Pink Ribbon Walk
-
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పింక్ వాక్
-
మహిళలు అవగాహన పెంచుకోవాలి: బాలకృష్ణ
-
బ్రెస్ట్ క్యాన్సర్‌పై పింక్ వాక్
హైదరాబాద్ : రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం ఆసుపత్రి వరకు వాకింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటి మంచు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. చాలామంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లేక ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. -
విజయవాడలో పింక్ రిబ్బన్ ర్యాలీ
-
పది నిమిషాలకు ఒకరు రొమ్ము కేన్సర్‌తో మృతి
* తెలుగు రాష్ట్రాల్లో నాలుగేళ్లలో రెండు లక్షల మందికి స్క్రీనింగ్ * 210 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: ‘దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా 1.50 లక్షల రొమ్ము కేన్సర్ కేసులు నమోదవుతుండగా.. బాధితుల్లో ప్రతి పది నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారు. అవగాహన లేమివల్ల 60శాతం మంది మహిళలు అడ్వాన్స్డ్ స్టేజీలో వైద్యులను ఆశ్రయిస్తున్నారు’ అని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పి.రఘురామ్ తెలిపారు. అంతర్జాతీయ రొమ్ము కేన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 2012 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో 3,900 గ్రామాల్లోని రెండు లక్షల మంది నిరుపేద మహిళలకు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహించగా, వీరిలో 210 మందికి రొమ్ము కేన్సర్ ఉన్నట్లు బయటపడిందన్నారు. వ్యాధిని ముందే గుర్తించడంవల్ల వీరిని కాపాడగలిగినట్లు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో మమోగ్రఫీ పరీక్ష ఉత్తమమన్నారు. రొమ్ము కేన్సర్ మాసాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2న కేబీఆర్ పార్కులో ఉదయం 6.30 గంటలకు పింక్‌రిబ్బన్ వాక్‌తో పాటు చార్మినార్, బుద్ధ విగ్రహం, రవీంద్రభారతి, ఎయిర్పోర్ట్, కిమ్స్ ఆస్పత్రులు, చారిత్రక కట్టడాలపై గులాబీ రంగు కాంతులను ప్రసరింపజేసి రొమ్ము కేన్సర్‌పై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 23న విజయవాడలో పింక్ రిబ్బన్ వాక్ నిర్వహిస్తామన్నారు. తాము చేపట్టిన ఈ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం దేశానికే ఓ బెంచ్‌మార్క్‌గా మారిందన్నా రు. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, రొమ్ము కేన్సర్‌ను జయించిన బాధితురాలు ఉషాలక్ష్మి, ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ పాల్గొన్నారు. -
సందడిగా పింక్ రిబ్బన్ వాక్
-
6న పింక్ రిబ్బన్ వాక్
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: మహిళల మృతికి కారణమవుతున్న వ్యాధుల్లో క్యాన్సర్‌ది రెండో స్థానమని, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్‌లెనర్ పేర్కొన్నారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మెక్‌లెనర్ ప్రసంగించారు. సినీ నటి అక్కినేని అమల మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే వ్యాధిని అరికట్టడం సులువవుతుందన్నారు. ప్రతి మహిళ ఏడాదికోసారి తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించుకోవాలన్నారు. వ్యాధిని తొలి దశలోనే అరికడితే రొమ్మును తొల గించాల్సిన అవసరం ఉండదని, కీమోథెరపీ అవసరమూ రాదని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డెరైక్టర్ డాక్టర్ పి.రఘురామ్ వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే అక్టోబర్ 6న కేబీఆర్ పార్కు వద్ద పింక్ రిబ్బన్ వాక్-2013 నిర్వహించనున్నట్లు తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ కింగ్‌షుక్‌నాగ్ తదితరులు పాల్గొన్నారు.