ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి! | Dr Bhavana Kasu Gynecologist Suggests To Postpone Pregnancy For A Long Time | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ.. దీర్ఘకాలం వాయిదాలో సమస్యా? అయితే ఇలా చేయండి!

Published Mon, May 20 2024 2:32 PM | Last Updated on Mon, May 20 2024 2:32 PM

Dr Bhavana Kasu Gynecologist Suggests To Postpone Pregnancy For A Long Time

నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం కావాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్‌ వాడుతున్నాం. కాని ఎటువంటి టెన్షన్‌ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని కాంట్రాసెప్టివ్‌ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – నిర్మల గ్రేస్, యలమంచిలి

ప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్‌ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్‌ డివైజ్‌ (ఐయూడీ) కాపర్‌ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్‌ సిస్టమ్‌ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్‌ ఇంప్లాంట్‌ వంటి పద్ధతులను అవలంబించవచ్చు.

అవి శరీరంలోకి ఇన్‌సర్ట్‌ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్‌ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు.

మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్‌ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్‌ను వాడొచ్చు. దీనికి హార్మోన్‌ కాయిల్‌ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్‌ను విడుదల చేస్తూ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది.

ఆ హార్మోన్‌ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్‌ టీ కాయిల్‌ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్‌తో డిస్కస్‌ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్‌ను సూచిస్తారు. అవుట్‌ పేషంట్‌గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్‌ అయిన వెంటనే ఈ డివైజ్‌ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ డివైజ్‌ వెయ్యాలి అనేది డాక్టర్‌ మీతో డిస్కస్‌ చేస్తారు.

డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్టెట్రీషియన్‌, హైదారాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement