![Bhagyashree Separated From Husband Himalaya - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/27/bhagya-sree.jpg.webp?itok=uu5ITpx7)
‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాతో కుర్రకారును విశేషంగా ఆకర్షించిన ఈ హీరోయిన్ ప్రేమికుడు హిమాలయా దస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది. ఇక భర్తే తన సర్వస్వమనుకుని సినిమాలకు సైతం దూరంగా ఉన్న ఆమె అతని నుంచి విడిపోయినట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. తన పెళ్లి, విడిపోవడానికి దారి తీసిన పరిణామాల గురించి ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (‘ప్రేమ పావురాలు’ ఫేం భాగ్యశ్రీ భర్త అరెస్ట్)
‘అవును, నాకు తొలిసారిగా ప్రేమ చిగురించింది హిమాలయా పైనే. ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడాను కూడా. కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు నా మనస్సు కుంగిపోయింది. అంటే నా జీవితంలో అతనికి ఇంక చోటు లేదా? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ఊహించుకుంటే చాలు.. ఇప్పటికీ భయంతో నిలువెల్లా వణికిపోతున్నాను. ఎందుకంటే మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.(విడాకులకు దరఖాస్తు చేసకున్న బాలీవుడ్ జంట)
కాగా ఆమె తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ వారినెదురించి హిమాలయానే వివాహమాడేందుకు నిశ్చయించుకుంది. దేవుని సాక్షిగా ఆలయంలో అతనితో మూడు ముళ్లు వేయించుకుంది. హీరో సల్మాన్‌ఖాన్, దర్శకుడు సూరజ్ బర్జాత్యా వంటి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. భాగ్యశ్రీకి ఇద్దరు సంతానం. కాగా ఏడాదిన్నర కాలం నుంచి వీళ్లిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ప్రభాస్ తదుపరి చిత్రంలో అతనికి తల్లిగా నటిస్తోంది. (ఆనంద భాష్పాలు ఆగలేదు: భాగ్యశ్రీ)
Comments
Please login to add a commentAdd a comment