నాకు 40 ఏళ్లు. చాలా ఏళ్లుగా బ్రెస్ట్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. నెలసరి ముందు వచ్చే పెయిన్ నార్మలే అన్నారు. కానీ నాకు నెలంతా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌కి దారితీస్తోందేమోనని భయంగా ఉంది. – పేరు, ఊరి పేరు రాయలేదు.
పీరియడ్స్‌కి ముందు వచ్చే బ్రెస్ట్ పెయిన్ సాధారణంగా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అదేం సమస్య కాదు. ఇలాంటి నొప్పికి బ్రెస్ట్‌కి మంచి సపోర్ట్ ఇచ్చే ఇన్నర్‌వేర్ వేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ లేదా విటమిన్ ఇ మాత్రలు లాంటివి వాడితే తగ్గిపోతుంది. కానీ పెయిన్ నెలంతా ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ చేయించుకోవాలి.
బ్రెస్ట్ టిష్యూలో జరిగే కొన్ని మార్పులతో ఫైబ్రస్ టిష్యూ పెరిగి పెయిన్ రావచ్చు. బ్రెస్ట్ కింద ఉన్న చెస్ట్ వాల్ నుంచి మజిల్ లేదా రిబ్ ప్రాబ్లంతో బ్రెస్ట్‌లోకి పెయిన్ రేడియేట్ కావచ్చు. అలాంటి పెయిన్‌ని కాస్టోకాన్‌డ్రైటిస్ (ఛిౌట్టౌఛిజిౌnఛీటజ్టీజీట) అంటారు. ఊపిరి తీసుకునేటప్పుడు పెయిన్ పెరుగుతుంది. బ్రెస్ట్‌లో ఇన్‌ఫ్లమేషన్ వచ్చినా పెయిన్ ఉంటుంది. అయితే ఇది అరుదుగా ఉంటుంది. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ బ్రెస్ట్‌లోని టిష్యూ ఇన్‌ఫెక్షన్‌కి కారణం అవుతుంది.
దీనికి హయ్యర్ యాంటీబయాటిక్స్‌తో వెంటనే చికిత్సను అందించాలి. కొంతమందికి హెర్పిస్ లేదా షింగల్స్‌తో బ్రెస్ట్ మీద దద్దుర్లు, నొప్పి ఉంటాయి. దీన్ని యాంటీవైరల్ మెడిసిన్‌తో ట్రీట్ చేయాలి. చాలా అరుదుగా బ్రెస్ట్ లంప్స్, బ్రెస్ట్ ట్యూమర్ ఉంటే పెయిన్ రావచ్చు. బ్రెస్ట్ సిస్ట్స్ అంటే బ్రెస్ట్‌లో ఫ్లూయిడ్‌తో నిండిన సిస్ట్స్ ఏర్పడతాయి. వాటివల్ల కూడా నడిచినప్పుడు, ప్రెషర్‌కి పెయిన్ వస్తుంది. చాలామంది.. పెయిన్ రావడంతోనే బ్రెస్ట్ క్యాన్సరేమో అని భయపడతారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మొదటి సింప్టమ్.. బ్రెస్ట్‌లో అసాధారణ రీతిలో లంప్ ఉండటం. చాలాసార్లు పెయిన్ ఉండదు.
అయితే బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ ఉన్నా, లంప్స్ ఉన్నా, స్వెల్లింగ్, రెడ్‌నెస్ ఉన్నా, చంకల్లో లంప్స్ ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. రొటీన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్‌తో పెయిన్‌కి, లంప్‌కి కారణాలను డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా ఏది డిటెక్ట్ అయినా వెంటనే చికిత్స మొదలుపెడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతినెల పీరియడ్స్ అయిపోయిన వెంటనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మంచిది.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment