
మాతృత్వం మధురిమ మాటలకందనిది. అందుకోసం ప్రతి అమ్మాయి తపిస్తుంటుంది. ప్రస్తుత జీవనవిధానం ,పర్యావరణ కాలుష్యం కారణంగా "అమ్మ" అనే పిలుపు దూరమవుతున్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొందరూ 'ఎగ్ ఫ్రీజింగ్' బాటపడుతున్నారు. ముఖ్యంగా ఈ మార్గాన్నే టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన, నటి మెహ్రీన్, మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా వంటి ప్రముఖులు ఎంచుకున్నారు. తాజాగా వారి సరసన చేరింది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. అసలు ఇంతకీ ఏంటి ఎగ్ ప్రీజింగ్..? ఈ వైద్య విధానం మంచిదేనా?.. అంటే..
ప్రస్తుతం యువత కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో వయసు పెరిగిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు నవతరం ఈ ఎగ్ ఫ్రీజింగ్ బాట పడుతోంది. చెప్పాలంటే ఇది జెన్ జెడ్ ట్రెండ్‌గా మారింది. అసలు ప్రముఖులే కాగా సామాన్యులు సైతం ఈ పద్ధతికే మొగ్గుచూపిస్తాన్నారు. మరీ అసలు ఈ విధానం ఎలా ఉంటుందనే దాని గురించి బాలీవుడ్ నటి తనీషా మాటల్లో చూద్దాం.
ఎగ్ ఫ్రీజింగ్ అంటే..
ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని ఎంచుకున్నామంటే అంతా తప్పుగా చూస్తారు. పైగా ఇది చాలా పెయిన్‌తో కూడిన విధానమని భయబ్రాంతులు గురిచేశారని చెప్పుకొచ్చింది 46 ఏళ్ల తనీషా. అయితే తానువైద్యుల సాయంతో దాని గురించి వివరంగా తెలుసుకున్నాకే ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పింది. వైద్య పర్యవేక్షణలో అండాలు భద్రపరుచుకునే విధానాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ పక్రియలో కడుపు ప్రాంతంలో ప్రొజెస్టెరాన్‌ని ఇంజెక్ట్ చేస్తారు. మొదట్లో తిమ్మిరితో కూడిన బాధ ఉంటుంది.
ఆ తర్వాత ఐదు నుంచి ఆరో రోజులు అందుకు బాడీ ఆటోమేటిగ్గా సిద్ధమైపోతుంది. ఇదంతా అరగంట ప్రక్రియ. అయితే వాళ్లు అండాలను సేకరించిన విధానం మనకు తెలియకుండానే జరిగిపోతుందంటూ..ఆ వైద్య విధానం గురించి వివరించింది సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ హర్మోన్లు ఇంజెక్ట్ చేసే ప్రక్రియలో బరువు పెరగడం జరుగుతుంది. అయితే ఇంజెక్ట్ చేసిన హార్మోన్లను తొలగించడానికి కూడా ఓ విధానం ఉంటుందని చెప్పుకొచ్చారు తనీషా.
వైద్యులు ఏమంటున్నారంటే..
నిజానికి ఈ ఎగ్ ప్రీజింగ్ ప్రక్రియలో సాధారణంగా హార్మోన్ల ఇంజెక్షన్ల సాయంతో అండాలను సేకరించడం జరుగుతుంది. అయితే అందుకు పేషెంట్ శారీరకంగా మాససికంగా సంసిద్ధంగా ఉండటం అనేది అత్యంత కీలకం. అయితే ఈ హార్మోన్ల ఇంజెక్షన్‌లలో ప్రొజెస్టెరాన్ ఉండదని ప్రసూతి వైద్యులు చెబుతున్నారు.
అండాశయాలను ఉత్తేజపరిచేందుకే ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఉంటాయని అన్నారు. అయితే వీటి కారణంగా బరువు పెరగడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ తర్వాత సంభవించే ఆకలి మార్పులే లేదా శరీరంలో ద్రవాల నిలుపదల వంటి మార్పులను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయట.
ఇక్కడ తగినంత నీరు తాగినట్లయితే అదనపు హార్మోన్లు బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఈ హార్మోన్లు శరీరం నుంచి బయటకు వెళ్లేలా తాజాపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు తదితర పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
ఆ సమయంలో వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి, బరువు పెరగకుండా రక్షిస్తాయని అన్నారు. వాటన్నింటి తోపాటు ఎనిమిది గంటల నిద్ర, యోగా, ధ్యానం వంటి వాటితో ఈ అదనపు హార్మోన్లను సమతుల్యం చేయొచ్చని చెప్పారు. జస్ట్ రెండు రుతక్రమ సైకిల్స్ కల్లా సాధారణ స్థితికి మహిళలు తిరిగి వస్తారని వెల్లడించారు వైద్యులు..
ఈ విధానాన్ని ఎంచుకోవడానికి రీజన్..
కెరీర్‌లో ముందుండాలనే క్రమంలో వయసు దాటిపోతుంది. ఆ తర్వాత పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకున్న చాలామంది జంటలు ఎంతలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది తెలిసిందే. పోనీ ఏదోలా పిల్లలను కన్నా..వాళ్లు ఆరోగ్యంగా ఉండక ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతున్నవాళ్లున్నారు.
ఆ నేపథ్యంలోనే యువత ఇలా అండాలను భద్రపరుచకునే ఎగ్ ప్రీజింగ్ లేదా క్రయో ఫ్రిజర్వేషన్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆ జంటలు లేదా యువత కెరీర్‌లో నిలదొక్కుకున్నాక హాయిగా పిల్లల్ని కనడం గురించి ప్లాన్ చేస్తున్నారు.
(చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!)
Comments
Please login to add a commentAdd a comment