిట్కాతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలందించే మెంతులు గురించి నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణలను సప్రదించడం మంచిది.
(చదవండి: అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్)
Comments
Please login to add a commentAdd a comment