నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సివియర్ గ్యాస్ట్రైటిస్‌తో డాక్టర్ దగ్గరకి వెళితే Hiatus Hernia అని డయాగ్నోస్ చేశారు. నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ. దీనివల్ల ప్రెగ్నెన్సీలో వాంతులు ఎక్కువవుతాయా? మందులు వాడకూడదు అంటారు కదా.. మరి ప్రెగ్నెన్సీలో గ్యాస్ ట్రీట్‌మెంట్ ఎలా? – పేరు, ఊరు రాయలేదు.
Hiatus Hernia అనేది చాలా కామన్. మామూలుగా పొట్టకి, ఆహారనాళానికి మధ్య డయాఫ్రమ్ అనే రెస్పిరేటరీ కండరం.. జంక్షన్‌ని టైట్‌గా క్లోజ్ చేసి పెడుతుంది. ఈ గ్యాప్ వదులైనప్పుడు పొట్టలోని యాసిడ్స్ ఆహారనాళంలో పైకి వచ్చి గ్యాస్, ఎసిడిటీ, వాంతులను ప్రేరేపిస్తాయి. అధిక బరువు, ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్స్‌లో ఈ గ్యాప్ ఎక్కువై గ్యాస్ ప్రాబ్లమ్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది వీక్ కూడా కావచ్చు.
ప్రెగ్నెన్సీలో యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఇప్పటి నుంచే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీని మేనేజ్ చేయవచ్చు. ప్రెగ్నెన్సీలో మందులు వాడే అవసరం తగ్గించుకోవాలి. ఎసిడిటీని పెంచే ఆహారం అంటే ఆరేంజ్ జ్యూస్, టొమాటో సాస్, సోడా వంటివి అవాయిడ్ చేయాలి. వేపుళ్లు, కొవ్వు పదార్థాలు, వెనిగర్, చాక్‌లెట్స్, కాఫీలు తగ్గించాలి. కొంచెం కొంచెం ఆహారాన్ని నెమ్మదిగా.. ఎక్కువసార్లు తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకుండా.. మూడు నాలుగు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తల కింద ఎత్తు పెట్టుకుని పడుకోవాలి. రాత్రి భోజనం పెందరాళే ముగించాలి. స్కాన్ చేసి.. హెర్నియా పెద్దగా ఉందని కనుక చెబితే.. కొంతమందికి డాక్టర్లు సర్జరీని సూచిస్తారు. లాపరోస్కోప్ ద్వారా చేస్తారు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో గుండెలో మంట, ఎసిడిటీ ఎక్కువుంటే సురక్షితమైన కొన్ని సిరప్‌లు, జెల్స్, మాత్రలను ప్రిస్క్రైబ్ చేస్తారు.
మొదటి మూడునెలల్లో వీటి అవసరం ఎక్కువుంటుంది. యాంటాసిడ్ జెల్స్ చాలావరకు రిలీఫ్‌నిస్తాయి. జీవనశైలి మార్పులతోనే చాలామందికి రిలీఫ్ వస్తుంది. నెలలు నిండే కొద్ది ముఖ్యంగా చివరి మూడు నెలల్లో బిడ్డ బరువుతో ఈ ఏజ్చ్టీuటఏ్ఛటnజ్చీకి ఇబ్బంది కలగొచ్చు. అలాంటప్పుడు భోజన వేళలను సర్దుబాటు చేసుకోవడంతో పాటు డైటీషియన్‌ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్‌స్టేట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment