breast cancer awareness
-
యువరాజా ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్..? ఏంటీ తీరు..?
‘సున్నితమైన విషయాలలో ఎలా స్పందించాలో, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కలిగించాలో కొందరికి కనీస స్పృహ లేకుండా పోతోంది. ఒక దేశం బ్రెస్ట్ కేన్సర్‌పై ప్రజలలో అవగాహన ఎలా పెంచుతుంది?! రొమ్ము కేన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్లలో ‘మీ ఆరెంజ్‌లను చెక్ చేసుకోండి’ అంటూ తెలియజేసే ప్రకటన పోస్టర్‌ను ఢిల్లీ మెట్రోలో చూశాను. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు, వీటిని ఎవరు ఆమోదిస్తారు? ఈ పోస్టర్‌ను పబ్లిక్‌లోకి తీసుకు రాగలిగేటంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా?!’ అంటూ ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా దుయ్యబట్టారు. కేన్సర్ సర్వైవర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్వచ్ఛంద సంస్థ ‘యువికాన్’ ఈ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.దీని వెనుక ఉద్దేశం రొమ్ము కేన్సర్ పట్ల సామాన్యులలో అవగాహన కల్పించడమే. కానీ, ఇలాంటి ప్రచారాలు కొన్నిసార్లు అసౌకర్యంగానూ, పనికిమాలినవిగానూ కనిపిస్తాయి. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ యూజర్లు కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ‘ఇది క్రికెటర్ యువరాజ్‌సింగ్ క్యాంపెయిన్ అని తెలుసుకున్నాను. వీరి ఉద్దేశ్యం సరైనదే కావచ్చు. కానీ, ఇది నిజంగా అసహ్యకరమైనది. ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలనుకుంటున్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘భారతదేశంలో బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఒక శాతం మందికి కూడా సరైన అవగాహన లేదు. తలాతోకా లేని ఇలాంటి ప్రకటన ద్వారా ప్రజలకు విషయం ఎలా చేరుతుంది అనుకుంటున్నారు? స్త్రీలను కించపరిచేలా ఉన్న ఈ ప్రకటన సరైనది కాదు’ అని ఇంకొకరు, ‘సమస్యను ఎంత బాగా అర్థమయ్యేలా తెలియజేయాలో ఆ ఫౌండేషన్ వాళ్లకే అర్థం కాలేదు’ అని మరొకరు ‘ప్రకటనదారులు సున్నితమైన విషయాలను పట్టించుకోరు, ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తారు’ అని ఒకరు ‘ఇది గ్రామీణ జనాభా కోసం కాదు. కేవలం ఇంగ్లిషు మాట్లాడే మహిళల కోసమే’ అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. (చదవండి: చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..? ) -
న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై నాట్స్ వాక్ అండ్ టాక్ ఈవెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై వాక్ అండ్ టాక్ ఈవెంట్ నిర్వహించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మాసంగా భావించి దానిపై చైతన్యం తీసుకొస్తుంటారు. దీనిలో భాగంగానే నాట్స్ బ్రెస్ట్ కేన్సర్ పై తెలుగువారిని అప్రమత్తం చేసేందుకు ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ పాస్ట్ చైర్ ఉమెన్ అరుణ గంటి లు సారథ్యం వహించారు. న్యూజెర్సీలో స్థానిక తెలుగు వైద్యులు బ్యూలా విజయ కోడూరి, చరిష్మా భీమినేనిలు ఇందులో పాల్గొని విలువైన సూచనలు చేశారు. ప్రతి ఎనిమిది మంది మహిళలలో ఒకరికి బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ అవుతున్న ఈ రోజుల్లో, బ్రెస్ట్ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..? బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను, 40 ఏళ్ళ వయసు దాటిన స్త్రీలకు మామోగ్రామ్ పరీక్ష అవశ్యకతను ఈ ఈవెంట్లో చక్కగా వివరించారు. కేన్సర్‌పై మహిళల సందేహాలను నివృత్తి చేశారు. తెలుగువారి కోసం న్యూజెర్సీలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. అన్నింటి కంటే ఆరోగ్యం చాలా విలువైనదని.. దానిని కాపాడుకోవడంపై అందరూ దృష్టి పెట్టాలని మందాడి కోరారు. రోజు వారీ బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని విస్మరించడం వల్లే అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అన్నారు.. ఈ సమయంలో తెలుగువారిని ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేసేందుకు బ్రెస్ట్ కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించామని శ్రీహరి మందాడి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ న్యూజెర్సీ ఉమెన్ యెంపవర్మెంట్ టీమ్ శ్రీదేవి జాగర్లమూడి , ప్రణీత పగిడిమర్రి, ప్రసూన మద్దాలి, శ్రీదేవి పులిపాక, ఇందిరా శ్రీరామ్, స్వర్ణ గడియారం, గాయత్రి చిట్టేటి ఈవెంట్ విజయవంతంలో కీలకపాత్ర వహించారు. న్యూ జెర్సీ నాట్స్ నాయకులు రాజ్ అల్లాడ, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, కృష్ణసాగర్ రాపర్ల, హరీష్ కొమ్మాలపాటి, రామకృష్ణ బోను పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కొరకు వాక్ అండ్ టాక్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
కేన్సర్‌ను జయించా.. సినీనటి సోనాలి బింద్రే
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ పేషంట్లకు వైద్య చికిత్సతో పాటు మానసిక స్థైర్యం అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ సినీతార సోనాలి బింద్రే తెలిపారు. స్వయంగా తనకే కేన్సర్ ఉందని తెలిసిన సమయంలో ఇక తన జీవితం ముగిసిపోయిందని, ఆవేదనతో కృంగిపోయానని, కానీ తన భర్త అందించిన మానసిక స్థైర్యం, తక్షణ ఆరోగ్య సంరక్షణతో కేన్సర్ నుంచి బయటపడ్డానని ఆమె అన్నారు. అక్టోబర్.. బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మంత్ నేపథ్యంలో జీవీకే హెల్త్‌హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్యానెల్ చర్చ నిర్వహించగా, ఇందులో సోనాలితో పాటు ప్రముఖ సామాజికవేత్త పింకీరెడ్డి, జీవీకే హెల్త్‌హబ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. రొమ్ము కేన్సర్‌ను మొదటి దశలోనే స్క్రీనింగ్ టెస్టులతో గుర్తించి చికిత్స అందించగలిగితే మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని, దీనికి తానే ఒక నిదర్శనమని అన్నారు. కానీ ఈ ప్రయాణం ఎంతో వేధనతో కూడుకున్నది, ఆ సమయంలోనే జీవితమంటే ఏంటో తెలిసేలా చేసిందని చెప్పారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే స్క్రీనింగ్ టెస్టులతో డబ్బులు వృథా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.. చిన్న మొత్తాలకు చూసుకుంటే, ప్రమాదవశాత్తు కేన్సర్ భారిన పడితే అంతకు మించిన డబ్బులను కోల్పోవడమే కాకుండా విలువైన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టినవారవుతారని ఆమె సూచించింది. వంశపారపర్యంగా 5 నుంచి 10 శాతమే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ కేసుల సంఖ్య అధికంగా పెరుగుతుంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఖచి్చతంగా కేన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవాలని పింకీరెడ్డి సూచించారు. ఒక మహిళ దీర్ఘకాలిక రోగాలబారిన పడితే ఆ కుటుంబమంతా అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తుగా రొమ్ము కేన్సర్‌ను గుర్తించగలిగే కొన్ని చిట్కాలను, సంరక్షణ పద్దతులను గురించి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహ సాగర్ వివరించారు. రొమ్ము కేన్సర్ మహిళలకే కాదు కొంత మంది పురుషులకు కూడా వచ్చే అవకాశముందని ఆమె తెలిపారు. ప్రముఖ సినీతార నమ్రతా శిరోద్కర్, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్
-
మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) అనేది తీవ్రమైన కేన్సర్ దశ. ప్రారంభ దశలో గుర్తిస్తే..చికిత్స చేయడం సులభం. పైగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు కూడా. అదే స్టేజ్4 దశలో నయం కావడం కష్టం. జీవితాంత ఆ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంటే ఈ దశలో బతుకున్నంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఈ దశలో కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇక్కడ రోగికి కావాల్సింది మానసిక బలం. ఏ వ్యాధినైనా ఎదుర్కోవాలంటే మానసిక స్థైర్యం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్. అందులోనూ కేన్సర్‌కి స్టేజ్ 4 దశకు ఇది మరింత అవసరం అని అన్నారు. అలాంటి పేషెంట్లు మానసిక ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ ఆటను కట్టించి..మీ ఆయువుని పెంచుకోగలుగుతారని చెప్పారు. అవేంటంటే..45 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలైన నీతా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ప్రారంచికిత్సలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవి ఆమె ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్నితీవ్రంగా ప్రభావితం చేశాయి. తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన ఎక్కువై కుంగిపోతుండేది. అప్పుడే ఆమె కేన్సర సపోర్ట్ గ్రూప్‌లో చేరి మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లతో ఆ వ్యాధితో బతకటం నేర్చుకుంది. ధైర్యంగా జీవించడం అంటే ఏంటో తెలుసుకోగలిగిందని తన పేషంట్ల అనుభవాలను గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ పాటిల్ అలాంటి రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా ఆవ్యాధిని నిర్వహించగలరో చెప్పారు . అందుకోసం ఏం చేయాలో కూడా సవివరంగా తెలిపారు. అందుకోసం ఏం చేయాలంటే..ఎలాంటి చికిత్స అయితే మంచిదో వైద్యునితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న చికిత్సకు అనుగుణంగా ఎదరుయ్యే పరిణామక్రమాలను తట్టుకునేందుకు మానసికంగా సిద్ధం కావాలి. ఈ స్థితిలో మానసికంగా ఎదురవ్వుతున్న కల్లోలాన్ని తట్టుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ల తీసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి చేయాలి. అలాగే మీలాంటి స్థితిలో ఉన్నవాళ్లతో మీ బాధను పంచుకోవడం వంటివి చేయాలి. ఇది ఎంతో స్టైర్యాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదు, మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. మానసిక ధైర్యం కూడగట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసుకునేలా యోగ, మెడిటేషన్ వంటి వాటిలో నిమగ్నం కావాలి. మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఈ వ్యాధితో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించడంలో సహయపడుతుంది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి ఇవి మనసును ఉత్సాహపరుస్తాయి. అలాగే చికిత్సకు సంబంధించి ప్రతీది తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీ చికిత్సకు సంబంధించిన దాని గురించి వైద్యులతో మాట్లాడి, భరోసా తీసుకోండి తప్ప ఆందోళన చెందేలా ప్రశ్నలతో వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్.(చదవండి: ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!) -
చాలా ఏళ్లుగా.. ఈ క్యాన్సర్ తో బాధ పడుతున్నాను.. ఏదైనా??
నాకు 40 ఏళ్లు. చాలా ఏళ్లుగా బ్రెస్ట్ పెయిన్‌తో సఫర్ అవుతున్నాను. నెలసరి ముందు వచ్చే పెయిన్ నార్మలే అన్నారు. కానీ నాకు నెలంతా ఉంటోంది. ఇదేమైనా క్యాన్సర్‌కి దారితీస్తోందేమోనని భయంగా ఉంది. – పేరు, ఊరి పేరు రాయలేదు.పీరియడ్స్‌కి ముందు వచ్చే బ్రెస్ట్ పెయిన్ సాధారణంగా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అదేం సమస్య కాదు. ఇలాంటి నొప్పికి బ్రెస్ట్కి మంచి సపోర్ట్ ఇచ్చే ఇన్నర్‌వేర్ వేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ లేదా విటమిన్ ఇ మాత్రలు లాంటివి వాడితే తగ్గిపోతుంది. కానీ పెయిన్ నెలంతా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ చేయించుకోవాలి.బ్రెస్ట్ టిష్యూలో జరిగే కొన్ని మార్పులతో ఫైబ్రస్ టిష్యూ పెరిగి పెయిన్ రావచ్చు. బ్రెస్ట్ కింద ఉన్న చెస్ట్ వాల్ నుంచి మజిల్ లేదా రిబ్ ప్రాబ్లంతో బ్రెస్ట్లోకి పెయిన్ రేడియేట్ కావచ్చు. అలాంటి పెయిన్‌ని కాస్టోకాన్డ్రైటిస్ (ఛిౌట్టౌఛిజిౌnఛీటజ్టీజీట) అంటారు. ఊపిరి తీసుకునేటప్పుడు పెయిన్ పెరుగుతుంది. బ్రెస్ట్‌లో ఇన్ఫ్లమేషన్ వచ్చినా పెయిన్ ఉంటుంది. అయితే ఇది అరుదుగా ఉంటుంది. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ బ్రెస్ట్‌లోని టిష్యూ ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది.దీనికి హయ్యర్ యాంటీబయాటిక్స్‌తో వెంటనే చికిత్సను అందించాలి. కొంతమందికి హెర్పిస్ లేదా షింగల్స్తో బ్రెస్ట్ మీద దద్దుర్లు, నొప్పి ఉంటాయి. దీన్ని యాంటీవైరల్ మెడిసిన్‌తో ట్రీట్ చేయాలి. చాలా అరుదుగా బ్రెస్ట్ లంప్స్, బ్రెస్ట్ ట్యూమర్ ఉంటే పెయిన్ రావచ్చు. బ్రెస్ట్ సిస్ట్స్ అంటే బ్రెస్ట్‌లో ఫ్లూయిడ్‌తో నిండిన సిస్ట్స్ ఏర్పడతాయి. వాటివల్ల కూడా నడిచినప్పుడు, ప్రెషర్‌కి పెయిన్ వస్తుంది. చాలామంది.. పెయిన్ రావడంతోనే బ్రెస్ట్ క్యాన్సరేమో అని భయపడతారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మొదటి సింప్టమ్.. బ్రెస్ట్‌లో అసాధారణ రీతిలో లంప్ ఉండటం. చాలాసార్లు పెయిన్ ఉండదు.అయితే బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ ఉన్నా, లంప్స్ ఉన్నా, స్వెల్లింగ్, రెడ్నెస్ ఉన్నా, చంకల్లో లంప్స్ ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. రొటీన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్‌తో పెయిన్‌కి, లంప్కి కారణాలను డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా ఏది డిటెక్ట్ అయినా వెంటనే చికిత్స మొదలుపెడితే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతినెల పీరియడ్స్ అయిపోయిన వెంటనే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మంచిది.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Breast cancer బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా గుర్తించాలి!
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో 157 దేశాల్లో మహిళల్లో రొమ్ము కేన్సర్ అత్యంత సాధారణంగా కనిస్తున్న కేన్సర్. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 70వేల మంది ఈ కేన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు. 2.3 మిలియన్ల మంది మహిళలు బాధ పడుతున్నారు. యుక్తవయస్సు తర్వాత ఏ వయస్సులోనైనా మహిళల్లో ఇది కనిపించవచ్చు. పురుషుల్లో కూడా ఈ తరహా కనిపిస్తున్నప్పటికీ చాలా తక్కువ (దాదాపు 0.5–1 శాతం) కనిపిస్తోంది.అమెరికాలో 8 మంది మహిళల్లో ఒకరు జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. 2024లో, 310,720 మంది మహిళలు, 2,800 మంది పురుషులు ఇన్వాసివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు గురయ్యారని అంచనా. అసలు రొమ్ము కేన్సర్ లేదా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం ఎలా అంశాలపై డా. శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన వివరాలు మీకోసం యథాతథంగా..ఆడవాళ్లలో చర్మ కేన్సర్(విదేశీయుల్లో) తప్పితే అత్యంత ఎక్కువగా వచ్చే క్యాన్సరు రొమ్ము కేన్సరు. ఇప్పుడు వస్తున్న కొత్త పద్ధతుల ద్వారా దీన్ని ముందుగానే కనిపెట్టడం అలాగే, చికిత్స వల్ల గత ముఫ్ఫైఏళ్లలో మూడోవంతు మరణాల్ని తగ్గించగలిగాం.సాధరణంగా 50ఏళ్ల కంటే వయసు ఎక్కువున్న వాళ్లలో వస్తుంది, కానీ ఇరవై నుంచి నలభై మధ్యలో కూడా రావటం అరుదు కాదు. 12 ఏళ్లకంటే ముందుగా రజస్వల అయిన వాళ్లలో, 35ఏళ్ల వరకూ ఒక్కసారి కూడా నిండు గర్భిణీ కానివాళ్లలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే వీళ్లలో ఈస్ట్రోజన్ హార్మోన్ కి రొమ్ములు ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన. అయితే గర్భం ఎప్పడు వచ్చినప్పటికీ పిల్లలకి ఎక్కువరోజులు పాలివ్వటం వలన తల్లిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి.ఆసియా దేశాల్లో, వ్యయసాయం చేసే ఆడవాళ్లలో పట్టణాల్లో, అమెరికావంటి దేశాల్లో ఉండే మహిళల కంటే పదివంతులు తక్కువగా వస్తుంది. గ్రామాలనుంచి పట్టణాలకి చిన్నప్పుడే వలస వెళ్లిన అమ్మాయిలలో మళ్లీ పట్టణాల్లో వచ్చేంత స్థాయిలోనే రొమ్ము కేన్సర్ వస్తుంది.గర్భనిరోధక మాత్రలు వాడటం వలన రొమ్ముకేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగినప్పటికీ అవాంఛిత గర్భాన్ని నివారించటంతో పాటు, అండాశయ, గర్భాశయ కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.బహిష్టు ఆగిపోయిన తర్వాత వాడే హార్మోన్ రీప్లేసెమెంట్ థెరపీ వలన రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.స్థూలకాయం, మధుమేహం, మద్యం సేవించటం వల్ల కూడా ఈ న్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కుటుంబంలో ఇంకెవరికైనా ఉంటే ఆ జన్యువుల వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఎలా నివారించాలి?జన్యుపరమైన కారణాలున్నవాళ్లలో కచ్చితంగా వస్తుంది కాబట్టి ముందుగానే రొమ్ములు శస్త్రచికిత్స చేసి తొలగించటం. ఇది అందర్లో కాదు, జన్యులోపాలు ఉన్నవాళ్లలో మాత్రమే. మంచి ఆహారం, వ్యాయామం.అనవసరంగా హార్మోన్ థెరపీ వాడకుండా ఉండటం.స్క్రీనింగ్- అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతిఒక్కరూ వాళ్ల రొమ్ముల్ని అద్దం ముందు అనాచ్ఛాదితంగా నిలబడి పరీక్ష చేసుకోవాలి. ముందుగా రెండిటినీ గమనించాలి. వాటి రూపులో, పరిమాణంలో మునుపటికంటే తేడాలు ఏమైనా ఉంటే చూడాలి. చనుమొనలు ముందులానే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా? రక్తం, చీము, నీరు లేదా బాలింత కాకుండా పాలు ఏమైనా వస్తున్నాయా చూడాలి. చర్మంలో మార్పులు - పుళ్లు, పగుళ్లు, దళసరి అవ్వటం, నారింజ చర్మంలా గుంతలు కనపడటం ఏమైనా ఉందా చూడాలి. తర్వాత ఒకచెయ్యి నాలుగు వేళ్లతో రొమ్మును నాలుగు భాగాలుగా ఊహించి ప్రతీభాగంలో గుండ్రంగా తిప్పుతూ గడ్డలు ఏమైనా తగులుతున్నాయేమో అని చూడాలి, అలాగే పైకి వెళ్లి చంక భాగంలో కూడా చూడాలి. అలాగే రెండో రొమ్ము కూడా పరీక్షించాలి.ఇలా నెలకొకసారి పరీక్ష చేయించుకోవాలి.అలాగే మామ్మోగ్రాం అని ఎక్స్ రే పరీక్ష ఉంటుంది, యాభై ఏళ్లు దాటిన వాళ్లలో ప్రతి రెండేళ్లకి చెయ్యాలి. బిగుతైన రొమ్ములున్నవాళ్లకి కొన్నిసార్లు ఎమ్మారై అవసరం అవుతుంది.ఎలాంటి గడ్డలైనా వైద్యుడికి చూపించాలి. దాన్ని బయాప్సీ చేయించాలి. తద్వారా తర్వాత చికిత్స అవసరమా లేదా అన్నది తేలుస్తారు.ఇప్పటికే కుటుంబంలో రొమ్ము కేన్సర్ వచ్చినవాళ్లు (అమ్మమ్మ, అమ్మ, అక్కా చెల్లెళ్లు) ఉంటే జన్యుపరీక్ష చేయించుకుని, ఎప్పటికప్పుడు వైద్యుడితో రొమ్ములను పరీక్షించుకోవాలి.రొమ్ము కేన్సర్ నుంచి బయటపడటం అది యే దశలో గుర్తించారన్నదాన్ని బట్టి ఉంటుంది. -
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన.. పింక్ లైటింగ్స్‌తో చారిత్రక కట్టడాలు
మహిళలను ఎక్కువ ప్రభావితం చేసే వ్యాధుల్లో 'బ్రెస్ట్ క్యాన్సర్' (Breast Cancer) ఒకటి . కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపైన అవగాహన కల్పించడానికి హైదరాబాద్ 'ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్' ఈ నెల మాసోత్సవాలు నిర్వహిస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా కల్పించడంలో భాగంగా నగరంలోని చారిత్రక కట్టడాలు, నిర్మాణాలైన చార్మినార్, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, టీ హబ్, ప్రసాద్స్ ఐమాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్ వంటి వాటిని పింక్ లైట్లతో (గులాబీ వెలుగులు) ప్రత్యేకంగా అలంకరించారు. ‘పెయింట్ ది సిటీ పింక్’ ఫొటోల కోసం క్లిక్ చేయండి ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తించారు. ఇది 2000 సంవత్సరంలోనే ప్రారంభమైంది, అప్పట్లో అంతర్జాతీయ ప్రారంభానికి గుర్తుగా ఎస్టీ లాడర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు తమ భవనాలను ప్రత్యేకంగా అలంకరించాయి. 2007లో ప్రారంభమైన ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు మామోగ్రామ్ను పరీక్షించడం చేస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించలేము కాబట్టి, పోరాడడమే ఏకైక మార్గంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. దీని మీద అవగాహనా కల్పించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బకింగ్‌హామ్ ప్యాలెస్, టవర్ ఆఫ్ లండన్ & ఈఫిల్ టవర్ వంటివి కూడా పింక్ లైట్లతో కనువిందు చేయనున్నాయి. -
హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్.. గులాబీ వర్ణంలో కట్టడాల వెలుగులు (ఫోటోలు)
-
3డి మామోగ్రామ్: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు.. ఇంకా వీరికి..
Breast Cancer Screening- 3D Mammography: మనలో చాలామందికి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలంటేనే భయం. ఎక్కడ ఆ రిపోర్ట్లలో తప్పుడు రిజల్ట్స్ వచ్చి అనవసర భయాలకు గురిచేస్తాయేమోనని ఓ ఆందోళన. అంతేకాకుండా ఏ రెండు లాబ్స్లోనూ ఒకేలాంటి రిపోర్ట్స్ రావనే అభిప్రాయం మరింత ఎక్కువ అనుమానాలకు తావిస్తుంటుంది. టెస్ట్ చేయించుకునేటప్పుడు మంచి ప్రమాణాలతో కూడిన అధునాతన ల్యాబ్‌ను ఎంపిక చేసుకోవడమే కాకుండా, వారు నిర్ధారణ చేసే పద్ధతులను కూడా తెలుసుకుంటే ఈ తేడాలు అంతగా ఉండకపోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ను తొలిదశలోనే పసిగట్టే స్క్రీనింగ్ టెస్ట్‌లంటే మనలో చాలామందికి భయం, అనుమానం. నేటి స్త్రీని ఎక్కువగా బాధిస్తున్న రొమ్ముక్యాన్సర్‌ను ముందే పసిగట్టడానికి స్క్రీనింగ్ టెస్టుల్లో ఎన్నో ఆధునికతలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఖచ్చితత్వం మరింతగా పెరిగింది. కాబట్టి స్త్రీలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం అస్సలు లేదు. రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... సాంకేతిక విప్లవం... టోమోసింథసిస్ 3డి మామోగ్రఫీ రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే పసిగడితే కణితి వరకు మాత్రమే తొలగించగలిగే లంపెక్టమీతో పూర్తిగా నయం చేయడం సాధ్యమే. రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవడంతో పాటు డాక్టర్ సలహా మేరకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. వాటిల్లో ఇప్పటివరకు ఉన్న 2డి డిజిటల్ మామోగ్రామ్ స్థానంలో ఇప్పుడు 3డి మామోగ్రామ్ అందుబాటులోకి రావడం స్త్రీలకు ఒక వరం అనేది నిస్సందేహం. 2డి మామోగ్రామ్ వర్సెస్ 3డి మామోగ్రామ్... ►3డి మామోగ్రామ్‌లో రొమ్ముక్యాన్సర్ నిర్ధారణ... 2డి మామోగ్రామ్‌తో పోలిస్తే 40% మరింత ఖచ్చితంగా జరుగుతుంది ►క్యాన్సర్ కాని కణుతులను క్యాన్సర్‌గా చూపించడం, క్యాన్సర్ కణుతులను పసిగట్టలేకపోవడం 3డి మామోగ్రామ్‌లో జరగవు ►2డి మామోగ్రామ్‌తో పోలిస్తే ఫాల్స్ నెగెటివ్, పాజిటివ్‌లకు అవకాశం తక్కువ ►2డి మామోగ్రామ్ రొమ్ము పై నుంచి / పక్క నుంచి పరీక్షిస్తే... 3డి మామోగ్రామ్‌లో రొమ్మును పుస్తకంలోని పేజీల మాదిరిగా ఒక మిల్లీమీటరు స్లైస్‌గా విభజించి, పరిశీలించి ఇమేజ్‌లు పంపుతుంది ►2డి లో మామూలు కణితి వెనక ఉండే క్యాన్సర్ కణితిని పసిగట్టలేకపోవచ్చు. కానీ 3డి మామోగ్రామ్‌లో అలాంటి పొరపాట్లకు తావు లేదు ►రొమ్ము కణజాలం గట్టిగా (డెన్స్‌గా) ఉన్నవారికి, చిన్నవయసు స్త్రీలకు 3డి మామోగ్రామ్‌తో నిర్ధారణ సాధ్యం. ►2డి లో 40 ఏళ్లు పైబడిన స్త్రీలను మాత్రమే పరీక్షించగలం ►3డి మామోగ్రామ్ ఏ వయసు స్త్రీలైనా చేయించుకోవచ్చు. రేడియేషన్ కూడా చాలా తక్కువ ►3డి మామోగ్రామ్ యూఎస్ఎఫ్డిఏ ఆమోదం పొందింది ►క్యాన్సర్ కణితిని మామూలు కణితిగా చూపించడం... దాంతో రొమ్ముక్యాన్సర్ లేటు దశకు చేరుకోవడం, మామూలు కణితిని క్యాన్సర్‌గా చూపించడం... దాంతో బయాప్సీ చేయాల్సిరావడం, ఆందోళన–అనుమానం ఎక్కువకావడం లాంటి సందర్భాలు 3డి మామోగ్రామ్‌లో గణనీయంగా తగ్గుతాయి ►క్యాన్సర్ నిర్ధారణ ఖచ్చితంగా జరగడం వల్ల 2డి మామోగ్రామ్‌తో పోలిస్తే 3డి మామోగ్రామ్‌లో బయాప్సీ చేయాల్సిన సందర్భాలు గణనీయంగా తగ్గుతాయి ►స్క్రీనింగ్ టెస్ట్ సమయం 2డి మామోగ్రామ్ కంటే... 3డిలో కొంచెం ఎక్కువ ►రొమ్ముని నొక్కి (కంప్రెస్) పరీక్షించాల్సిన అవసరం లేదు కాబట్టి 2డి మామోగ్రామ్లోలా స్త్రీలకు అసౌకర్యం, నొప్పి వంటివి 3డి మామోగ్రామ్‌లో ఉండవు. ఎవరికి అవసరం ఈ 3డి మామోగ్రామ్ (టోమోసింథసిస్) రొమ్ములో కణితి చేతికి తగలడం, చనుమొన, రొమ్ముసైజు, చర్మంలో మార్పులు, రొమ్ముమీద నయం కాని పుండు, చనుమొన నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపించేసరికి రొమ్ముక్యాన్సర్ లేటు దశకు చేరుతుందని అర్థం. ఎలాంటి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా, రిస్క్ఫ్యాక్టర్స్ ఉన్నా, లేకపోయినా ప్రతి స్త్రీ 40 ఏళ్లు పైబడ్డాక పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అందునా... ►అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు ►దీర్ఘకాలం పాటు సంతానలేమికి మందులు వాడినవారు ►తల్లిపాలు ఇవ్వని స్త్రీలు ►పదేళ్లలోపు రజస్వల అయినవారు ►యాభైఐదేళ్ల తర్వాత కూడా నెలసర్లు వచ్చేవారు ►దీర్ఘకాలం పాటు హార్మోన్ల మీద ప్రభావం చూపే మందులు వాడినవారు ►గర్భాశయం, అండాశయాల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న స్త్రీలు ►స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు ►సాధారణ మహిళలతో పోలిస్తే... దగ్గర బంధువులు, రక్తసంబంధీకుల్లో బ్రెస్ట్‌క్యాన్సర్ ఉన్న స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ కాబట్టి డాక్టర్ సలహా మేరకు వీరు ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది. తమకు ఎలాంటి లక్షణాలూ, ఇబ్బందీ లేవు కాబట్టి ఎక్కడో టెస్ట్‌లో తప్పుడు నిర్ధారణ జరిగి తమలో అనవసర ఆందోళన కలుగుతుందేమో అని భయపడి స్క్రీనింగ్ టెస్ట్‌లకు దూరంగా ఉండే మహిళలకు ఖచ్చితమైన రిపోర్టును ఇచ్చే 3డి మామోగ్రామ్ ఓ మంచి ప్రత్యామ్నాయం. -డా. సీహెచ్. మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్. ఫోన్ నంబరు 98490 22121 చదవండి: High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
'క్యాన్సర్‌ను జయించాలంటే మనోధైర్యం చాలా అవసరం'
మారిన జీవన శైలి ఎన్నో ముప్పులను తెచ్చిపెడుతోంది. తీసుకునే ఆహారం, పర్యావరణ ప్రతికూలతలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది క్యాన్సర్. మహిళలను వేధించే గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక హెల్త్ సెమినార్లో క్యాన్సర్‌ను జయించిన మహిళ లు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. రోజువారీ పనుల్లో తీరికలేకుండా ఉండే మహిళలు తమ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధతోపాటు, ధైర్యంగా సమస్యను ఎలా అధిగమించాలో వివరించారు. మంచీ – చెడు నా వయసు 48 ఏళ్లు. ఇరవై ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. మాకు ఒక పాప. తను విదేశాల్లో ఉద్యోగం చేస్తుంది. రెండేళ్ల క్రితం తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా అమెరికా వెళ్లాను. అక్కడ నెలసరిలో సమస్యలు తలెత్తడంతో డాక్టర్లను కలిశాను. మెనోపాజ్ వల్ల అయ్యుంటుంది అన్నారు. కానీ, ఆ తర్వాత జరిగిన పరీక్షలు, వారు ఇచ్చిన సూచనలతో ఇండియాకు వచ్చేశాను. రాగానే, కిందటేడాది మొదట్లో ఇక్కడ గైనకాలజిస్ట్‌ను కలిశాను. అన్ని హెల్త్ చెకప్స్ పూర్తయ్యాక, బయాప్సీ చేశారు. పెట్స్కాన్లో గర్భాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. కోవిడ్ వల్ల నా కూతురు రాలేకపోయింది. కానీ, ఫోన్ కాల్స్‌తోనే నాలో పాజిటివ్ థింకింగ్ నింపింది. మా పేరెంట్స్ వయసు పైబడినవాళ్లు. వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోయాను. ఆపరేషన్ అయ్యింది. డాక్టర్ల సలహాలు పాటిస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ కోలుకోగలిగాను. సైడ్‌ఎఫెక్ట్స్‌కు కూడా చికిత్స చేయించుకోవాలి. క్యాన్సర్ జర్నీ చాలా కష్టమైనదే. కానీ, మనోధైర్యం చాలా అవసరం. చాలామంది క్యాన్సర్‌తో యుద్ధం చేస్తున్నారు. డాక్టర్లు, కుటుంబం, స్నేహితుల వల్ల నాకున్న భయాలు, నొప్పి ఇవన్నీ కోలుకోవడంలో భాగమయ్యా. ఈ ప్రయాణంలో మంచి రోజులు, చెడు రోజులు రెండూ చూశాను. కానీ, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాను. క్యాన్సర్ బారిన పడినవారు దాని నుంచి బయటపడానికి ప్రతి రోజూ ఒక చిన్న స్టెప్ తీసుకున్నా అది మనల్ని ఈ యుద్ధంలో గెలిచేలా చేస్తుంది. – అర్చనా అర్థాపుర్కర్, గృహిణి సిగ్గుపడకూడదు.. నేను ఇద్దరు అమ్మాయిలకు తల్లిని. 45 ఏళ్ళు. సైకాలజీలో భాగమైన హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. నాకు సామాజిక సేవ అంటే చాలా ఇష్టం. 22 ఏళ్లుగా సామాజిక సేవలో భాగంగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశాను. వాటిలో పిల్లల చదువు, వృత్తి నైపుణ్యాలు, పర్యావరణానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొన్నాను. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని ముందు తెలియదు. లక్షణాల్లో మొదట నా జుట్టు బాగా అంటే కుచ్చులు కుచ్చులుగా ఊడి వచ్చేది. ఇది ఆరోగ్యానికి మంచి లక్షణం కాదనిపించింది. మా నాన్న డాక్టర్. ఈ సమస్య గురించి తనతో చర్చించాను. అన్ని పరీక్షలు చేయించారు. బ్రెస్ట్ క్యాన్సర్ 2వ దశలో ఉందని తెలిసి చాలా షాక్ అయ్యాను. ఆపరేషన్ తర్వాత 25 సెషన్స్ రేడియేషన్స్ తీసుకున్నాను. మా పెద్దమ్మాయి విదేశాల్లో చదువుకుంటుంది. కోవిడ్ సమయం కావడంతో తను రాలేకపోయింది. చిన్నమ్మాయి 8వ తరగతి చదువుతోంది. మావారు తన బిజినెస్ రీత్యా దూరంగా ఉన్నారు. అది చాలా కష్టమైన సమయం అనిపించింది. హాస్పిటల్‌కి వెళ్లాలన్నా చాలా సవాల్‌గా అనిపించింది. మొదట మా తల్లితదండ్రులు నా దగ్గరకు వచ్చి చికిత్స పూర్తయ్యేంతవరకు ఆరు నెలల పాటు నాతోనే ఉన్నారు. ఆ సమయంలోనే మావారు కూడా రావడం, దగ్గరుండి మందులు ఇవ్వడం దగ్గరనుంచీ ప్రతీది కేర్ తీసుకున్నారు. కుటుంబంతో పాటు బంధువులు, స్నేహితులు నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. దీంతో త్వరలోనే క్యాన్సర్ నుంచి కోలుకోగలిగాను. నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళలు సరైన ఆహారం తీసుకోవడంలోనే కాదు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోవాలి. క్యాన్సర్స్ అనేవి ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. వీటికి సంబంధించిన హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మంచి పోషకాహారం, వ్యాయామం, సరైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ ప్రమాదం రాకుండానే జాగ్రత్తపడవచ్చు. రెగ్యులర్ పరీక్షల వల్ల మొదటి దశలోనే సమస్యను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. – శిప్రా, సామాజిక సేవా కార్యకర్త – నిర్మలారెడ్డి -
‘ఏకలవ్య’కు ప్రత్యేక సొసైటీ!
సాక్షి, హైదరాబాద్: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (ఈఎంఆర్ఎస్) సరికొత్త కళ సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొనసాగిన ఈ స్కూళ్లు ఇకపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక సొసైటీ ద్వారా కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రత్యేక సొసైటీ కింద నడపాలని నిర్ణయించిన కేంద్ర గిరిజన శాఖ తాజాగా సొసైటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఏకలవ్య స్కూళ్లు ఉన్నాయి. వీటికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తున్నా గురుకుల సొసైటీ వీటి నిర్వహణ చూసుకుంటోంది. ప్రత్యేక సొసైటీ పరిధిలో కొనసాగనున్నందున నిధుల విడుదల సమస్యల పరిష్కారం తదితర అంశాలన్నీ నేరుగా జరగనున్నాయి. శాశ్వత నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త నిర్మాణాలు కూడా చేయనుంది. ప్రస్తుతం చాలా వరకు శాశ్వత భవనాలున్నా మౌలిక వసతుల లేమి తీవ్రంగా ఉంది. దీన్ని పరిష్కరించి అత్యున్నత విద్యాలయాలుగా తీర్చి దిద్దాలని కేంద్రం భావిస్తోంది. -
గుండెల మీద చెయ్యి వేసుకోండి
ప్రకృతి చాలా గొప్పది. పరిణామక్రమంలో... వెన్నెముక ఉన్న జీవుల్లో చేపలు, ఉభయచర జాతులు, పాములు, పక్షులు, పాలిచ్చి పెంచే జంతువులు ఇలా క్రమంగా ఆవిర్భవిస్తూ పోయాయి. చేపలూ, ఉభయచరాల్లో పెద్దగా మాతృ ప్రేమను అనే భావనను ప్రకృతి కలిగించలేదు. కానీ పక్షుల దగ్గరికి వచ్చేసరికి ఆ సహజాతాన్ని సహజంగానే కలిగేలా చేసింది. తమ ప్రజాతి హాయిగా మనుగడ సాగించాలన్న తపన కలిగించడానికి సృష్టి భావనను పెంచింది. కానీ ప్రత్యేకంగా పిల్లలకే కావాల్సిన ఆహారాన్ని తామే తయారు చేసే వ్యవస్థను మాత్రం ప్రకృతి పరిణామం కలిగించలేదు. దాంతో పిట్టలు తమ పిల్లలకు ఎక్కడెక్కడి నుంచో కీటకాలూ, క్రిములూ, పురుగులను పట్టి తెచ్చేవి. మరి తాము పట్టి తెచ్చే లోపు పిల్లలకు ఏదైనా హాని జరిగితే...? బహుశా ఈ ప్రమాదాన్ని నివారించడానికేనేమో... పాలిచ్చి పెంచే జీవుల దగ్గరికి వచ్చే సరికి ఆ ఆహారం తమ ఎదలోనే ఊరే వ్యవస్థను రూపొందించింది. సహజమైన ఏ పరిణామమైనా తన సహజత్వాన్ని తప్పితే ఏదో ఓ సైడ్ఎఫెక్టో, రిస్కో ఉంటుంది. సహజమైన గుణానికి అనుగుణంగా ఉండకపోతే ఏదో ఓ అనర్థం చోటు చేసుకుంటుంది. అది ఆహారపరంగా కావచ్చు. బిడ్డలకు పాలివ్వని అలవాట్ల కారణంగా కావచ్చు. మరింకేదైనా కారణాల వల్లనో కావచ్చు. అలాంటి ఓ సైడ్ఎఫెక్టే... రొమ్ము క్యాన్సర్. దాని గురించి ఒకింత వివరంగా చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా వచ్చేది రొమ్ముక్యాన్సరే. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో మొత్తం మరణాల్లో దాదాపు 1.6 శాతం రొమ్ముక్యాన్సర్ వల్లనే సంభవిస్తున్నాయి. మనదేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో తెలుసుకోవచ్చు. రొమ్ముక్యాన్సర్ రిస్క్ పల్లెల్లో కంటే నగరాల్లో ఎక్కువ. పల్లెల్లో ప్రతి 60 మందికి ఒకరు రొమ్ము క్యాన్సర్‌కు బారిన పడుతుండగా, నగరాల్లో మాత్రం ప్రతి 22 మందిలో ఒకరు దీనికి గురవుతున్నారు. పల్లె జీవితంలోని సహజత్వంతో పోలిస్తే అంటే నగర జీవితంలోని కృత్రిమత్వం రొమ్ముక్యాన్సర్‌ను పెంచుతోందన్నమాట. కారణాలు వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పూ పెరుగుతుంది. ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్. ఆధునిక జీవశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు/ ఏడాది పాటైనా బిడ్డకు రొమ్ము పాలు పట్టించాలి. అది జరగకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు కారణం కావచ్చు. పాశ్చాత్య దేశ వాసులతో పోలిస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ త్వరగా గుర్తించినప్పుడు... మన దేశ మహిళల్లో ఉండే జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగా మొదటిబిడ్డ పుట్టడం... మరీ ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ∙పిల్లలు లేని మహిళలు ∙కొంతవరకు జన్యుపరమైన అంశాలు. లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి, స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కానివా, లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావడం. నిపుల్కు సంబంధించినవి : రొమ్ముపై దద్దుర్ల వంటివి లేదా వ్రణాలు రావడం ∙ రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం. రక్తం వంటి స్రావాలు రావడం. చంకల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దారి స్పర్శ తెలియడం. ∙భుజానికి సంబంధించి భుజం వాపు కనిపించడం. ∙రొమ్ములో సొట్టలు పడినట్లుగా ఉండటం ∙రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్లుగా అనిపించడం. (నెలసరి సమయంలో రొమ్ములు గట్టిబడి... ఆ తర్వాత మళ్లీ నార్మల్ అవుతాయి. అందుకోసం ప్రతినెలా వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. కానీ అలాగే గట్టిబడి ఉండటం కొనసాగితే మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.) రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించాలంటే... రొమ్ములో కణితి చేతికి తగలడం. రొమ్ములో, చంకలో గడ్డ లేదా వాపు కనిపించడం. చనుమొన సైజులో మార్పు, అది లోపలికి తిరిగినట్లు ఉండటం. రొమ్ముపై చర్మం మందం కావడం, సొట్టపడటం ∙రొమ్ము సైజులో, షేపులో, రంగులో మార్పు కనిపించడం. రొమ్ము మీద ఎంతకూ నయంకాని పుండు. చనుమొన నుంచి రక్తస్రావం. పైన చెప్పిన ఈ లక్షణాలు కనిపించేసరికి రొమ్ము క్యాన్సర్ తొలిదశను దాటిపోయే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ కణితి రకం, దశ (స్టేజ్), గ్రేడింగ్ వంటి విషయాల మీద ఆధారపడి సర్జరీ, దాంతో పాటు కీమో, రేడియేషన్, హార్మోన్ థెరపీలను నిర్ణయిస్తారు. రొమ్ములోని సన్నటి గొట్టాలు, లోబ్స్కు పరిమితమయ్యే క్యాన్సర్లు, ఇతర భాగాలకు త్వరగా వ్యాపించే క్యాన్సర్ల వంటి రకాలు ఉంటాయి. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ ఈ క్యాన్సర్లు అదుపు తప్పుతాయి. వయసు పైబడ్డ మహిళల్లో కంటే చిన్న వయసులో వచ్చే రొమ్ము క్యాన్సర్లను అదుపు చేయడం కష్టమవుతుంది. చిన్న వయసులో వచ్చే రొమ్ము క్యాన్సర్ కణితులకు అధికంగా వ్యాపించే గుణం ఉంటుంది. ఈ రోజుల్లో రొమ్ముల్లో ఎలాంటి మార్పులూ బయటకు కనిపించకుండా నిర్వహించే రీ–కన్స్ట్రక్టివ్ ఆంకోప్లాస్టిక్ సర్జరీలూ సమర్థంగా నిర్వహించడం సాధ్యమవుతోంది. కాబట్టి మహిళలు తమ అందం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే పెట్ సీటీ స్కాన్ ఫ్యామిలీ హిస్టరీలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగానే దీన్ని పసిగట్టడానికి బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జెనెటిక్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ జీన్ మ్యూటేషన్ పరీక్షలు పాజిటివ్ అని వస్తే... డాక్టర సలహా మేరకు మందుగానే రొమ్ములను తొలగించుకోవడంగానీ, లేదా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండల్సిగానీ ఉంటుంది. ఆ మహిళల వయసు, రిపోర్టుల మీద ఆధారపడి ఏవిధమైన నిర్ణయం తీసుకుంటే వారికి మంచిదనే విషయాన్ని వైద్యులు నిర్ణయించి, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ? దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు. వారు 40 ఏళ్ల కంటే చిన్నవయసులోనే ఈ క్యాన్సర్‌కు గురైనప్పుడు. రెండు రొమ్ములూ ఈ క్యాన్సర్‌కు గురైన కుటుంబాల్లో. ఆ కుటుంబానికి చెందిన పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ బయటపడ్డప్పుడు. ఆ కుటుంబ సభ్యులలో ఇతర క్యాన్సర్స్ ఎక్కువగా కనిపించడంగానీ లేదా అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చినప్పుడు. జీన్ మ్యుటేషన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నవారిలోనూ... అలాగే పెళ్లి లేటుగా చేసుకోవడం, పిల్లల్ని ఆలస్యంగా కనడం, పిల్లలకు పాలు పట్టకపోవడం, సంతానలేమి సమస్యల పరిష్కారం కోసం అధిక మోతాదుల్లో హార్మోన్ మందుల వాడటం, పదేళ్ల కంటే చిన్నవయసులోనే రజస్వల కావడం, 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడంతో పాటు ఈస్ట్రోజెన్ అధిక మోతాదుల్లో దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు... ఇంకా వారికి అధిక బరువు కూడా తోడైతే ఈ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పట్టణాల్లో ఈ క్యాన్సర్‌కు గురయ్యే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ముప్ఫై ఏళ్ల వయసులో రెండు లక్షల మందికి ఒకరిలో కనిపించే ఈ క్యాన్సర్... 80 ఏళ్ల వయసులో ప్రతి పది మందిలో ఒకరిలో కనిపించేంతగా ఎక్కువవుతోంది. చికిత్స : ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉంటే పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలిగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని (శాటిలైట్ లీజన్స్ ఉన్నాయని) తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. అయినా ఇప్పుడు ఉన్నాధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా మిగతా చోట్ల ఉండే కండరాలతో ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. రొమ్మును పూర్తిగా తొలగించాల్సి వచ్చినా సిలికాన్ ఇంప్లాంట్ ద్వారా కూడా రొమ్ము ఆకృతిని మునుపటిలాగే ఉండేలా చేయవచ్చు. ఇతర చికిత్సలు : ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్మ తొలగిస్తారు. అయితే రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన చొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం వ్యక్తిగత జీవనశైలి, కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మరికొన్ని మార్చలేనివీ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో దగ్గరి బాంధవ్యం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు... ఎక్కువ బరువు కలిగి ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. అయితే ‘గేల్స్ మోడల్’కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇందులో ఒవేరియన్ క్యాన్సర్ చరిత్రను చేర్చలేదు. దగ్గరి బంధువులుగాక... కాస్తంత దూరపు బంధువులు అంటే చిన్నమ్మ పెద్దమ్మలూ, వారి పిల్లలూ, వారి పిల్లల పిల్లలూ (మనవలను) చేర్చలేదు. అయినా చాలా అంశాల ఆధారంగా చాలావరకు దీన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ సదరు మహిళ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉన్నవారిలో ఉన్నారని తేలితే... దాన్ని బట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలను ఆహారంలో పుష్కలంగా తీసుకోవాలి. వ్యాయామం : మహిళలంతా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాలు చేయాలి. వారంలో ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకోవాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో దీన్ని నివారించవచ్చు. ఇలా రొమ్ముక్యాన్సర్ వచ్చాక చేయాల్సిన చికిత్సను నివారించడానికి అవకాశం ఉంది. ∙శస్త్రచికిత్సతో నివారణ: బీఆర్సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఈ–నోస్‌తో ముందే తెలుసుకోవచ్చు... రొమ్ముక్యాన్సర్ విషయంలో ఇది భవిష్యత్తులో కనిపించబోతున్న విప్లవాత్మకమైన ఆశారేఖ. అదేమిటంటే... కొన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు కేవలం మూత్రపరీక్ష వంటి చిన్న పరీక్షతోనూ తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ‘ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్ కు చెందిన పరిశోధకులు ఈ పరిశోధన తాలూకు ప్రాథమిక అంశాలను రూపొందించారు. దీని సహాయంతో రొమ్ముక్యాన్సర్‌ను చాలా నిశితంగానూ, చాలా త్వరగానూ పట్టేయడానికి వీలవుతుంది. దాంతో చికిత్స ఆలస్యం కావడం అనే పరిస్థితి తప్పిపోయి, ఎంతోమంది మహిళల ప్రాణాలు నిలబడతాయి. ఇదీ క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రాబోతున్న మరో ఆశారేఖ. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా ఉంది. మూత్రం ద్వారా పట్టేసేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశోధకులు నిర్మించారు. దీనికి పెద్దగా ఖర్చుకూడా అవసరం లేదు. మూత్రాన్ని పరిశీలించి, రొమ్ముక్యాన్సర్ తాలూకు వాసన పట్టేస్తుందనే ఉద్దేశంతోనో ఏమో ఈ ఎలక్ట్రానిక్ పరికరానికి ‘ఈ–నోస్’ (ఎలక్ట్రానిక్ ముక్కు) అని పిలుస్తున్నారు. దాంతో మహిళారోగులు భవిష్యత్తులో మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... కేవలం కొద్ది ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. రొమ్ముక్యాన్సర్ వస్తే దాని నుంచి దాదాపు 90 శాతం మంది రోగులు విముక్తమయ్యేలా ఇప్పటికే సైన్స్ అభివృద్ధి సాధించింది. ఈ–నోస్ వంటి మరెన్నో ఆవిష్కరణలతో దాదాపుగా అందరూ ఈ జబ్బునుంచి విముక్తమయే రోజూ ఒకటి వస్తుంది. ఈలోపు మనం చేయాల్సిందల్లా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంచుకొని, రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారు తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తూ, నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలు. -
రొమ్ము కేన్సర్‌పై పీవీ సింధు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ మహిళల పాలిట ఓ మహమ్మారిగా మారింది. దేశంలో ఏటా కొత్తగా 1.62 లక్షల కేసులు నమోదువుతుండగా, ప్రతి పదినిమిషాలకు ఒకరు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. రొమ్ము ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్ ఫౌండేషన్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ‘ఏబీసీ ఆఫ్ కేన్సర్ యాప్’లో ప్రముఖ క్రీడాకారణి పీవీ సింధూతో ప్రచారానికి శ్రీ కారం చుట్టింది. ఈ మేరకు సోమవారం హోటల్ పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ కేన్సర్’ పేరుతో రూపొందించిన లైఫ్ సైజ్ అగ్మంటేన్ రియాల్టీ వీడియో క్యాంపెయిన్‌ను పీవీ సింధు, యూబీసీఎఫ్ సలహాదారు జయేష్ రంజన్, యూబీసీఎఫ్ సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ ప్రారంభించారు. ఆశా వర్కర్లు, ఔత్సాహికులు తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రౌండ్‌గా ఉన్న యాస్ మార్క్‌ను ఉన్న ప్రదేశాన్ని స్కాన్ చేస్తే.. పీవీ సింధు ప్రచార వీడియో ప్లే అవుతుంది. పీవీ సింధూ అభిమానులు దీన్ని ఫొటో కూడా తీసుకోవచ్చు. గ్రామీణ మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు అవంత్రి టెక్నాలజీ సహాయంతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు డాక్టర్ రఘురామ్ చెప్పారు. రఘురామ్‌తో కలిసి రొమ్ము కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు. -
రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్‌కు సింధు అభినందన
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్‌ను అభినందించారు. సాంకేతికత సహాయంతో ప్రజల ఇళ్లకే వెళ్లి రొమ్ము క్యాన్సర్ ముందస్తు గుర్తింపుపై అవగాహన కల్పించడం గొప్ప కార్యక్రమం అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అగ్మెంటెడ్ రియాలిటీ సేవల్ని సోమవారం సింధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల పాలిట రొమ్ము క్యాన్సర్ పెనుశాపంగా మారుతోంది. ఈ క్యాన్సర్ మహమ్మారిపై సమగ్రమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి, ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పి రఘురామ్‌కు అభినందనలు. రొమ్ముక్యాన్సర్‌పై నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఇప్పటికే పాల్గొన్నాను. ఈ కార్యక్రమం ప్రజలకు చేరువై విజయవంతం అవడంలో నా సెలబ్రిటీ హోదా తోడ్పడితే అది నా అదృష్టంగా భావిస్తాను’అన్నారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.రఘురామ్ మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే ఏదో మాట్లాడకూడని విషయంగా పరిస్థితులు మారాయి. దీనిపై అందరూ అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొనే పరిస్థితులు రావడానికి గత 12 ఏళ్లుగా ఉషాలక్ష్మీ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారి లైఫ్‌సైజ్ అగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించి మా సంస్థ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని నా దత్తత గ్రామమైన ఇబ్రహీంపట్నం నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయనున్నాం. చరిత్రాత్మకమైన ఇలాంటి కార్యక్రమాల్లో తమకు తోడ్పాటునందించినందుకు పీవీ సింధుకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. 'ఏబీసీస్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్' పేరిట 2017లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే 12 భాషలో దీనిని తయారు చేశారని వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. -
టాప్‌లెస్‌గా పాట పాడిన టెన్నిస్ స్టార్
అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ టాప్ లెస్‌గా పాట పాడారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా ఆమె ‘ఐ టచ్ మై సెల్ఫ్’ అనే పాటను ఆలపించారు. మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాట పాడారు. ఈ వీడియోను సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందర్నీ రొమ్ము క్యాన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేశా’’నని ఆమె చెప్పారు. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్) ‘‘రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఇది చాలా ప్రాణాలను కాపాడుతుందని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహిళలకు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలనే విషయాన్ని ఈ వీడియో గుర్తు చేస్తుందని భావిస్తున్నాను.’’ అని సెరెనా తెలిపారు. (చదవండి: అంపైర్ అబద్ధాల కోరు.. దొంగ: సెరెనా) View this post on Instagram This Breast Cancer Awareness Month I’ve recorded a version of The Divinyls global hit “I Touch Myself” to remind women to self-check regularly. _ Yes, this put me out of my comfort zone, but I wanted to do it because it’s an issue that affects all women of all colors, all around the world. Early detection is key - it saves so many lives. I just hope this helps to remind women of that. _ The music video is part of the I Touch Myself Project which was created in honor of celebrated diva, Chrissy Amphlett, who passed away from breast cancer, and who gave us her hit song to remind women to put their health first. The project is proudly supported by @BerleiAus for Breast Cancer Network Australia. _ Visit the link in my bio to find out more. #ITouchMyselfProject #BerleiAus #BCNA #DoItForYourself A post shared by Serena Williams (@serenawilliams) on Sep 29, 2018 at 8:19am PDT -
మహిళలు అవగాహన పెంచుకోవాలి: బాలకృష్ణ
-
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పింక్ వాక్
హైదరాబాద్ : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం ఆసుపత్రి వరకు వాకింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటి మంచు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లేక ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.