
సెరెనా విలియమ్స్
అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ టాప్ లెస్‌గా పాట పాడారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా ఆమె ‘ఐ టచ్ మై సెల్ఫ్’ అనే పాటను ఆలపించారు. మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాట పాడారు. ఈ వీడియోను సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందర్నీ రొమ్ము క్యాన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేశా’’నని ఆమె చెప్పారు. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్)
‘‘రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఇది చాలా ప్రాణాలను కాపాడుతుందని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మహిళలకు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలనే విషయాన్ని ఈ వీడియో గుర్తు చేస్తుందని భావిస్తున్నాను.’’ అని సెరెనా తెలిపారు. (చదవండి: అంపైర్ అబద్ధాల కోరు.. దొంగ: సెరెనా)
Comments
Please login to add a commentAdd a comment