gynaecologists
-
భవిష్యత్తులో తగ్గొచ్చా?
మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? – పద్మజ, వెస్ట్గోదావరిక్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్ చేస్తారు. ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్లో విడుదలవుతాయి. కాబట్టి ఒవేరియన్ లేయర్‌ని డామేజ్ చేసే ట్రీట్మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు. ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్మెంట్కి సిద్ధమవుతుంది. ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్‌కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది. నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండవ నెల. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రైట్ సైడ్ ట్యూబ్‌లో వచ్చింది. దాంతో రైట్ ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్‌లో ఉందని చెప్పారు. మెడికల్ ట్రీట్మెంట్తో ఏమైనా మేనేజ్ చేయవచ్చా?– అపర్ణ, నిర్మల్సహజంగా గర్భం దాల్చడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ అవసరం. మీకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ మాత్రమే ఉంది కాబట్టి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ట్యూబ్‌లో వచ్చే ప్రెగ్నెన్సీ)ని మెడికల్‌గా మేనేజ్ చేయడం అవసరం. కానీ దీనికి మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ మీ కండిషన్, సిట్యుయేషన్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు లివర్, కిడ్నీ టెస్ట్స్, Beta hcg టెస్ట్స్ చేసి, మెడికల్ మెథడ్ ట్రై చేయొచ్చా అని చెప్తారు. అందరికీ ఈ ట్రీట్మెంట్ పనిచేయకపోవచ్చు.Methotrexate అనే డ్రగ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడాలంటే మీకు పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ ఉండకూడదు. ట్యూబ్ రప్చర్ కాకుండా ఉందనే విషయం స్కాన్‌లో కన్ఫర్మ్ కావాలి. Beta hcg తక్కువ లెవెల్స్‌లో ఉండాలి. మీరు ఫాలో అప్‌కి రావటానికి రెడీగా ఉండాలి. ఆసుపత్రి దగ్గరలో ఉండాలి. ఇది ఇంజెక్షన్ ద్వారా ఫస్ట్ డోస్ ఇచ్చి, మూడురోజులకొకసారి Beta hcg లెవెల్స్ తగ్గుతున్నాయా అని చెక్ చేస్తారు. తగ్గుతోంది అంటే మెడిసిన్ పనిచేస్తోంది అని అర్థం. రెండు మూడు వారాలు కొంత పెయిన్, స్పాటింగ్ ఉండొచ్చు. నొప్పి తీవ్రంగా ఉంటే సర్జరీ చెయ్యాలి. పారాసిటమాల్ లాంటి మాత్రలు వాడొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎమోషనల్‌గా కూడా సవాలుగా మారొచ్చు. అందుకే కౌన్సెలింగ్ సహాయమూ తీసుకోవాలి. ఈ మెడిసిన్‌తో నాలుగు నుంచి ఆరు వారాల సమయంలో ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ దానంతట అది కరిగిపోతుంది. ఒకవేళ రెండో వారంలో ఏ మార్పులూ కనిపించకపోతే లాపరోస్కాపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తరువాత కనీసం మూడు వారాల వరకు ఆగి, మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ∙ -
టెస్టులు.. స్కాన్.. ఉంటాయా?
నాకు 35 ఏళ్లు. యూరిన్ టెస్ట్‌లో గర్భవతి అని తెలిసింది. మూడు నెలల తర్వాత డాక్టర్‌ను సంప్రదించమని సలహా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. అందాకా ఆగొచ్చా? ఇప్పుడేమైనా టెస్టులు, స్కాన్స్ ఉంటాయా? సూచించగలరు. – వాసవి, ఆదిలాబాద్ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కలవటం మంచిది. 30 ఏళ్లు దాటాక ప్రెగ్నెన్సీ వస్తే కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్, బీపీ, సుగర్ టెస్ట్లైతే వెంటనే చేయించుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. రోజూ ఫోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్ మాత్రలను వేసుకోవాలి. మీ లాస్ట్ పీరియడ్ తేదీ నుంచి రెండు నెలలకి వయబిలిటీ స్కాన్ అని.. ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇందులో గర్భసంచిలో సరైన ప్లేస్లోనే పిండం ఫామ్ అయిందా.. లేదా? పిండం వయసు, ఎదుగుదల ఆరోగ్యంగా ఉందా.. లేదా? వంటివన్నీ తెలుస్తాయి. కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ వంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్‌ని ఈ స్కాన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు జెనెటిక్ లేదా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని గుర్తించేందుకు 3వ నెలలో కొన్నిరకాల రక్తపరీక్షలు, స్కానింగ్‌ని చేయాల్సి ఉంటుంది. వీటిని చేయించుకునే తేదీని కూడా ఫస్ట్ స్కాన్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఈ స్కాన్‌ను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ రెండు విధాలుగా చేస్తారు. ఇందులో బిడ్డ సైజు, హార్ట్ బీట్ తెలుస్తాయి. అండాశయాల్లో ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా అని కూడా చూస్తారు. పిండానికి రక్తప్రసరణ సరిగా ఉందా? ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. 8–9 వారాల్లో ట్విన్ ప్రెగ్నెన్సీని కనిపెట్టొచ్చు. మూడవ నెల నిండిన తర్వాత చేసే ఎన్టీ స్కాన్ ( (Nuchal Translucency)లో డౌన్‌సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా తెలుస్తాయి. దీంతోపాటు ఇంకా టీ18, టీ13 అనే సమస్యలనూ గుర్తించే వీలుంటుంది. డెలివరీ అయ్యే సుమారు తేదీ కూడా ఈ స్కాన్లోనే తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్‌ను 12–13 వారాల మధ్య చేస్తారు. ఈ టెస్ట్‌లో ఒకవేళ ఏదైనా సమస్య కనపడితే తదుపరి ఏ డాక్టర్ని కలవాలి, చెకప్స్, హై రిస్క్ అబ్‌స్టెట్రీషియన్ కేర్ వంటివి సూచిస్తారు. తొలి మూడు నెలల్లోనే బిడ్డకు అవయవాలన్నీ ఏర్పడటం మొదలవుతుంది కాబట్టి తీసుకోవలసిన పోషకాహారం, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఒకవేళ బిడ్డకేవైనా ఎదుగుదల సమస్యలు కనిపిస్తే వేసుకోవలసిన మాత్రలు, తీసుకోవలసిన ఇంజెక్షన్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. నాకు 37 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పీరియడ్స్‌లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. రొటీన్ స్కాన్‌లో లో అడినోమయోసిస్ అని తేలింది. వేరే పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తెలిసిన డాక్టర్ చూసి, గర్భసంచి తొలగించాలని చెప్పారు. వేరే మార్గం లేదా?– ప్రదీప్తి, విజయనగరంపీరియడ్స్లో పెయిన్ తప్ప ఇతర ఇబ్బందులేమీ లేవంటున్నారు. కాబట్టి మేజర్ సర్జరీ అవసరం లేదు. నెలసరిలో నొప్పి తగ్గేందుకు కొన్ని మందులు వాడొచ్చు. అడినోమయోసిస్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. గర్భసంచిలో ఉండే టిష్యూ గర్భసంచి గోడలోకి వెళ్లి నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం అవటం, పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. సాధారణమైన పెయిన్ కిల్లర్ మాత్రలతో నొప్పి తగ్గకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంట్రాటెరైనా డివైస్ – MIRENA లాంటివి నొప్పిని, బ్లీడింగ్నీ తగ్గిస్తాయి. మీరు డాక్టర్ని సంప్రదిస్తే.. పరీక్షించి.. మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో, ఏది మంచిదో చెబుతారు. అడినోమయోసిస్ అనేది దానికదే తగ్గే అవకాశం తక్కువ. అందుకని ఏడాదికోసారి స్కాన్ చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. మెనోపాజ్ వయసుకి హార్మోన్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇదీ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ పిల్లలున్న వారు MIRENA కాయిల్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. హిస్టరెక్టమీ లాంటి మేజర్ సర్జరీని నివారించవచ్చు. కేవలం నొప్పి, అధిక రక్తస్రావం మాత్రమే ఉన్నవారికి (థైరాయిడ్, హై బీపీ, సుగర్ లాంటి సమస్యలేవీ లేకపోతే) ఈ కాయిల్ లేదా మాత్రలతో త్వరగానే రిలీఫ్ వస్తుంది. అలాగే మీ ఏజ్ గ్రూప్ వాళ్లు తప్పకుండా పాప్ స్మియర్ అనే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్‌తో గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. సరైన చికిత్సను సూచిస్తారు. -
రికవరీ లేట్ అవుతుందా?
నాకు మూడవ నెల. నోట్లో అల్సర్స్ ఉన్నాయి. మెడ భాగంలో కూడా గడ్డలు వచ్చిపోతున్నాయి. నా భర్తకు కూడా ఇలానే వస్తున్నాయి. మందులు వాడాక తగ్గాయి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా?నళినీ రాణి, మాధవరంమీరు చెప్పిన దానిని బట్టి ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్లా ఉంది. నోట్లో, వెజైనా ఏరియాలో అల్సర్స్ రావడం, మీ ఆయనకు కూడా రావడం చాలా వరకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లో ఉంటుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. చికిత్స తీసుకోకుంటే బిడ్డ మీద తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఏ లక్షణాలూ లేకుండా, కొంతమందికి మూడు నెలల తర్వాతే ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. అందుకే ఇలా అల్సర్స్ రావడంతోనే వీడీఆర్ఎల్ టెస్ట్ చెయ్యాలి. రొటీన్ టెస్టుల్లో భాగంగానే గర్భవతికి కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. కండోమ్స్ వాడటంతో ఈ ఇన్ఫెక్షన్ని దూరం చెయ్యవచ్చు. మీరు వెంటనే దగ్గరలోని గైనకాలజిస్ట్‌ని కలవండి. కొన్ని రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనా స్వాబ్ టెస్ట్ చేస్తారు. గర్భిణులకు ఈ పరీక్షలు 3, 7, 9 నెలల్లో చేసి, చికిత్స ఇచ్చిన తరువాత నయమైందా లేదా అని చెక్ చెయ్యాలి. పెన్సిలిన్ ఇంజక్షన్‌తో ఈ ఇన్ఫెక్షన్ బాగా నయమవుతుంది. వీడీఆర్ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో టీపీపీఏ, టీపీహెచ్ఏ చెయ్యాలి. ఒకవేళ ఆ టెస్ట్‌లో ఏమీ తెలియకపోతే చికిత్స చేసి, రెండు మూడు వారాల తరువాత పరీక్షల కోసం మళ్లీ శాంపిల్స్ పంపించాలి. సిఫిలిస్ ఇన్ఫెక్షన్ తొలిదశలో వస్తే ఫీటల్ మెడిసిన్ నిపుణులతో గర్భస్థ శిశువుకు స్కానింగ్ చేయించాలి. 5,7వ నెలలో చేసే ఈ స్కానింగ్‌లో ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. అల్సర్స్ వెజైనల్ ఏరియాలో మానకుండా ఉంటే 9వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి, సిజేరియన్‌కు రికమండ్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు. బ్రెస్ట్ మీద మానని పుండ్లు లేకపోతే డైరెక్ట్ ఫీడింగ్‌కి అనుమతి ఇస్తారు. పిల్లల డాక్టర్‌కి కూడా ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్ చెప్పాలి. శిశువుకు కూడా 3వ నెలలో, ఏడాదిన్నర వయసులో పరీక్షలు చేస్తారు.నాకు డేకేర్‌లో హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ప్లాన్ చేశారు. గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. డైరెక్ట్‌గా కాకుండా ఇలాంటి ప్రొసీజర్‌తో రికవరీ లేట్ అవుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– గాయత్రి, వరంగల్హిస్టరోస్కోపీ ప్రొసీజర్‌లో చిన్న కెమెరా ద్వారా గర్భసంచిని, లోపలి పొరను స్పష్టంగా చూసి, ఉన్న సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. డైరెక్ట్‌గా డీ అండ్ సీ లాంటి వాటిలో సమస్య మూలం మిస్ అయ్యే చాన్స్ ఎక్కువ. పైగా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. హిస్టరోస్కోపీలో చాలా చిన్న పల్చటి పరికరంతో ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకోవడం కూడా జరుగుతుంది. హిస్టరోస్కోపీ పూర్తయ్యాక అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులు స్పాటింగ్లాగ ఉండవచ్చు. కొంతమందికి వెజైనా పెయిన్ ఉండవచ్చు. రెండురోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ప్రొసీజర్ తరువాత రొటీన్ పనులను రెండు రోజుల్లో మొదలుపెట్టుకోవచ్చు. ప్రతిరోజూ షవర్‌బాత్ చెయ్యాలి. బయట స్విమ్మింగ్ పూల్స్ రెండు వారాల వరకు వాడకూడదు. ఒకవేళ మీకు ఈ ప్రక్రియలో ‘పాలిపెక్టమీ’ చేసినట్లయితే, రెండు వారాల తరువాత రిపోర్ట్స్‌తో డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత ట్రీట్మెంట్, కేర్ అప్పుడు చెబుతారు. ఈ ప్రొసీజర్ తరువాత మీకు వెజైనల్ డిశ్చార్జ్, దుర్వాసన, జ్వరం, వెజైనల్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్‌ను కలవండి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
డెలివరీ టైమ్‌లో.. సైన్ కావాల్సి వస్తే?
నాకిప్పుడు తొమ్మిదోనెల. అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడే డెలివరీ ప్లాన్ చేస్తున్నాను. మావారు యూఎస్‌లోనే ఉన్నారు. నా లేబర్ టైమ్‌లో ఏదైనా అవసరమైతే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా సైన్ కావాల్సి వస్తే నేను ఒప్పుకుంటే సరిపోతుందా? – చిక్కేపల్లి మనోజ్ఞ, హైదరాబాద్ప్రెగ్నెన్సీ, డెలివరీ అనేవి ఆడవాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు. బిడ్డకు జన్మనివ్వడమనేది మరచిపోలేని అనుభూతిగా ఉండాలి. అలాంటి సురక్షితమైన ప్రసవానికి మంచి ఆసుపత్రి అవసరం. నిజానికి ఇది ఆడవాళ్ల ఫండమెంటల్ రైట్. దీన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి, అందులోని వైద్య సిబ్బంది.. డెసిషన్ మేకింగ్‌లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ చెకప్స్ నుంచి వైద్యపరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ వంటి వాటన్నిట్లో మీ సమ్మతి తీసుకుంటారు. అంటే ఏదైనా మీ ఇష్టప్రకారమే జరగాలని అలా కన్సెంట్ అడుగుతారు.అలాగే ఏది సురక్షితమో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. మీ కుటుంబం అభిప్రాయాన్ని, సలహా, సూచనలను మీరు ఎల్లవేళలా తీసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాన్నే డాక్టర్ ఫాలో అవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో భావోద్వేగాలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, ప్రసవం వంటివాటికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్, టెస్ట్‌ల గురించి మీకు అర్థమయ్యే భాషలో రాసి ఉన్న బుక్లెట్స్ని మీకు ఇస్తారు. మీరు చదివాక మీ సందేహాలను తీరుస్తూ మళ్లీ ఒకసారి వాటన్నిటి గురించి సంబంధిత డాక్టర్ చక్కగా వివరిస్తారు.ప్రీనాటల్ టెస్ట్, లేబర్ ఇండక్షన్, ఫీటల్ మానిటరింగ్స్, వెజైనల్ ఎగ్జామినేషన్స్, ఎపిడ్యురల్స్, ఎపిసియోటమి, ఫోర్సెప్స్ డెలివరీ, సిజేరియన్ లాంటి అన్ని ప్రక్రియల గురించి.. వాటికున్న రిస్క్స్, బెనిఫిట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేది మంచిదో.. మీకేది సూట్ అవుతుందో చెప్తారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీకు సురక్షితంగా ప్రసవం చేసే బాధ్యతను డాక్టర్ తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఆ టెస్ట్, ప్రొసీజర్, చెకప్ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల గురించీ చెప్తారు. వాటికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన సమయమూ ఇస్తారు.ఫలానా టెస్ట్ చేయకూడదు అని మీరు నిర్ణయించుకుంటే దాని పర్యవసానాల గురించి, తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ ప్రొసీజర్స్ కూడా వివరిస్తారు. అవన్నీ మీకు పూర్తిగా అర్థమయ్యే మీరు ఓ నిర్ణయానికి వచ్చారా అనీ చెక్ చేస్తారు. మీ భర్త, మీ కుటుంబం అభిప్రాయాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నా.. ఫైనల్‌గా మీరు చెప్పే నిర్ణయాన్నే డాక్టర్ కన్సిడర్ చేస్తారు. ఎలెక్టివ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్‌కి మీ సమ్మతి చాలా ముఖ్యం. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి వస్తే మీ నుంచి వర్బల్ కన్సెంట్ తీసుకుంటారు. లేబర్ వార్డ్ స్టాఫ్, నర్స్‌లు అందరూ సపోర్టివ్‌గానే ఉంటారు. మీకు సౌకర్యంగా ఉండేలా చూస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలిప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.అవి శరీరంలోకి ఇన్సర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్‌ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్‌ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్‌ను విడుదల చేస్తూ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది.ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్‌ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్‌తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్‌ను సూచిస్తారు. అవుట్ పేషంట్‌గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్‌ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్ -
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్ -
Health: సిజేరియన్ చేయించుకోవడంలో ఏమైనా ప్రమాదం ఉంటుందా?
నాకిప్పుడు 9వ నెల. ఫస్ట్ టైమ్ డెలివరీ చాలా కష్టమైంది. ఇప్పుడు నాకు సిజేరియన్ చేయించుకోవాలనే ఉంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్‌ను సేఫ్‌గా చేసే సదుపాయాలు చాలానే ఉన్నాయట కదా! ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయితే రెండోసారి సిజేరియన్‌కి వెళ్లకూడదా? దయచేసి నా డౌట్స్ క్లియర్ చేయండి! – ప్రసూన వనరాజు, హన్మకొండఏ మెడికల్ రీజన్ లేకుండా సిజేరియన్‌కి వెళ్లటం మంచిదికాదు. మీకు మొదటి కాన్పు నార్మలే అయింది కాబట్టి ఈ సెకండ్ డెలివరీ త్వరగా.. ఈజీగా అయ్యే చాన్సేసే ఎక్కువ. అయితే మీకు ఫస్ట్ డెలివరీ కష్టమైందని సిజేరియన్‌కి వెళదామనుకుంటున్నారు కాబట్టి ఎందుకు కష్టమైందో.. ఆ ప్రాబ్లమ్ ఏంటో మీరు మీ గైనకాలజిస్ట్‌తో వివరంగా చర్చించండి. అది మళ్లీ రిపీట్ అయ్యే ప్రాబ్లమ్ లేదా పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్ కాకపోతే నార్మల్ డెలివరీకి ప్రయత్నించడమే మంచిది.రిస్క్స్, ప్రయోజనాలు రెండూ రెండు (నార్మల్ లేదా సిజేరియన్) డెలివరీల్లో ఉంటాయి. రికవరీ టైమ్ నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ డెలివరీలో ఎక్కువ. అనవసరంగా సిజేరియన్ చేయకూడదని ప్రభుత్వం నుంచీ సీరియస్ అడ్వయిజెస్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాటను చెబుతోంది. దీన్నిబట్టి ఆపరేషన్ రిస్క్ ఎక్కువనే కదా అర్థం. ఇందులో షార్ట్ టర్మ్ / లాంగ్ టర్మ్ రిస్క్స్ ఉంటాయి. వెజైనల్ బర్త్‌లో కొంత ఆందోళన, అన్ప్రిడిక్టబులిటీ ఉంటాయి. పెయిన్ రిలీఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ రిస్క్‌ని ఆపరేషన్‌తో నివారించినా సిజేరియన్తో కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.ఇది పదిమందిలో ఒకరికి వస్తుంది. తగ్గటానికి కొన్ని నెలలు పడుతుంది. అలాగే సిజేరియన్ అయిన వాళ్లల్లో కాళ్లల్లో, ఛాతీలో రక్తం గడ్డకట్టే ప్రమాదం అయిదు రెట్లు ఎక్కువ. అంతేకాదు బ్లీడింగ్ ఎక్కువై రక్తం ఎక్కించాల్సి వచ్చే రిస్క్ కూడా సిజేరియన్ కేసుల్లోనే ఎక్కువ. అధిక బరువు ఉన్న వారిలో ఈ రిస్క్స్ రెండింతలెక్కువ. బిడ్డలో కూడా టెంపరరీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ఐసీయూ కేర్‌లో అడ్మిట్ చేయాల్సి రావచ్చు. సిజేరియన్‌ను ఎంత జాగ్రత్తగా చేసినా వెయ్యిలో ఒకరికి బవెల్ / బ్లాడర్ ఇంజ్యూరీ, యురేటర్ ఇంజ్యూరీ కావచ్చు. మళ్లీ తర్వాత డెలివరీ కూడా సిజేరియనే చేయాల్సి వస్తుంది.తర్వాత ప్రెగ్నెన్సీలో ప్లెసెంటా సిజేరియన్ స్కార్‌కి అతుక్కుని బ్లీడింగ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉండొచ్చు. వెజైనల్ డెలివరీలో కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ చాన్సెస్ ఉండొచ్చు. వెజైనల్ టేర్స్ లేదా ఎపిసియోటమీ (్ఛpజీటజీ్టౌౌఝy) పెయిన్ ఉండొచ్చు. కానీ పైన చెప్పిన సిజేరియన్ రిస్క్స్ కన్నా ఇవి చాలా తక్కువ. తేలికగా ట్రీట్ చేయొచ్చు. ఈరోజుల్లో మంచి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించి .. మీకు ఇంతకుముందు ఎదురైన ఇబ్బంది ఈసారి తలెత్తకుండా భద్రంగా వెజైనల్ డెలివరీ చేయటమే మంచిది. ఒకసారి మీ గైనకాలజిస్ట్‌తో అన్ని సవివరంగా చర్చించి మీకు, పుట్టబోయే బిడ్డకు ఏది సురక్షితమో ఆ సలహా, సూచనను తీసుకోండి.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ నిలుపుదలలో.. పెరుగుతున్న భయం తగ్గాలంటే?
నాకు ఇదివరకు రెండుసార్లు 5 వ నెలలో నొప్పులు రాకుండానే అబార్షన్ అయింది. సెర్విక్స్‌కి కుట్లు వేసినా ప్రెగ్నెన్సీ ఆగలేదు. ఇప్పుడు రెండవ నెల. ఈ ప్రెగ్నెన్సీ నిలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – వి. మౌనిక, సికింద్రాబాద్మీరు చెప్పిన కండిషన్‌ని సెర్వైకల్ ఇన్‌కంపిటెన్స్ అంటారు. కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్‌గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక మూడు నెలల తర్వాత గర్భస్రావం లేదా కాన్పు సమయం కంటే ముందుగానే వాటర్ బ్రేక్ అవడం లేదా నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. ఇన్ఫెక్షన్ లాంటివి ఏవీ లేకుండా, నొప్పులూ లేకుండా సెర్విక్స్ తెరుచుకుని అబార్షన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది. మొదటి ప్రెగ్నెన్సీలో అలా అయినప్పుడు రెండవసారి ప్రెగ్నెన్సీలో 3వ నెలలో ట్రాన్స్‌వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్‌తో కుట్లు వేస్తారు.ఇవి సెర్విక్స్‌ని మూసి ఉంచుతాయి. నెలలు నిండిన తరువాత 37–38 వారాల్లో ఈ కుట్లను విప్పి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తారు. అయితే కొన్ని కేసేస్లో ఈ కుట్లు వేసినా అబార్షన్ అవుతుంది. అలాంటి వారికి ట్రాన్స్‌అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు. ఇవి సెర్విక్స్‌ని టైట్‌గా క్లోజ్ చేసి ఉంచుతాయి. ఈరోజుల్లో ఈ ప్రొసీజర్ని లాపరోస్కోపీ ద్వారా చేస్తున్నారు. పొట్ట మీద కోత లేకుండా చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా సెర్విక్స్‌కి కుట్లు వేస్తారు.ఇది తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ సురక్షితమైన ప్రక్రియ. దీనికోసం ఆసుపత్రిలో జాయిన్ అవాల్సిన అవసరం లేదు. డే కేర్‌లోనే చేసేస్తారు. చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్తారు. అయితే ఈ కుట్లు తీయడం కష్టం కాబట్టి.. ఈ కేసుల్లో సిజేరియన్ డెలివరీయే చేయాల్సి ఉంటుంది. కుట్లు అలాగే ఉండి.. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడుతాయి. ఒకవేళ తరువాత పిల్లలు వద్దు అనుకుంటే సిజేరియన్ టైమ్‌లోనే కుట్లు తీసేస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన లాపరోస్కోపీ సర్జన్ చాలా భద్రంగా చేస్తారు. కాన్పు సమయం దగ్గరపడుతున్నా.. లేదా నొప్పులు మొదలైన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు.ఏదైనా గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి, రెండవ నెలలో రక్త, మూత్ర పరీక్షలు చేయించుకొని యూరిన్ లేదా వెజైనాలో ఏ ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకోండి. వయబిలిటీ స్కాన్ చేస్తారు. సెర్విక్స్‌కి కుట్లు వేయాలి అనే నిర్ణయానికి వస్తే అవి ఏ టైమ్‌లో వేయాలో నిర్ధారించుకుంటారు. మామూలుగా అయితే.. మూడవ నెలలో గర్భిణీలందరికీ చేసే Nuఛిజ్చి∙్టట్చnట uఛ్ఛిnఛిy టఛ్చిn (Nఖీ స్కాన్) తర్వాత లాపరోస్కోపిక్ సెర్వైకల్ సర్‌క్లేజ్‌కి ప్లాన్ చేస్తారు. ఇప్పటివరకు జరిగిన పలు అధ్యయనాల్లో.. ఇలా కుట్లు వేసిన వారిలో 89 శాతం మందిలో గర్భం నిలబడి.. సురక్షితంగా బిడ్డను కన్నట్టు వెల్లడైంది.— డా. భావన కాసు, ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?
నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్‌నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్‌సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. - డా భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
మేనరికం పెళ్లి చేసుకోవచ్చా? జెనెటికల్ కౌన్సెలింగ్ హెల్ప్ అవుతుందా?
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
Dr. Shilpi Reddy: డ్యాన్సింగ్ మామ్స్
ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేయించుకుంటున్న ఈ రోజుల్లో డ్యాన్సింగ్ థెరపీ ద్వారా నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి. మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న సిజేరియన్ రేషియో తగ్గించడానికి ఏడేళ్లుగా ఈ డాక్టర్ చేస్తున్న కృషి ఎంతో మంది కాబోయే తల్లులకు వరదాయినిగా మారింది. ఈ విషయాల గురించి డాక్టర్ మరింతగా ఇలా వివరించారు. ‘ఈ మధ్య కాలంలో గర్భిణులు చేసే పనుల్లో ఫోర్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు బాగా తగ్గిపోయాయి. గతంలో నీళ్లు చేదడం, ముగ్గులు పెట్టడం, ఇండియన్ టాయిలెట్లు వాడటం, కూర్చొని బట్టలు ఉతకడం, దంచడం, రుబ్బడం, వంటలు చేయడం.. ఇలాంటి పనులన్నీ డెలివరీ అయ్యే దారిని అనువుగా మార్చేవి. ఇప్పుడు ఈ పనులన్నీ తగ్గిపోయాయి. ఫలితంగా డెలివరీ అయ్యే దారి ఇరుకుగా మారి ప్రసవం కష్టమైపోయింది. గర్భవతి అని తెలిసిన రోజు నుంచి ఆహారం బాగా తీసుకోవాలనే విధానం పెరిగింది. కూర్చొని వర్క్ చేసుకునే గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయి. శారీరక శ్రమ తగి, క్యాలరీలు పెరగడంతో లోపల బేబీ కూడా పెరుగుతుంది. ఇక ప్రసవ సమయానికి నొప్పి లేకుండా డెలివరీ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే, ప్రసవం నొప్పి అనేసరికి ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. దీని నుంచి బయటకు రాలేక ‘ఎందుకు రిస్క్...’ సిజేరియన్ అయితేనే బెటర్ అనుకుంటారు. సాధారణంగా వ్యాయామాలు, ఆహార నియమాలు గురించి చెబుతాం కానీ, ప్రసవం సమయానికి నొప్పి భయంతో కూడిన స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఈ వలయం నుంచి బయటకు తీసుకురావాలంటే ముందు నుంచీ భయం పోగొడుతూ వారి మనసును ఆహ్లాదంగా ఉంచాలి. అందుకే మంచి పాటలతో చిన్న చిన్న డ్యాన్సింగ్ మూమెంట్స్ చేయిస్తుంటాం. గర్భవతిగా ఉన్నన్ని రోజులూ దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వ్యాయామాలు, జుంబా క్లాసులు కూడా ఉంటాయి. సహజ ప్రసవానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ ఇది. సిజేరియన్ల రేషియో పెరగడంతో నార్మల్ డెలివరీల వైపు ప్రభుత్వాలు కూడా మొగ్గు చూపుతున్నాయి. అందరిలోనూ సహజ ప్రసవాల విషయంలో ఆలోచనలు పెరిగాయి. దీంతో దీని వెనక ఉన్న కారణాలనూ కూడా అవగాహనలోకి తీసుకొని చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్లానింగ్ అమల్లోకి రావాలంటే మంచి టీమ్, నిపుణులు అందుబాటులో ఉండాలి. ఎవరికి వారు సొంతంగా చేయలేరు. అలా చేస్తే, ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నాలో పుట్టిన ప్లానింగ్ కాబట్టి ఎక్కడైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించాలో కూడా నాకు తెలుసు. ఇక్కడ మా కడల్ హాస్పిటల్లో పెద్ద యోగా హాల్, ఫిజియోథెరపిస్టులు, ఎమర్జెన్సీ టీమ్, గైనకాలజిస్టులు .. ఈ సెటప్‌ను మాకు అనుగుణంగా మార్చుకున్నాం. దీనిని కాపీ చేయడం కూడా సులువు కాదు. నాలాగా చేయాలంటే సేమ్ సెటప్‌ను ఫాలో అవ్వాలి. ఈ ప్లానింగ్‌గా అమలు చేస్తే నాలుగైదేళ్లకు సక్సెస్ రావచ్చు. కోవిడ్ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. ముందు నుంచీ ప్లానింగ్ విషయంలో శ్రద్ధ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి, గ్రామీణ స్థాయి నుంచి కూడా మా సేవలు పొందడానికి వస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా కావల్సిన సేవలు అందిస్తున్నాం’ అని వివరించారు ఈ డాక్టర్. రోజువారీ పనులు అధిక ఆహారం తీసుకోకుండా, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, బామ్మల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం తయారీ, చేయాల్సిన రోజువారీ పనులు.. ఇలాంటివన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ చేశాం. ఈ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అయితే ప్రసవానికి వచ్చినప్పుడు భయమనేది లేకుండా గర్భిణిలో ఒక నిశ్చింత కలుగుతుంది. ఏడేళ్లుగా చేస్తున్న కృషి క్రమం తప్పకుండా ఏడేళ్లుగా చేయడంతో మంచి స్పందన వస్తోంది. గతంలో నోటి మాట ద్వారా వచ్చిన వారే ఎక్కువ. సోషల్‌మీడియా ద్వారా రెండేళ్లుగా చాలా మందిలోకి వెళ్లింది. మనకు వచ్చిన ఆలోచనను సరిగ్గా అమల్లో పెట్టినప్పుడు ‘ఎవరో నవ్వుతారు, ఏదో అంటారు’ అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. అప్పుడే సరైన ఫలితాలు పొందుతాం. ఈ ప్లానింగ్ విషయంలో జరిగినది అదే. గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీకి వస్తుందో తెలిసిపోతుంది. అయితే, కొంతమంది మాత్రం మంచి ముహూర్తం అని చెప్పిన టైమ్‌కి సిజేరియన్ చేయమని అడుగుతుంటారు. ఇది సరైనది కాదని, నార్మల్ డెలివరీయే మేలైనదని చెబుతాం. సమాజంలో ఒక చిన్నమార్పు రావడానికి చేస్తున్న కృషి ఇది. – నిర్మలారెడ్డి -
వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె
ప్రిస్టిన్ కేర్ కో ఫౌండర్ డాక్టర్ 'గరిమా సాహ్నీ' గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వైద్య వృత్తిలో కోట్లు గడిస్తున్న ఈమె 800 పైగా ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఎంతో మంది రోగులకు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్న సాహ్నీ సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. గైనకాలజీ విభాగంలో ఉత్తమ వైద్యురాలుగా, మృదుభాషిగా పేరుపొందిన గరిమా సాహ్నీ వైద్య వృత్తిలోనే కొత్త సొగసులకు శ్రీకారం చుట్టింది. హాస్పిటల్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ప్రిస్టిన్ కేర్ అనే క్లినిక్ ప్రారంభించి ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.11400 కోట్లు. డాక్టర్ గరిమ, ఆమె స్నేహితుడు డాక్టర్ వైభవ్, అతని చిన్ననాటి స్నేహితుడు హర్సిమర్బీర్ సింగ్ క్లినిక్‌ని ఎలా విస్తరించాలనే దానిపై నిరంతరం కృషి చేసి ఎలక్టివ్ సర్జరీ రంగాన్ని ఎంచుకుని నాణ్యమైన వైద్యం అందించడం ప్రారంభించారు. వైద్యంలో మౌలిక సదుపాయాలు అందించడానికి, అదే సమయంలో రోగులకు చికిత్స అందించడానికి వారి ఖాళీ స్థలాన్ని ఉపయోగించాలనుకున్నారు. ప్రస్తుతం 42 నగరాల్లో సుమారు 1.5 మిలియన్ల మంది రోగులు సేవ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భారత్‌లో చీప్ అండ్ బెస్ట్ డీజిల్ కార్లు - మహీంద్రా బొలెరో నుంచి టాటా నెక్సాన్ వరకు..) డాక్టర్ సాహ్నీ ఆమె కుటుంబంలో మొదటి వైద్యురాలు. ఆమె తండ్రి సలహా మేరకు గైనకాలజీని ఎంచుకుంది. ఈమె డాక్టర్ వైభవ్‌ను వివాహం చేసుకుంది. ప్రిస్టిన్ కేర్ ప్రస్తుతం 800 పైగా ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇందులో దాదాపు అత్యాధునిక పరికరాల అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: BIS Care App: మీరు కొనే బంగారం స్వచ్ఛమైనదా.. కాదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి!) ప్రిస్టిన్ కేర్ అతి తక్కువ కాలంలోనే విజయవంతమైంది, 2022 ఆర్థిక సంవత్సరంలో వీరు రూ. 350 కోట్లకంటే ఎక్కువ ఆదాయాన్ని పొందారు. ఈ ఏడాది వారి సంపాదన సుమారు రూ. 1000 కోట్లు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి డాక్టర్ వృత్తిలో ఉంటూ బిలీనియర్స్ అయ్యారు. -
DOCTOR G : మగ గైనకాలజిస్ట్ తిప్పలు
ఇష్టం లేని పోస్టింగులు ఉద్యోగులకు ఉన్నట్టే ఇష్టం లేని డిపార్ట్మెంట్లు డాక్టర్లకు ఉంటాయి. కొందరు న్యూరో వద్దనుకుంటారు. కొందరు పిడియాట్రిషియన్ కావడాన్ని బోర్ ఫీలవుతారు. కొందరికి చర్మవ్యాధుల డాక్టర్ అవాలని అస్సలు ఉండదు. కాని వద్దనుకున్న సీటే వస్తే? ఆయుష్మాన్ ఖురానాకి గైనకాలజీలో సీటు వస్తుంది. కాని అతను చేయాలనుకున్నది ఆర్థోపెడిక్స్. గైనకాలజీ అంటే స్త్రీల ప్రపంచం. పేషంట్లకు ఇబ్బంది. ఈ డాక్టరుకు బెరుకు. ఈ సమస్యను స్క్రీన్ మీద నవ్వులు పూయించడానికి అదే సమయంలో డాక్టర్ల గొప్పతనం చాటడానికి త్వరలో వస్తోంది ‘డాక్టర్ జి’. దీనికి అనురాగ్ కశ్యప్ చెల్లెలు అనుభూతి కశ్యప్ దర్శకురాలు కావడం మరో విశేషం. ‘పేషెంట్లు మహిళా గైనకాలజిస్టునే ప్రిఫర్ చేస్తారు’ అంటాడు గైనకాలజీలో పి.జి. చేస్తున్న ఆయుష్మాన్. ‘ఈ ఆడ, మగ తేడా ఏంటి? డాక్టర్ డాక్టరే ఎవరైనా’ అంటుంది సీనియర్ మహిళా గైనకాలజిస్ట్ షేఫాలి షా. ‘పేషెంట్లు అలా అనుకోరు కదా’ అంటాడు. ‘ముందు నువ్వు అనుకో. నీ ఆలోచన మార్చుకో. నువ్వో గైనకాలజిస్టువి. నీలోని మేల్ టచ్‌ను వదులుకో’ అంటుందామె కోపంగా. గైనకాలజీ విభాగంలో మహిళా పేషెంట్లకు చికిత్స చేయాలంటే మగవాడైన తను ‘మగ స్పర్శ’ను ఎలా వదులుకోవాలి అనే తిప్పలు వచ్చి పడతాయి ఆయుష్మాన్‌కి. అతను హీరోగా నటిస్తున్న ‘డాక్టర్ జి’ ట్రైలర్‌లోని సంభాషణ ఇది. ఈ సినిమా రెండు వారాల్లో విడుదల కానుంది. డాక్టర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి గతంలో. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా రోజుల క్రితమే రాజేష్ ఖన్నా ‘ఆనంద్’లో అమితాబ్ పోషించిన డాక్టర్ పాత్ర చాలా ముఖ్యం. ఇంకా ‘డాక్టర్ కోట్నిస్ కీ అమర్ కహానీ’, ‘దిల్ ఏక్ మందిర్’, ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ డాక్టర్ ప్రొఫెషన్‌ను గొప్పగా చూపించాయి. ఇప్పుడు విడుదల కానున్న ‘డాక్టర్ జి’ కూడా ఈ రంగంలోని సాధకబాధకాలను చర్చించనుంది. అయితే కొంత సరదాగా. అది కూడా మగ గైనకాలజిస్ట్ సమస్యను తీసుకుంది. గైనకాలజీ అనగానే గర్భానికి సంబంధించిన విషయాలు, కాన్పులు, గర్భాశయ చికిత్సలు ఉంటాయి. పేషెంట్లు అనివార్యంగా స్త్రీలు కనుక డాక్టర్లు కూడా స్త్రీలే అయితే పరీక్షించడంలో ఇబ్బందులు ఉండవు. గుండె డాక్టరు, ఊపిరితిత్తుల డాక్టరు, ఈఎన్టి డాక్టరు మగవాడైనా పర్వాలేదు కాని మహిళా పేషెంట్లకు మగ గైనకాలజిస్టు అయితే ఇబ్బంది పడతారు. వారి కంటే ఎక్కువ ఇబ్బంది ఈ సినిమాలో ఆయుష్మాన్ పడనున్నాడు. కాని శరీరం ఎప్పుడైతే ‘రోగగ్రస్తం’ అవుతుందో ‘చికిత్స కు అవసరమైన స్థితికి’ చేరుకుంటుందో అప్పుడు ఆ శరీరం ‘స్త్రీదా’, ‘పురుషుడిదా’ అనే తేడా లేకుండా పోతుంది. పేషెంట్ కూడా ఆ సమయంలో తన ప్రాణం దక్కితే చాలు– వైద్యం ఎవరు చేసినా పర్వాలేదు అనే స్థితికి వెళుతుంది/వెళతాడు. ఇక్కడ కూడా ఒక అత్యవసర కాన్పు సమయంలో పేషెంట్ డాక్టర్ ఎవరనేది చూడదు. కాన్పు జరిగితే చాలనే అనుకుంటుంది. కాని ఆయుష్మాన్ ఖురానా తనలోని ఆ ఇబ్బందిని పోగొట్టుకుని శరీరాన్ని శరీరంలా చూసే స్థితికి చేరుకోవడమే ఈ కథ. ‘త్రీ ఇడియెట్స్’లో ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు కనిపించని సన్నివేశం ఉంటుంది. అది క్లయిమాక్స్‌లో కొంతమంది ఐఐటి విద్యార్థులు కలిసి కాన్పు కష్టమైన తమ డీన్ కుమార్తెకు పురుడు పోయడం. ఈ సన్నివేశం తీయడం కత్తి సాము మీద నడవడం లాంటిది. ఆ సమయంలో అక్కడ ఉన్నది స్త్రీ కాదు... ఆ కుర్రవాళ్లు పురుషులు కాదు. ఆమె పేషెంట్... వాళ్లు ఆమెకు సాయం చేస్తున్న మనుషులు... అలా చూపించగలగడంలో దర్శకుడు పెద్ద సక్సెస్ సాధిస్తాడు. అందుకే ఆమిర్ ఖాన్ కాన్పు కావాల్సిన స్త్రీ నుంచి బిడ్డ తల బయటకు వచ్చిందో లేదో లోపల తొంగి చూసి చెక్ చేయడం అసభ్యంగా ఉండదు. ఆ సందర్భంలో ప్రేక్షకులతో సహా అందరూ తాము స్త్రీలో పురుషులో అనే సంగతి మరచి మానవులుగా మారతారు. వైద్యంలో వైద్యులు ఇదే సాధన చేస్తారు. ‘డాక్టర్ జి’లో సీనియర్ గైనకాలజిస్ట్‌గా పని చేసిన షెఫాలీ షా పాత్ర ముఖ్యం. ఈ పాత్రే పి.జి. చేస్తున్న ఆయుష్మాన్ ఖురానాకు వైద్యం నేర్పిస్తుంది. స్త్రీ దేహ సమస్యలను మనిషిగా అర్థం చేసుకోవడంలో సాయం చేస్తుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ కనిపిస్తుంది. కథలో ఆమె కూడా మెడిసిన్‌లో పి.జి. చేసే స్టూడెంటే. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. మేనేజ్మెంట్ రంగంలో 8 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన అనుభూతి కశ్యప్ చివరకు తాను పని చేయాల్సింది సినిమాల్లోనే అని గ్రహించి మంచి ఉద్యోగాన్ని వదిలేసి అనురాగ్ కశ్యప్ తీస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ తీసింది. ‘డాక్టర్ జి’ ఆమె తొలి పెద్ద సినిమా అని చెప్పవచ్చు. మగ డాక్టర్ దగ్గర చూపించుకోవడం నామోషీ అని భావించే మహిళా పేషెంట్లు, మహిళా పేషెంట్ల విషయంలో కంఫర్ట్ ఫీలవని మగ డాక్టర్లు ఈ సినిమాను ఎలా వ్యాఖ్యానిస్తారో చూడాలి. మగవాళ్లు దర్శకులుగా ఉంటే ఇలాంటి సినిమాలు స్త్రీల దృష్టికోణం తప్పే అవకాశం ఉంది. కాని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అనుభూతి కశ్యప్. ఈమె అనురాగ్ కశ్యప్, అభినవ్ కాశ్యప్ (దబంగ్ దర్శకుడు)ల సోదరి. ‘డాక్టర్ జి తీయడానికి చాలారోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తం మీద తీయగలిగాను’ అంటుందామె. -
Health: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?
నాకు సిజేరియన్ అయ్యి మూడు నెలలవుతోంది. మా ఊళ్లో చేశారు. కుట్ల దగ్గర చాలా నొప్పి వస్తోంది. యాంటీబయాటిక్స్ వాడినా ఫలితం లేదు. ఈ మధ్య అంటే ఓ పదిరోజులగా కుట్ల నుంచి పస్ కూడా వస్తోంది. నేను సిటీకి వెళ్లి చూపించుకోవాలా? ఏమైనా ప్రమాదమా? – టి. హర్షిత, దేశాయిపేట, తెలంగాణ సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ రావటం సాధారణమే.పేషంట్ బరువును బట్టి, వాడిన యాంటీబయాటిక్స్, సర్జరీ టైమ్‌ను బట్టి రిస్క్ పెరుగుతుంది. కానీ ఇది చాలాసార్లు ఆపరేషన్ మొదటి, రెండు వారాల్లో బయటపడుతుంది. మీకు మూడు నెలల తర్వాత రావడం.. అంత మంచిది కాదు. దీనిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు చీము వస్తోంది అన్నారు. కాబట్టి వెంటనే సీనియర్ డాక్టర్‌ను కలవండి. చీము వస్తున్న చోటు నుంచి దూదితో వూండ్ స్వాబ్ తీస్తారు. దానిని బట్టి అందులో ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది, ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది. కొన్ని కేసెస్‌లో యాంటీబయాటిక్స్ వాడినా పస్ తగ్గదు. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పస్ లోపలి కుట్ల దగ్గర నుంచి వస్తోందా? ఏదయినా sinus tractలాగా ఫామ్ అయిందా అని చూస్తారు. ఎమ్ఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సిరావచ్చు. జనరల్ సర్జన్ అభిప్రాయం కూడా తీసుకోవాలి. మళ్లీ చిన్న ఆపరేషన్ చేసి ఆ చీమునంతా తీసేసి క్లీన్ చేసి ఏ ట్రాక్ట్ ఫామ్ అయిందో దానిని మూసేసి.. యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఈ ట్రాక్ట్ నుంచి తీసినదంతా మళ్లీ టెస్ట్‌కు పంపాలి. కొంతమందిలో టీబీ వల్ల కూడా ఇలా సిజేరియన్ అయిన చాలా నెలల తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యాంటీ–టీబీ ట్రీట్మెంట్ ద్వారానే ఇవి పూర్తిగా నయమవుతాయి. ఇలాంటి కేసెస్‌ను క్లోజ్‌గా ఫాలో అప్ చేయాలి. కుట్లకు వాడే కొన్ని రకాల మెటీరియల్స్ వల్ల కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Vasectomy Operations: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా? Lump In Breast During Pregnancy: ఐదో నెలలో రొమ్ములో గడ్డలు తగలడం నార్మల్ కాదు! వెంటనే.. -
ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా?
Healthy Pregnancy Tips: నమస్తే మేడమ్.. ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్లు చాలా అవసరం అంటారు కదా? ఏ సమయంలో, ఏ విటమిన్లు తీసుకుంటే మంచిదో చెప్పగలరు? – రమ్యశ్రీ, వరంగల్ బేబీ ఎదుగుదలకు విటమిన్లు అత్యంత అవసరం. చాలా విటమిన్లు మనం తీసుకునే ఆహారం ద్వారా అందుతాయి. ఫోలిక్ యాసిడ్ అనే ‘బి’ విటమిన్ చాలా అవసరం. ఇది బేబీ బ్రెయిన్, వెన్నుముక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం ఒక నెల ముందు నుంచి ఇది తీసుకోవాలి. 5 ఎమ్జీ డోస్ తీసుకుంటే సరిపోతుంది. విటమిన్ ‘డి’.. ప్రతిరోజు 10ఎమ్జీ పెగ్నెన్సీలో, ప్రసవం తర్వాత పాలు ఇచ్చే సమయంలోనూ తీసుకోవాలి. దాంతో పాటు గుడ్లు, మాంసాహారమూ తీసుకోవాలి. విటమిన్ ‘సి’ రెగ్యులర్‌గా అవసరం లేదు. కానీ ఈ విటమిన్ ‘సి’..రక్తం ఐరన్‌ను త్వరగా గ్రహించేలా చేస్తుంది. అసిడిటీ రాకుండా చూస్తుంది. అందుకే ఐరన్ టాబ్లెట్స్‌తో పాటుగా విటమిన్ సీని ఇస్తాం. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘ఈ’ ప్రెగ్నెన్సీ సమయంలో అవసరం లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా? – హిమాంజలి, విశాఖపట్నం చేపలు సహసంగానే మంచి ప్రొటీన్ ఆహారం. కానీ ఆయిలీ ఫిష్, సాల్మన్ ఫిష్ లాంటివి వారానికి 2 సార్ల కన్నా ఎక్కువ తినకూడదు. చికెన్ లివర్‌లో ఎక్కువ శాతం విటమిన్ ‘ఎ’ ఉంటుంది. ఇది బిడ్డ మెదడు ఎదుగుదలకి హాని కలిగిస్తుంది. అందుకే లివర్, లివర్ ఉత్పత్తులు, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. ప్రెగ్నెన్సీలో ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఎలా తగ్గించుకోవచ్చు? – చంద్రిక, రావులపాలెం కొన్ని సార్లు మనం రోజూ తీసుకునే పాలు, పెరుగు, గుడ్లు, మాంసం వంటి వాటి ద్వారా కూడా అప్పుడప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ రావచ్చు. అది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే కడుపుతో ఉన్న సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ► ఎప్పుడూ బాగా కాచిన పాలనే తాగాలి. పాశ్చరైజ్డ్ మిల్క్ మంచిది. ► పనీర్ లాంటివి ఫ్రెష్‌గా వాడాలి. ఏది ఆహారంగా తీసుకోవాలన్నా ప్యాకింగ్పైన ఎక్స్పెయిర్ డేట్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ► కొవ్వు ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు. ► సరిగ్గా ఉడకని ఆహారాన్ని, రెడీమేడ్ ఫుడ్‌ని తినకూడదు. ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో దాచిన పదార్థాలు తినకూడదు. ► భోజనం చేసే ముందు, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► పళ్లు, కూరగాయలు, రెడీమేడ్ సలాడ్స్ వంటివి బాగా శుభ్రం చేసుకుని, తొక్కలు తొలగించి తినాలి. బయటి ఆహారం తీసుకోవాల్సి వస్తే వేడివేడిగా ఉన్నవి, స్టీమ్ చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్, లిక్విడ్స్‌ను దూరం పెట్టాలి. ∙నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు రైట్ ఓవరీలో సిస్ట్ ఉందని చెప్పారు. ఇప్పుడు గత ఏడాది కన్నా సైజ్ పెరిగిందని ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. దీనికి ఏమైనా మందులు ఉంటాయా? – శ్రావణీ, హైదరాబాద్ ఓవరీస్‌లో సిస్ట్ ఉండటమనేది సర్వ సాధారణం. అది 3 సీఎమ్ కన్నా పెద్దగా ఉంటే దానికి పరీక్షలు చెయ్యాలి. ఇవి కొన్ని నీటి బుడగలుగా ఉంటాయి. కొన్ని థిక్ ఫ్లూయిడ్ బ్లెడ్‌తో ఉంటాయి. సింపుల్ సిస్ట్ అంటే కేవలం నీటి బుడగలు. ఈ వయసులో అవి కామన్. కొన్ని నెలలకు వాటంతట అవే∙పగిలిపోతాయి. ఏ ప్రమాదం ఉండదు. కానీ బ్లెడ్‌తో ఉన్న సిస్ట్ని ఎండోమెట్రియోమా అంటాం. దీనికి కొన్ని మందులు లేదా ఆపరేషన్ అవసరం. ఈ వయసులో సిస్ట్లు చాలా వరకు క్యాన్సర్‌గా మారవు. కానీ సిస్ట్ అని తెలిసినప్పుడు, 5 సీఎమ్ కన్నా తక్కువ ఉంటే ఆరు నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకుని, ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయేమో అని గమనించుకోవాలి. సడన్‌గా సైజ్ పెరిగినా, నొప్పి ఉన్నా ఆపరేషన్ తప్పదు. ఏ ఇబ్బంది లేనప్పుడు ఆపరేషన్ అవసరం లేదు. 5–7 సీఎమ్ సైజ్ ఉన్న సిస్ట్కి అడ్వాన్స్ స్కానింగ్/ సిటీ స్కానింగ్ చెయ్యాలి. లాపరోస్కోపిక్ ఆపరేషన్‌లో కేవలం సిస్ట్ని మాత్రమే తొలగిస్తాం. దాన్ని బయాప్సీ టెస్ట్‌కి పంపిస్తాం. ఓవరీ తీయవలసిన అవసరం చాలాసార్లు ఉండదు. చాలాసార్లు ౌఛిp’టసింపుల్ సిస్ట్కి పని చెయ్యవు. కొన్ని బ్లెడ్ టెస్ట్‌లు చేసి, సిస్ట్ ప్రమాదకరమైనదా అని చెక్ చెయ్యాలి. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
తెలంగాణలో అరుదైన సంఘటన: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
హైదరాబాద్: హైదరబాద్ నగరంలో.. మెహదీపట్నంలో గల మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, వారిలో ముగ్గురు ఆడపిల్లలుకాగా, ఒక మగ పిల్లవాడు జన్మించాడు. ప్రస్తుతం తల్లి, నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నారని.. ఆసుపత్రి గైనకాలజిస్ట్ సోహేబా షుకో తెలిపారు. Telangana | A 27-year-old woman gives birth to quadruplets in Hyderabad The women gave birth to a baby boy and three baby girls. All the babies and the mother are healthy: Dr. Soheba Shukoo, Obstetrician and gynaecologist, Mina Multispeciality Hospital pic.twitter.com/nI5xvGLV2l — ANI (@ANI) October 27, 2021 చదవండి: బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా -
ఆ మధ్యలో... అలా అవుతోంది...
ప్రశ్న: నా వయసు 33 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 55 కిలోలు. గత ఏడాది రెండో కాన్పు తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తోంది. తరచుగా మూత్రం రావడమే కాకుండా, మూత్రం సమయంలో మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సువర్ణ, నిర్మల్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్(కండపట్టడం), ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం, గర్భాశయంలో వాపు అండాశయంలో నీటిబుడగలు, నీటి గడ్డలు, సిస్ట్లు, కంతులు, గర్భాశయ ముఖ ద్వారంలో పుండ్లు, హార్మోన్ల అసమతుల్యత, కొందరిలో పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే సమయంలో బ్లీడింగ్ కనిపించవచ్చు. గైనకాలజిస్ట్‌కు సంప్రదించి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్‌స్మియర్, వెజైనల్ పెల్విన్ అల్ట్రాసౌండ్, ఎస్ఆర్ టీఎస్‌హెచ్, సీబీపీ వంటి అవసరమైన రక్తపరీక్షలు వంటివి చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం తరచుగా రావడం, మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకుని దానిని బట్టి సరైన యాంటీ బయాటిక్ కోర్స్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. పీరియడ్స్ మధ్యలో అయ్యే బ్లీడింగ్‌కు పాలిప్, ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం వంటివి కారణం అయితే దానికి గర్భాశయంలో హిస్టెరోస్కోపీ ద్వారా చూస్తూ డీ అండ్ సీ చేయడం ద్వారా పొరను తొలగించి బయాప్సీకి పంపించడం, హార్మోన్స్ అసమతుల్యత చిన్న సిస్ట్లు ఉంటే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయడం, పెద్ద సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర కారణాలు ఉంటే ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడం వంటి చికిత్స విధానాలను గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవలసి ఉంటుంది. ప్రశ్న: మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఎత్తు 5.4, బరువు 38 కిలోలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. బరువు తక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఆలస్యమవుతుందని విన్నాను. దీనికి ఇతర సమస్యలేవైనా కారణం కావచ్చా? పరిష్కారం వివరించగలరు. – అమ్మాజీ, యలమంచిలి మీ అమ్మాయి 5.4 ఎత్తుకి కనీసం బరువు 50 కేజీలు అయినా ఉండాలి. సాధారణంగా అమ్మాయి 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ కావడానికి హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యాలి అంటే శరీరంలో కనీసం 20 శాతం అయినా కొవ్వు ఉండాలి. మీ అమ్మాయి మరీ సన్నగా ఉంది కాబట్టి రజస్వల కాకపోవడానికి అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కొందరిలో పుట్టుకలోనే గర్భాశయం, అండాశయాలు లేకపోవడం, లేదా వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల 16 ఏళ్లైనా మెచ్యూర్ కాకపోవచ్చు. మీ అమ్మాయికి 16 ఏళ్లు కాబట్టి.. మెచ్యూర్ కాకపోవడానికి వేరే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్, సీబీపీ, ఎస్ఆర్. టీఎస్‌హెచ్, ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ లోపల మీ అమ్మాయికి పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు వంటి పౌష్టికాహారం ఇవ్వండి. కారణాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటే ఎండొక్రైనాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. డాక్టర్ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
SK Bhandari: ఢిల్లీ డాక్టర్ ఎస్. కె. భండారీ
కొన్ని ఊళ్లు కొందరు డాక్టర్లను గుర్తుకు తెస్తాయి. అలాగే కొందరు డాక్టర్లు కొన్ని ఊళ్లను గుర్తుకు తెస్తారు. ఎస్.కె.భండారీ సుమారు అరవై ఏళ్ల పాటు ఢిల్లీలోమంచి డాక్టర్‌గా, ఢిల్లీ డాక్టర్‌గా గుర్తింపు పొందారు. అలాగే ఆమెకు ఉన్న మరొక గుర్తింపు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఆమె చేతుల మీదుగానే జన్మించడం! న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వెబ్ సైట్లోకి వెళ్లి ‘ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’ విభాగంలో డాక్టర్ల జాబితాను చూస్తే అక్కడ ఇప్పటికీ డాక్టర్ భండారి ఫొటో కనిపిస్తూ ఉంటుంది. 86 ఏళ్ల డాక్టర్ ఎస్.కె.భండారీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అదే హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న సర్ గంగారామ్ కాల్మెట్ హాస్పిటల్‌లోని కరోనా వార్డులో మరణించారు. రెండు వారాల క్రితం గుండెకు సంబంధించిన అనారోగ్యాలతో ఆసుపత్రిలో చేరారు డాక్టర్ భండారీ. వాటికి చికిత్స జరుగుతూ ఉండగానే కోవిడ్‌తో అంతిమశ్వాస వదిలారు. అయితే ఆ ఆసుపత్రికి ఆమె అందించిన సేవల స్మృతులు ఎప్పటికీ అక్కడివారిని వదిలి వెళ్లేవి కావు. అందుకు ప్రతీకాత్మకంగానే అన్నట్లుగా వెబ్‌సైట్‌లోని డాక్టర్ల ఫొటోల మధ్య ఆమె స్థానం చిరస్మరణీయంగా ఉండి ఉంటుంది. డాక్టర్ భండారీ గత 58 ఏళ్లుగా ఆ ఆసుపత్రి లో ప్రసూతి వైద్యురాలిగా (ఆబ్స్టెస్ట్రీషియన్), స్త్రీల వైద్య నిపుణురాలిగా (గైనకాలజిస్ట్) పని చేస్తున్నారు. లండన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవగానే నేరుగా ఆమె ఢిల్లీ వచ్చి సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరిపోయారు. ఆసుపత్రిలో తొలిసారి ‘ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ’ విభాగాన్ని నెలకొల్పింది కూడా డాక్టర్ భండారీనే! ఐవీఎఫ్‌లో తను నిపుణురాలు కానప్పటికీ హాస్పిటల్లో ఒకటంటూ ఆ విభాగం ఉండాలని పట్టుపట్టి ఐవీఎఫ్‌ను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం గంగారామ్ ఆసుపత్రి ఛైర్మన్ డి.ఎస్. రాణా. నలభై ఏభయ్యేళ్ల క్రితం ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు.. ఢిల్లీలో మంచి గైనకాలజిస్టులుగా రెండే పేర్లు వినిపించేవట. ఒకరు డాక్టర్ భండారీ. ఇంకొకరు డాక్టర్ శీలా మెహ్రా. శీల మూల్‌చంద్ మెడిసిటీలో చేసేవారట. డాక్టర్ భండారీ తనకు తల్లి లాంటి వారనీ, ఆమె మరణం తనకు తీరని లోటు అని రాణా ఆవేదన చెందారు. డాక్టర్ భండారీ భర్త రిటైర్డ్ ఆఫీసర్. 97 ఏళ్లు. ప్రస్తుతం ఆయన కోవిడ్ వార్డులో ఐసీయులో ఉన్నారు. భార్య చనిపోయిన విషయాన్ని వెంటనే ఆయనకు చేరవేసే సాహసాన్ని ఎవరూ చేయలేకపోయారు. ఒకటే కూతురు. కొన్నాళ్లుగా ఆమె తన తల్లిదండ్రుల దగ్గరే ఉండి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె కూడా వైద్యురాలే. డాక్టర్ భండారీని గుర్తు చేసుకుంటున్న చాలామందిలో ఆ ఆసుపత్రి ఐవీఎఫ్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అభా మంజుదార్తోపాటు, ఆసుపత్రి బయట ప్రియాంక, రాహుల్ గాంధీ వంటి వాళ్లు కూడా ఉన్నారు. ఆ అన్నాచెల్లెళ్లకు డాక్టర్ భండారీనే తన చేతుల మీదుగా జన్మనిచ్చారు. ప్రియాంక కొడుకు, కూతుళ్లకు ఆమే పురుడు పోశారు. అందుకే కావచ్చు డాక్టర్ భండారీ మరణం గురించి తెలియగానే ఆమెతో తనకున్న అనుబంధాన్ని, వృత్తి పట్ల ఆమె అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ.. డాక్టర్ భండారీ తన డెబ్బై ఏళ్ల వయసులోనూ సొంతంగా కారు నడుపుకుంటూ ఉదయాన్నే డ్యూటీకి వెళుతుండేవారని ప్రియాంక నివాళులు అర్పించారు. ఇక డాక్టర్ అభా మజుందార్ 1987 నుంచి భండారీతో కలిసి పని చేస్తున్నారు. డాక్టర్ భండారీ రాంచీలో తన తల్లి జయంతి కార్యక్రమంలో తన చేత ప్రత్యేకంగా ప్రసంగం ఇప్పించారని అభా గుర్తు చేసుకున్నారు. -
సిరిసిల్లలో మరో మృగాడు
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనేలా తయారవుతున్నారు మృగాళ్లు. మొన్నటికి మొన్న వేములవాడలో బాలికను వరుసకు బావే లోబర్చుకుని గర్భవతిని చేసిన ఘటన మరువక ముందే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాలలో నివాసం ఉండే ఓ పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు మరో ప్రబుద్ధుడు. తనకేం జరుగుతుందో తెలుసుకోలేని ఆ పిచ్చితల్లి బాత్రూం వెళ్లిన సందర్భంలో తనకు తానే ప్రసవం చేసుకుంది. పుట్టిన ఆడశిశువు క్షణకాలంలో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. సాక్షి, సిరిసిల్ల: మున్సిపల్ పరిధిలో నివాసం ఉండే ఇండ్ల దేవలక్ష్మి(22) మతిస్థిమితం లేదు. తల్లి వజ్రవ్వ, తండ్రి నర్సయ్య రోజువారి కూలీలు. వీరితోపాటు అప్పుడప్పుడు పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో స్థానికంగా నివాసం ఉండే రాజు అనే మృగాడి కళ్లు దేవలక్ష్మిపై పడ్డాయి. మాయమాటలు చెప్పి పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు. నెలల గడిచే కొద్ది దేవలక్ష్మి శరీరాకృతిలో మార్పులు రావడంతో సిరిసిల్ల వెంకంపేటలోని సత్యనారాయణ అనే ఆర్ఎంపీ వద్ద పరీక్షలు చేయించి మందులు తీసుకున్నట్లు దేవలక్ష్మి తల్లి వివరించింది. ఆర్ఎంపీ దేవలక్ష్మి గర్భవతి అని చెప్పలేదని బాధితురాలి తల్లి వాపోయింది. గోప్యంగా నెలల గడిచాక.. దేవలక్ష్మి ఆదివారం ఉదయం బాత్రూంకు వెళ్లి అందులో తనకు తెలియకుండా స్వతహాగా ప్రసవం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పుట్టిన ఆడశిశువు పరిమాణాన్ని బట్టి గర్భం దాల్చి ఏడునెలలు దాటి ఉంటుందని వైద్యులు, ఐసీడీఎస్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులిద్దరికి సరైన అవగాహన లేకపోవడంతో ఘోరం జరిగిందని స్థానికులు ముచ్చటించుకున్నారు. ప్రబుద్ధుడి పేరు చెప్పలేని స్థితిలో... యువతి ప్రసవించిందని తెలిసిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పలురకాల ప్రశ్నలు అడిగారు. బాధితురాలి తల్లి ఎలాంటి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న రాజుపై పది మందిలో పంచాయతీ పెట్టాలని చెప్పామని కానీ ఆ పని చేసే స్థితి తల్లిదండ్రులిద్దరికి లేకపోవడం ప్రబుద్ధుడు ఆడింది ఆటగా మారిందనే మాటలు వినిపించాయి. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. పోలీసుల చొరవతో ప్రైవేటుకు.. బాత్రూంలో యువతి ప్రసవించి ప్రాణాపాయ స్థితిలో ఉందని స్థానికులు, ఐసీడీఎస్, ఎన్జీవో, పోలీసు అధికారులు హుటాహుటీనా ఆసుపత్రికి వస్తే అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఎలాంటి పరీక్షలు చేయకుండా గైనకాలజిస్ట్ లేరని కరీంనగర్ వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. మృతశిశువును మార్చురీలో భద్రపరచాలని సీఐ శ్రీనివాస్ చెప్పినా దానిపై స్పందన లేకుండాపోయింది. పిచ్చితల్లికి సరైన వైద్యం అందించాలని చెబుతుంటే మృతశిశువు రక్తపరీక్షలు చేయాలని, ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారని డ్యూటీ డాక్టర్ తన కుర్చీలోంచి లేవకుండా ఇచ్చిన సలహాలు అందరిలో కోపాన్ని కలిగించాయి. అన్ని గమనించిన సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఐసీడీఎస్ సీడీపీవో అలేఖ్యపటేల్, అంగన్వాడీ టీచర్స్ వింధ్యారాణి, వెంకటలక్ష్మి మరో స్థానికురాలి సహకారంతో సిరిసిల్లలో అమ్మ ఆసుపత్రి వైద్యురాలు వాణి వద్దకు దేవలక్ష్మిని పంపించి వైద్య సేవలందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నిర్లక్ష్యాన్ని అందరూ తప్పుబట్టారు. చట్టప్రకారం చర్యలు ప్రస్తుతం యువతిని రక్షించే చర్యలు తీసుకున్నాం. దీనికి కారణమైన వ్యక్తికి సంబంధించి సమాచారం ఉంది. దానిని చట్టపరిధిలో పరిశీలించి యువతికి న్యాయం చేసేలా ముందుకెళ్తాం. – శ్రీనివాస్, సీఐ, సిరిసిల్ల టౌన్ -
సిజేరియన్లపై మేనక సీరియస్
న్యూఢిల్లీ: విచ్చలవిడిగా జరుగుతున్న సిజేరియన్ ఆపరేషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మహిళల ఆరోగ్యాన్నిదెబ్బతీయడంతోపాటు..కొన్నిచోట్ల మరణాలకు దారి తీస్తున్న వైనాన్ని మహిళా శిశు మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిగణిస్తోంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ ట్విట్టర్ లో దేశీయ గైనకాలజిస్టులకు కొన్ని హెచ్చరికలు లేదా మార్గదర్శకాలను జారీచేసేలా యోచిస్తున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఆమె వరుస ట్వీట్లలో కొన్ని సూచనలు చేశారు. ఆయా ఆసుపత్రులు సిజేరియన్, సాధారణ కాన్పుల రికార్డులను బహిర్గతం చేయాలన్నారు. ఈ సమస్య తీవ్రత, పర్యవసానాలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డాకు లేఖ రాసినట్టు తె లిపారు. కొన్ని రాష్ట్రాల్లో సి సెక్షన్ శస్త్రచికిత్సలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫారసు చేసిన కంటే 10-15 శాతం చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్న ఈ ఆపరేషన్లు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితి ప్రయివేట్ ఆసుపత్రుల్లో మరీ దారుణంగా ఆమె పేర్కొన్నారు. 2015-16 సంవత్సరానికి నేషనల్ ఫ్యామిటీ హెల్త్ సర్వే ప్రకారం తెలంగాణాలో 58శాతం, తమిళనాడు 34 శాతంగా ఉందన్నారు. గత నెల ఎయిమ్స్‌లో సిజేరియన్ ఆపరేషన్ తరువాత ఒక నర్సు చనిపోయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. సి-సెక్షన్లు-అదుపునకు కాన్పుల వివరాలను బహిర్గతం చేసే అంశాన్ని తప్పనిసరి చేయాలని సూచించాన్నారు. దేశంలో పెరుగుతున్న ఈ ధోరణికి చెక్ చెప్పే మార్గాలపై మహిళలు, భావి తల్లులు, వైద్యులు నుంచి సలహాలను కోరుతున్నట్టు ట్వీట్ చేశారు. I have written to Minister, @MoHFW_INDIA, Sh. @JPNadda ji today about the scale of the problem and its repercussions — Maneka Gandhi (@Manekagandhibjp) February 22, 201I seek suggestions from women, prospective mothers & doctors on ways in which we can check this increasing trend. /10 — Maneka Gandhi (@Manekagandhibjp) February 22, 2017