నాకు నెలసరి ఆగి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ మూడ్ స్వింగ్స్, ఒంట్లో వేడి ఆవిర్లతో సఫర్ అవుతున్నాను. వెజైనల్ ఇచ్చింగ్ కూడా సివియర్‌గా ఉంది. నేను వర్కింగ్ ఉమన్‌ని అవడం వల్ల వీటితో చాలా ఇబ్బంది పడుతున్నాను. పరిష్కారానికి డాక్టర్‌ని కలవడం తప్పనిసరి అంటారా? – రాజేశ్వరి, జగ్గంపేట
శరీరంలో వచ్చే మెనోపాజ్ మార్పులను తొందరగా గుర్తించి, ట్రీట్‌మెంట్ మొదలుపెడితే ఇంత ఇబ్బంది ఉండదు. దీని మీద ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. ప్రీ మెనోపాజ్ వచ్చినవారు కూడా ఈ దశను దాటి హ్యాపీగా ఉంటున్నారు. మెనోపాజ్ టైమ్‌లో శారీరకంగా, మానసికంగా, సెక్సువల్‌గా మార్పులు చాలా ఉంటాయి. మీరు వర్కింగ్ ఉమన్ కాబట్టి ఆ మార్పులను ఎదుర్కొంటూ నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడం చాలా కష్టం. మీరే కాదు చాలామంది ఇలాంటి సమస్యలను గుంభనంగా భరిస్తూ ఉంటారు. డాక్టర్‌ని సంప్రదించడానికి ఇబ్బందిపడుతుంటారు.
కానీ ఈ ప్రాబ్లమ్స్‌కి వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. మెనోపాజ్ దశ దాటిన తరువాత ఓవరీస్ పనిచేయవు. అందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల వెజైనా ప్రాంతం పొడిబారిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. తరచూ ఇన్‌ఫెక్షన్ల బారినపడతారు. 50 శాతం మందిలో ఈ మార్పు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. యూరిన్, యూటరస్, వెజైనల్ స్వాబ్స్ తీసి ఇన్‌ఫెక్షన్ ఉందేమో చూడాలి. ఇప్పుడు ఇలాంటి వాటినే ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ‘మెనోపాజ్ క్లినిక్స్’ వచ్చాయి. ఇబ్బందిపడకుండా డాక్టర్‌ని సంప్రదిస్తే సమస్య త్వరగా నయమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment