ఏమాత్రం కదల్చడానికి వీలులేనంత తీవ్రంగా భుజం నొప్పి రావడం ఇంటి పనులు, కంప్యూటర్ల ముందు çకూర్చుని పనిచేసేవారికి తెలిసిందే. కారణాలు ఎన్ని ఉన్నా భుజాల నొప్పులు ఇటీవల చాలా సాధారణమయ్యాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికీ ఉండచ్చు. నొప్పిని భరిస్తూ అలాగే ఉండిపోతే భుజాల కదలికలు తగ్గుతాయి. సమయానికి చికిత్స చేయక΄ోతే సమస్య దీర్ఘకాలికంగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ పది నిమిషాలు చేయదగిన వ్యాయామాలను నటి భాగ్యశ్రీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వ్యాయామ బ్యాండ్
రెండు చేతులతో వ్యాయామ బ్యాండ్ రెండు చివర్లను పట్టుకోవాలి.
బ్యాండ్ సాయంతో వ్యాయామం చేయడానికి చేతులను ముందుకు చాచాలి.
తిరిగి యధాస్థానానికి తీసుకురావాలి.
ఇలాంటప్పుడు మోచేతులు తుంటిపక్కన నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
ఈ వ్యాయామాన్ని 8 సార్లు చేయాలి.
ఫ్రెంచ్ ప్రెస్
చేతులను ఎంత వీలైతే అంత వెనకకు కదల్చాలి
తర్వాత ఒక చేతిని ముందు వైపుకు తీసుకోవాలి.
తిరిగి ప్రారంభ స్థానానికి 3 దశలుగా రావాలి.
ఈ వ్యాయామం 10–15 సార్లు చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు విరామం తీసుకోవాలి.
ఓవర్ హెడ్
నిటారుగా నిలబడి,. చేతులను తుంటి భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ∙వీలైనంత వరకు చేతులను తలమీదుగా పైకి ఎత్తాలి.
వెన్నెముక వంపు రాకుండా నిటారుగా ఉంచాలి.
తిరిగి మెల్లగా యధాస్థానంలోకి రావాలి. ఈ విధంగా 10–12 సార్లు చేయాలి.
ఈ వ్యాయామాల గురించి డాక్టర్ కపూర్ మాట్లాడుతూ ‘ఫ్రోజెన్ షోల్డర్ కోసం చేసే వ్యాయామాల కదిలికల పరిధిని పెంచడానికి వీటిని రూపొందించారు. ఫ్రెంచ్ ప్రెస్, బ్యాండ్ ఫుల్ రెండూ వేరు వేరు పద్ధతుల్లో ఉండటం వల్ల భుజాలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది’ అని తెలియజేశారు. దీంతోపాటు మరో రెండు వ్యాయామాల గురించి వివరించారు.
లోలకం మాదిరి..
గడియారంలోని లోలకం కదలికలు ఉన్నట్టు ఈ వ్యాయామం ఉంటుంది.
ఫ్రోజెన్ షోల్డర్ చేయి కిందికి వేలాడదీయడానికి వీలుగా కొద్దిగా వంగాలి.
ఒక అడుగు వ్యాసంతో చేతిని చిన్న వృత్తంలా తిప్పాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు.
టవల్‌తో సాగదీయడం..
రెండు చేతులతో వీపు వెనక నుంచి ఒక టవల్‌ను సమాంతరంగా పట్టుకోవాలి.
నొప్పి ఉన్న భుజం వైపుకు టవల్‌ను లాగడానికి మరో చేతిని ఉపయోగించాలి.
లోపలి వైపుకు...
మూసి ఉన్న తలుపు పక్కన నిలబడి, డోర్ నాబ్ చుట్టూ వ్యాయామ బ్యాండ్ ఒక చివర కట్టాలి.
మోచేతిని 90 డిగ్రీల కోణంలో ఉంచి, నొప్పి ఉన్న చేతితో వ్యాయామ బ్యాండ్ మరొక చివరన పట్టుకోవాలి. బ్యాండ్‌ని మీ శరీరం వైపు రెండు లేదా మూడు అంగుళాలు లాగి కొన్ని సెకన్లపాటు పట్టుకోవాలి.
ఇలా 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి.
(చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!)
Comments
Please login to add a commentAdd a comment