మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) అనేది తీవ్రమైన కేన్సర్ దశ. ప్రారంభ దశలో గుర్తిస్తే..చికిత్స చేయడం సులభం. పైగా ఈ వ్యాధి నుంచి బయటపడతారు కూడా. అదే స్టేజ్4 దశలో నయం కావడం కష్టం. జీవితాంత ఆ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంటే ఈ దశలో బతుకున్నంత కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఈ దశలో కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తున్న వాళ్లు ఉన్నారు. ఇక్కడ రోగికి కావాల్సింది మానసిక బలం. ఏ వ్యాధినైనా ఎదుర్కోవాలంటే మానసిక స్థైర్యం అత్యంత ముఖ్యం అని చెబుతున్నారు యశోద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చెందిన మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్. అందులోనూ కేన్సర్‌కి స్టేజ్ 4 దశకు ఇది మరింత అవసరం అని అన్నారు. అలాంటి పేషెంట్లు మానసిక ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ ఆటను కట్టించి..మీ ఆయువుని పెంచుకోగలుగుతారని చెప్పారు. అవేంటంటే..
45 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలైన నీతా మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడింది. ప్రారంచికిత్సలో మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంది. ఇవి ఆమె ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్నితీవ్రంగా ప్రభావితం చేశాయి. తన భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన ఎక్కువై కుంగిపోతుండేది. అప్పుడే ఆమె కేన్సర సపోర్ట్ గ్రూప్‌లో చేరి మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లతో ఆ వ్యాధితో బతకటం నేర్చుకుంది. ధైర్యంగా జీవించడం అంటే ఏంటో తెలుసుకోగలిగిందని తన పేషంట్ల అనుభవాలను గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ పాటిల్
అలాంటి రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమర్థవంతంగా ఆవ్యాధిని నిర్వహించగలరో చెప్పారు . అందుకోసం ఏం చేయాలో కూడా సవివరంగా తెలిపారు.
అందుకోసం ఏం చేయాలంటే..
ఎలాంటి చికిత్స అయితే మంచిదో వైద్యునితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న చికిత్సకు అనుగుణంగా ఎదరుయ్యే పరిణామక్రమాలను తట్టుకునేందుకు మానసికంగా సిద్ధం కావాలి.
ఈ స్థితిలో మానసికంగా ఎదురవ్వుతున్న కల్లోలాన్ని తట్టుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్‌ల తీసుకోవడం లేదా వారితో మాట్లాడటం వంటివి చేయాలి.
అలాగే మీలాంటి స్థితిలో ఉన్నవాళ్లతో మీ బాధను పంచుకోవడం వంటివి చేయాలి. ఇది ఎంతో స్టైర్యాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు ఒక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదు, మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనే విషయం తెలుస్తుంది. మానసిక ధైర్యం కూడగట్టుకునే వెసులుబాటు ఉంటుంది.
ఒత్తిడిని దూరం చేసుకునేలా యోగ, మెడిటేషన్ వంటి వాటిలో నిమగ్నం కావాలి.
మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఈ వ్యాధితో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించడంలో సహయపడుతుంది.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయండి ఇవి మనసును ఉత్సాహపరుస్తాయి.
అలాగే చికిత్సకు సంబంధించి ప్రతీది తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో ఆందోళన పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీ చికిత్సకు సంబంధించిన దాని గురించి వైద్యులతో మాట్లాడి, భరోసా తీసుకోండి తప్ప ఆందోళన చెందేలా ప్రశ్నలతో వైద్యులను ఉక్కిరిబిక్కిరి చేసి చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడ్యాల్ పాటిల్.
(చదవండి: ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!)
Comments
Please login to add a commentAdd a comment