మహిళలను ఎక్కువ ప్రభావితం చేసే వ్యాధుల్లో 'బ్రెస్ట్ క్యాన్సర్' (Breast Cancer) ఒకటి . కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపైన అవగాహన కల్పించడానికి హైదరాబాద్ 'ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్' ఈ నెల మాసోత్సవాలు నిర్వహిస్తోంది.
బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనా కల్పించడంలో భాగంగా నగరంలోని చారిత్రక కట్టడాలు, నిర్మాణాలైన చార్మినార్, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, టీ హబ్, ప్రసాద్స్ ఐమాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్ వంటి వాటిని పింక్ లైట్లతో (గులాబీ వెలుగులు) ప్రత్యేకంగా అలంకరించారు.
‘పెయింట్ ది సిటీ పింక్’ ఫొటోల కోసం క్లిక్ చేయండి
ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తించారు. ఇది 2000 సంవత్సరంలోనే ప్రారంభమైంది, అప్పట్లో అంతర్జాతీయ ప్రారంభానికి గుర్తుగా ఎస్టీ లాడర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు తమ భవనాలను ప్రత్యేకంగా అలంకరించాయి.
2007లో ప్రారంభమైన ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు మామోగ్రామ్‌ను పరీక్షించడం చేస్తోంది.
బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించలేము కాబట్టి, పోరాడడమే ఏకైక మార్గంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. దీని మీద అవగాహనా కల్పించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బకింగ్‌హామ్ ప్యాలెస్, టవర్ ఆఫ్ లండన్ & ఈఫిల్ టవర్ వంటివి కూడా పింక్ లైట్లతో కనువిందు చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment