నాకిప్పుడు 35 ఏళ్లు. ఏడాదిగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాం. అయినా రాలేదు. ప్రెగ్నెన్సీ కోసం ఏయే టెస్ట్‌లు చేయించుకోవాలో సజెస్ట్ చేయగలరా? – జయంతి శ్రీరాం, తుని
ప్రెగ్నెన్సీ కోసం ఏడాది ప్లాన్ చేసుకుంటే సాధారణంగా పదిమందిలో ఎనిమిది మందికి సక్సెస్ అవుతుంది. మీ వయసు 35 ఏళ్లు అంటున్నారు కాబట్టి కొన్ని టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది.. అంతా బాగానే ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం. టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అంటే వారానికి 2–3 సార్లు .. నెల మధ్యలో అంటే మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత 11వ రోజు నుంచి 25వ రోజు వరకు భార్యాభర్తలిద్దరూ కలవాలి. మీ బీఎమ్‌ఐ (మీ హైట్, వెయిట్ రేషియో) 30 దాటినా, అధిక బరువున్నా.
రిపీటెడ్ యాంటీబయాటిక్స్ , స్టెరాయిడ్స్ లాంటివి వాడినా, సర్వైకల్ లేదా వెజైనల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా గర్భధారణ ఆలస్యమవుతుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి మూడు నెలల ముందు నుంచే వాడటం మొదలుపెట్టాలి. పాప్‌స్మియర్, రుబెల్లా టెస్ట్‌లు చేయించుకోవాలి. మీకు, మీవారికి మెడికల్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్, బీపీ, సుగర్ లాంటివి ఉంటే వాటిని కంట్రోల్‌లో ఉంచాలి. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదిస్తే మీకు, మీవారికి ఏయే టెస్ట్‌లు అవసరమో చెప్తారు.
అన్నీ నార్మల్‌గానే ఉంటే పిల్లల కోసం ఆరు నెలల నుంచి ఏడాది ప్రయత్నించమని సూచిస్తారు. ఒకవేళ సెమెన్ అనాలిసిస్‌లో ఏదైనా సమస్య ఉన్నా, మీకు ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉన్నా.. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఒకటి నుంచి మూడు నెలలలోపు అన్నీ సర్దుకుంటాయి. ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ ద్వారా మీ గర్భసంచి, అండాశయాలు ఎలా ఉన్నాయి, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేవా? ఫాలోపియన్ ట్యూబ్స్ తెరుచుకునే ఉన్నాయా లేవా? అని చూస్తారు. కొంతమందికి అన్నీ నార్మల్‌గానే ఉన్నా రెండేళ్లలో గనుక ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. 36 ఏళ్ల వయసు దాటుతున్నప్పుడు ఐయూఐ లేదా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment