రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం ఆసుపత్రి వరకు వాకింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటి మంచు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లేక ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
Oct 26 2016 10:29 AM | Updated on Mar 20 2024 1:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement