ఆ హీరో సడన్‌గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ | Bhagyashree was Fires on Salman Khan Says Behave yourself, What is Wrong With You? | Sakshi
Sakshi News home page

Bhagyashree: పిచ్చిపట్టిందా? ఎందుకిలా చేస్తున్నావ్‌? అని ఆ స్టార్‌ హీరోను నిలదీశా..

Published Sun, Jan 21 2024 10:54 AM | Last Updated on Sun, Jan 21 2024 11:30 AM

Bhagyashree was Fires on Salman Khan Says Behave yourself, What is Wrong With You? - Sakshi

మైనే ప్యార్‌ కియా(తెలుగులో ప్రేమ పావురాలు) చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది భాగ్యశ్రీ. ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. ఆ మధ్య ‍ప్రభాస్‌ రాధేశ్యామ్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీ మూవీ ఛత్రపతిలోనూ కనిపించింది. తాజాగా ఈ నటి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'నాన్న చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. అందువల్ల స్కూల్‌లో చదువుకునే రోజుల్లో మా క్లాస్‌లో అబ్బాయిలతో మాట్లాడేదాన్నే కాదు. కానీ అనుకోకుండా హిమాలయ దస్సానీతో ప్రేమలో పడ్డాను. మా ప్రేమ విషయం నాన్నకు ఎక్కడ తెలిసిపోతుందో? తను ఎలా స్పందిస్తాడో? అని టెన్షన్‌ పడేదాన్ని.

ఊటీలో షూటింగ్‌.. ఆ రోజు
సినిమాల్లోకి వచ్చేంతవరకు కూడా అది సీక్రెట్‌గానే ఉంచాను. మైనే ప్యార్‌ కియా సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నా విషయం సల్మాన్‌కు తెలిసింది. ఆ తర్వాత మేము దిల్‌ దీవానా బిన్‌ సజ్నాకే సినిమా చేశాం. ఈ మూవీ షూటింగ్‌ కోసం ఊటీలో నెలరోజులపాటు ఉన్నాం. అప్పుడు సల్మాన్‌ వచ్చి నా చెవిలో పాట పాడాడు. పదేపదే ఏదో గుసగుసలాడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి పాటలు పాడుతూనే ఉన్నాడు. అంతకుముందెన్నడూ అలా ప్రవర్తించలేదు. ఇతడేంటి? నాతో ఫ్లర్ట్‌ చేస్తున్నాడు? తనకిది సరదాగా ఉందా? అని చిరాకెత్తుకొచ్చింది.

హీరోను తిట్టేశా..
తనను పక్కకు తీసుకెళ్లి ఏమైంది నీకు? ఎందుకిలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు.. బుద్ధిగా నడుచుకో అని చెప్పాను. అప్పుడతడు నీ ప్రేమ విషయం తెలిసిపోయిందిలే, అందుకే ఆటపట్టిస్తున్నా అన్నాడు. నీ ప్రియుడిని సెట్స్‌కు పిలువు.. ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలా హీరో అండతో దస్సానీని కలుసుకుని మాట్లాడేదాన్ని. అందరూ అతడిని సల్మాన్‌ ఫ్రెండ్‌ అనుకున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా భాగ్యశ్రీ.. 1990లో హిమాలయ దస్సానీని పెళ్లాడింది. వీరికి అవంతిక, అభిమన్యు సంతానం.

చదవండి: ఆ బుజ్జిని గుర్తుపట్టారా? ఈమె మిడిల్‌ క్లాస్‌ మదర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement