మా కజిన్‌కి 26 ఏళ్లు. బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. కీమో వల్ల భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చు అంటున్నారు. తనకి వేరే ఆప్షన్ ఏదైనా ఉందా?
– పద్మజ, వెస్ట్‌గోదావరి
క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఇప్పుడు చాలా అడ్వాన్స్‌డ్ మెథడ్స్ వచ్చాయి. అలాగే ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసే కొత్త పద్ధతులు కూడా చాలా వచ్చాయి. కీమో రేడియేషన్‌తో అండాశయాలు దెబ్బతింటే భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. కొన్ని ట్రీట్‌మెంట్స్ వల్ల అండాశయాలు చాలా వేగంగా దెబ్బతింటాయి. అందుకే క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కి ముందే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి ఆంకో ఫర్టిలిటీ క్లినిక్స్‌లో డిస్కస్ చేస్తారు. ఒవేరియన్ కార్టెక్స్ అంటే అండాశయ బాహ్యపొరలో అపరిపక్వ అండాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా డెవలప్ అయ్యి పరిపక్వ అండాలుగా, మంత్లీ సైకిల్‌లో విడుదలవుతాయి.
కాబట్టి ఒవేరియన్ లేయర్‌ని డామేజ్ చేసే ట్రీట్‌మెంట్ తీసుకునే ముందు మల్టీ డిసిప్లినరీ టీమ్ డిస్కషన్‌తో.. ఈ ఒవేరియన్ టిష్యూని ప్రిజర్వ్ చేస్తారు. మత్తు మందు ఇచ్చి కీ హోల్ (లాపరోస్కోపీ) సర్జరీ ద్వారా ఒవేరియన్ టిష్యూని తీసి క్రయోప్రిజర్వ్ చేస్తారు. ఇందులో ఒక ఓవరీని లేదా ఒవేరియన్ టిష్యూ బయాప్సీస్‌ని తీసి ఫ్రీజ్ అండ్ ప్రిజర్వ్ చేస్తారు. మైనస్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అల్ట్రా లో టెంపరేచర్‌లో ఉంచుతారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ పూర్తయిన తరువాత లేదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో ఈ టిష్యూను తిరిగి ఇంప్లాంట్ చేస్తారు. కొన్ని నెలల తరువాత ఈ టిష్యూ బాడీలో నార్మల్ ఫంక్షన్‌లోకి వచ్చి.. మంత్లీ సైకిల్స్, ఎగ్ డెవలప్‌మెంట్‌కి సిద్ధమవుతుంది. ఇది గత పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌లో ఉంది. దీనిద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిన కేసులూ ఉన్నాయి. మీ కజిన్‌ని ఒకసారి కౌన్సెలింగ్ సెషన్‌కి అటెండ్ అవమనండి. విషయం వివరంగా తెలుస్తుంది.
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. రెండవ నెల. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రైట్ సైడ్ ట్యూబ్‌లో వచ్చింది. దాంతో రైట్ ట్యూబ్ తీసేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్యూబ్‌లో ఉందని చెప్పారు. మెడికల్ ట్రీట్‌మెంట్‌తో ఏమైనా మేనేజ్ చేయవచ్చా?
– అపర్ణ, నిర్మల్
సహజంగా గర్భం దాల్చడానికి ఫాలోపియన్ ట్యూబ్స్ అవసరం. మీకు లెఫ్ట్ సైడ్ ట్యూబ్ మాత్రమే ఉంది కాబట్టి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (ట్యూబ్‌లో వచ్చే ప్రెగ్నెన్సీ)ని మెడికల్‌గా మేనేజ్ చేయడం అవసరం. కానీ దీనికి మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ మీ కండిషన్, సిట్యుయేషన్, ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు లివర్, కిడ్నీ టెస్ట్స్, Beta hcg టెస్ట్స్ చేసి, మెడికల్ మెథడ్ ట్రై చేయొచ్చా అని చెప్తారు. అందరికీ ఈ ట్రీట్‌మెంట్ పనిచేయకపోవచ్చు.
Methotrexate అనే డ్రగ్ ద్వారా ఈ ట్రీట్‌మెంట్ జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడాలంటే మీకు పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ ఉండకూడదు. ట్యూబ్ రప్చర్ కాకుండా ఉందనే విషయం స్కాన్‌లో కన్‌ఫర్మ్ కావాలి. Beta hcg తక్కువ లెవెల్స్‌లో ఉండాలి. మీరు ఫాలో అప్‌కి రావటానికి రెడీగా ఉండాలి. ఆసుపత్రి దగ్గరలో ఉండాలి. ఇది ఇంజెక్షన్ ద్వారా ఫస్ట్ డోస్ ఇచ్చి, మూడురోజులకొకసారి Beta hcg లెవెల్స్ తగ్గుతున్నాయా అని చెక్ చేస్తారు. తగ్గుతోంది అంటే మెడిసిన్ పనిచేస్తోంది అని అర్థం. రెండు మూడు వారాలు కొంత పెయిన్, స్పాటింగ్ ఉండొచ్చు.
నొప్పి తీవ్రంగా ఉంటే సర్జరీ చెయ్యాలి. పారాసిటమాల్ లాంటి మాత్రలు వాడొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎమోషనల్‌గా కూడా సవాలుగా మారొచ్చు. అందుకే కౌన్సెలింగ్ సహాయమూ తీసుకోవాలి. ఈ మెడిసిన్‌తో నాలుగు నుంచి ఆరు వారాల సమయంలో ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ దానంతట అది కరిగిపోతుంది. ఒకవేళ రెండో వారంలో ఏ మార్పులూ కనిపించకపోతే లాపరోస్కాపిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు. ఈ ట్రీట్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన తరువాత కనీసం మూడు వారాల వరకు ఆగి, మళ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
∙
Comments
Please login to add a commentAdd a comment