ప్రతీకాత్మక చిత్రం
Healthy Pregnancy Tips: నమస్తే మేడమ్.. ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్లు చాలా అవసరం అంటారు కదా? ఏ సమయంలో, ఏ విటమిన్లు తీసుకుంటే మంచిదో చెప్పగలరు?
– రమ్యశ్రీ, వరంగల్
బేబీ ఎదుగుదలకు విటమిన్లు అత్యంత అవసరం. చాలా విటమిన్లు మనం తీసుకునే ఆహారం ద్వారా అందుతాయి. ఫోలిక్ యాసిడ్ అనే ‘బి’ విటమిన్ చాలా అవసరం. ఇది బేబీ బ్రెయిన్, వెన్నుముక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం ఒక నెల ముందు నుంచి ఇది తీసుకోవాలి. 5 ఎమ్‌జీ డోస్ తీసుకుంటే సరిపోతుంది.
విటమిన్ ‘డి’.. ప్రతిరోజు 10ఎమ్‌జీ పెగ్నెన్సీలో, ప్రసవం తర్వాత పాలు ఇచ్చే సమయంలోనూ తీసుకోవాలి. దాంతో పాటు గుడ్లు, మాంసాహారమూ తీసుకోవాలి. విటమిన్ ‘సి’ రెగ్యులర్‌గా అవసరం లేదు. కానీ ఈ విటమిన్ ‘సి’..రక్తం ఐరన్‌ను త్వరగా గ్రహించేలా చేస్తుంది. అసిడిటీ రాకుండా చూస్తుంది. అందుకే ఐరన్ టాబ్లెట్స్‌తో పాటుగా విటమిన్ సీని ఇస్తాం. విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘ఈ’ ప్రెగ్నెన్సీ సమయంలో అవసరం లేదు.
ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా?
– హిమాంజలి, విశాఖపట్నం
చేపలు సహసంగానే మంచి ప్రొటీన్ ఆహారం. కానీ ఆయిలీ ఫిష్, సాల్మన్ ఫిష్ లాంటివి వారానికి 2 సార్ల కన్నా ఎక్కువ తినకూడదు. చికెన్ లివర్‌లో ఎక్కువ శాతం విటమిన్ ‘ఎ’ ఉంటుంది. ఇది బిడ్డ మెదడు ఎదుగుదలకి హాని కలిగిస్తుంది. అందుకే లివర్, లివర్ ఉత్పత్తులు, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు.
ప్రెగ్నెన్సీలో ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను ఎలా తగ్గించుకోవచ్చు?
– చంద్రిక, రావులపాలెం
కొన్ని సార్లు మనం రోజూ తీసుకునే పాలు, పెరుగు, గుడ్లు, మాంసం వంటి వాటి ద్వారా కూడా అప్పుడప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ రావచ్చు. అది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే కడుపుతో ఉన్న సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
► ఎప్పుడూ బాగా కాచిన పాలనే తాగాలి. పాశ్చరైజ్డ్ మిల్క్ మంచిది.
► పనీర్ లాంటివి ఫ్రెష్‌గా వాడాలి. ఏది ఆహారంగా తీసుకోవాలన్నా ప్యాకింగ్‌పైన ఎక్స్‌పెయిర్ డేట్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
► కొవ్వు ఎక్కువగా ఉండే వాటిని తినకూడదు.
► సరిగ్గా ఉడకని ఆహారాన్ని, రెడీమేడ్ ఫుడ్‌ని తినకూడదు. ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో దాచిన పదార్థాలు తినకూడదు.
► భోజనం చేసే ముందు, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
► పళ్లు, కూరగాయలు, రెడీమేడ్ సలాడ్స్ వంటివి బాగా శుభ్రం చేసుకుని, తొక్కలు తొలగించి తినాలి. బయటి ఆహారం తీసుకోవాల్సి వస్తే వేడివేడిగా ఉన్నవి, స్టీమ్ చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్, లిక్విడ్స్‌ను దూరం పెట్టాలి.
∙నా వయస్సు 45 సంవత్సరాలు. నాకు రైట్ ఓవరీలో సిస్ట్ ఉందని చెప్పారు. ఇప్పుడు గత ఏడాది కన్నా సైజ్ పెరిగిందని ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. దీనికి ఏమైనా మందులు ఉంటాయా?
– శ్రావణీ, హైదరాబాద్
ఓవరీస్‌లో సిస్ట్ ఉండటమనేది సర్వ సాధారణం. అది 3 సీఎమ్ కన్నా పెద్దగా ఉంటే దానికి పరీక్షలు చెయ్యాలి. ఇవి కొన్ని నీటి బుడగలుగా ఉంటాయి. కొన్ని థిక్ ఫ్లూయిడ్ బ్లెడ్‌తో ఉంటాయి. సింపుల్ సిస్ట్ అంటే కేవలం నీటి బుడగలు. ఈ వయసులో అవి కామన్. కొన్ని నెలలకు వాటంతట అవే∙పగిలిపోతాయి. ఏ ప్రమాదం ఉండదు. కానీ బ్లెడ్‌తో ఉన్న సిస్ట్‌ని ఎండోమెట్రియోమా అంటాం. దీనికి కొన్ని మందులు లేదా ఆపరేషన్ అవసరం.
ఈ వయసులో సిస్ట్‌లు చాలా వరకు క్యాన్సర్‌గా మారవు. కానీ సిస్ట్ అని తెలిసినప్పుడు, 5 సీఎమ్ కన్నా తక్కువ ఉంటే ఆరు నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకుని, ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయేమో అని గమనించుకోవాలి. సడన్‌గా సైజ్ పెరిగినా, నొప్పి ఉన్నా ఆపరేషన్ తప్పదు. ఏ ఇబ్బంది లేనప్పుడు ఆపరేషన్ అవసరం లేదు. 5–7 సీఎమ్ సైజ్ ఉన్న సిస్ట్‌కి అడ్వాన్స్ స్కానింగ్/ సిటీ స్కానింగ్ చెయ్యాలి. లాపరోస్కోపిక్ ఆపరేషన్‌లో కేవలం సిస్ట్‌ని మాత్రమే తొలగిస్తాం. దాన్ని బయాప్సీ టెస్ట్‌కి పంపిస్తాం. ఓవరీ తీయవలసిన అవసరం చాలాసార్లు ఉండదు. చాలాసార్లు ౌఛిp’టసింపుల్ సిస్ట్‌కి పని చెయ్యవు. కొన్ని బ్లెడ్ టెస్ట్‌లు చేసి, సిస్ట్ ప్రమాదకరమైనదా అని చెక్ చెయ్యాలి.
డా. భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment