exercises
-
నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!
ఏమాత్రం కదల్చడానికి వీలులేనంత తీవ్రంగా భుజం నొప్పి రావడం ఇంటి పనులు, కంప్యూటర్ల ముందు çకూర్చుని పనిచేసేవారికి తెలిసిందే. కారణాలు ఎన్ని ఉన్నా భుజాల నొప్పులు ఇటీవల చాలా సాధారణమయ్యాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికీ ఉండచ్చు. నొప్పిని భరిస్తూ అలాగే ఉండిపోతే భుజాల కదలికలు తగ్గుతాయి. సమయానికి చికిత్స చేయక΄ోతే సమస్య దీర్ఘకాలికంగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ పది నిమిషాలు చేయదగిన వ్యాయామాలను నటి భాగ్యశ్రీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.వ్యాయామ బ్యాండ్రెండు చేతులతో వ్యాయామ బ్యాండ్ రెండు చివర్లను పట్టుకోవాలి.బ్యాండ్ సాయంతో వ్యాయామం చేయడానికి చేతులను ముందుకు చాచాలి. తిరిగి యధాస్థానానికి తీసుకురావాలి. ఇలాంటప్పుడు మోచేతులు తుంటిపక్కన నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాయామాన్ని 8 సార్లు చేయాలి.ఫ్రెంచ్ ప్రెస్చేతులను ఎంత వీలైతే అంత వెనకకు కదల్చాలితర్వాత ఒక చేతిని ముందు వైపుకు తీసుకోవాలి. తిరిగి ప్రారంభ స్థానానికి 3 దశలుగా రావాలి.ఈ వ్యాయామం 10–15 సార్లు చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు విరామం తీసుకోవాలి.ఓవర్ హెడ్నిటారుగా నిలబడి,. చేతులను తుంటి భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ∙వీలైనంత వరకు చేతులను తలమీదుగా పైకి ఎత్తాలి. వెన్నెముక వంపు రాకుండా నిటారుగా ఉంచాలి. తిరిగి మెల్లగా యధాస్థానంలోకి రావాలి. ఈ విధంగా 10–12 సార్లు చేయాలి. ఈ వ్యాయామాల గురించి డాక్టర్ కపూర్ మాట్లాడుతూ ‘ఫ్రోజెన్ షోల్డర్ కోసం చేసే వ్యాయామాల కదిలికల పరిధిని పెంచడానికి వీటిని రూపొందించారు. ఫ్రెంచ్ ప్రెస్, బ్యాండ్ ఫుల్ రెండూ వేరు వేరు పద్ధతుల్లో ఉండటం వల్ల భుజాలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది’ అని తెలియజేశారు. దీంతోపాటు మరో రెండు వ్యాయామాల గురించి వివరించారు.లోలకం మాదిరి.. గడియారంలోని లోలకం కదలికలు ఉన్నట్టు ఈ వ్యాయామం ఉంటుంది. ఫ్రోజెన్ షోల్డర్ చేయి కిందికి వేలాడదీయడానికి వీలుగా కొద్దిగా వంగాలి. ఒక అడుగు వ్యాసంతో చేతిని చిన్న వృత్తంలా తిప్పాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు.టవల్‌తో సాగదీయడం..రెండు చేతులతో వీపు వెనక నుంచి ఒక టవల్‌ను సమాంతరంగా పట్టుకోవాలి. నొప్పి ఉన్న భుజం వైపుకు టవల్‌ను లాగడానికి మరో చేతిని ఉపయోగించాలి.లోపలి వైపుకు... మూసి ఉన్న తలుపు పక్కన నిలబడి, డోర్ నాబ్ చుట్టూ వ్యాయామ బ్యాండ్ ఒక చివర కట్టాలి. మోచేతిని 90 డిగ్రీల కోణంలో ఉంచి, నొప్పి ఉన్న చేతితో వ్యాయామ బ్యాండ్ మరొక చివరన పట్టుకోవాలి. బ్యాండ్‌ని మీ శరీరం వైపు రెండు లేదా మూడు అంగుళాలు లాగి కొన్ని సెకన్లపాటు పట్టుకోవాలి.ఇలా 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి. (చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!) -
గుండెపోటు సడెన్‌గా వస్తుందా? కసరత్తు, కోవిడ్‌తో లింకేంటి?
వయసుతో సంబంధం లేకుండా యువత హాట్ ఎటాక్‌తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఓ పెళ్లి బారాత్ లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో రావుల విజయ్ కుమార్( 33) అనే యువకుడు మృతి చెందడం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు యవకులు, నిరంతరం వ్యాయామం చేస్తున్నవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. న్యూఇయర్ పార్టీల్లోనూ, పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ, చివరకు , మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుస్తూ, కూర్చున్నవారు కూచున్నట్టుగానే కుప్పకూలిన సంఘటలను అనేకం. ప్రధానంగా వైసీపీ నేత, ఫిట్నెస్ ఫ్రీక్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం విషాదాన్ని నింపింది. ఇంకా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇంకా పలువురు పోలీసు ఉన్నతాధికారులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.అతేకాదు ఈ కోవలో ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చాలామందే ఉన్నారు. జిమ్‌కు, గుండెపోటుకు సంబంధం ఏమిటి? నియంత్రణ లేకుండా ఎక్కువగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయాయం చేయడం అనేది ఎవరికైనా ముప్పే అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి ఒక అరగంట లేదంటే నలభై నిమిషాల వ్యాయామం సరిపోతుందట. బాడీ ఫిట్‌గా ఉండాలనో, కండలు పెంచాలనో గంటల తరబడి జిమ్‌కే పరిమితం కాకూడదు. అంతేకాదు తొందరపాటుతో ఒక్కసారిగా జిమ్‌కు వెళ్లి పెద్దపెద్ద బరువులు ఎత్తాలని ప్రయత్నించ కూడదు. అస్సలు నిపుణుల సలహా, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోనిదే జిమ్‌లోకి ఎంటర్ కాకూడదు. వ్యాయామం చేస్తున్నపుడు విపరీతంగా చెమటలు పడితే తక్షణమే ఆపివేయాలి. మరోవైపు శరీరంలో సోడియం స్థాయిలు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. హానికరమైన కృత్రిమ రసాయనాలు, స్టెరాయిడ్స్ వాడకంపై పూర్తి అవగాహన ముఖ్యం. ఎలాంటి దురలవాట్లు లేకుండా సంతులిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలి మార్పులు ధూమపానం, మద్యం సేవించడం, జంక్ఫుడ్స్, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో సంబంధం ఏంటి? భారతదేశంలో కోవిడ్ మహమ్మారి అనంతరం గుండెపోటు కేసులు, మరణాలు బాగా పెరిగియాని ఇటీవలి అధ్యయనాలు, నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా గుండెపోటు కబళిస్తోంది. కోవిడ్-19 దీర్ఘకాలిక లక్షణాల ప్రభావంతోనే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ఫలితంగా గుండె నాళాల్లో తీవ్ర మంట, గుండెపోటుకు దారితీయవచ్చు. అధిక సోడియం ఉన్న ఆహారం, కనీస వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అతిగా మద్యపానం, కదలికలు లేని జీవనశైలి, అధిక హిమోగ్లోబిన్ స్థాయిలు వంటి కారకాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
జిమ్‌కు వెళ్లొస్తూ కుప్పకూలాడు
ఆదోని అర్బన్: ఆదోని పట్టణ శివారులోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో గల జిమ్‌లో వ్యాయామం చేసి బయటకు వచ్చిన ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని తిరుమలనగర్‌కు చెందిన సాయిప్రభు (25) ప్రతిరోజూ ఉదయాన్నే 6 గంటలకు జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటాడు. శనివారం ఉదయాన్నే వాకింగ్‌కు పూర్తి చేసుకున్న సాయిప్రభు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి స్పృహ తప్పి పడిపోగా.. స్నేహితులు గమనించి వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మే 3న వివాహం తిరుమలనగర్‌కు చెందిన మల్లికార్జున ఆచారి, పుష్పవతి దంపతులకు ముగ్గురు సంతానం. ఆచారి కార్పెంటర్ కాగా.. పెద్ద కుమారుడికి, రెండో కుమార్తెకు వివాహాలు చేశాడు. మూడో కుమారుడు సాయిప్రభు బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు వర్క్‌ఫ్రమ్ హోమ్ కింద ఇంటినుంచే పని చేస్తున్నాడు. అతనికి బెంగళూరుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మే 3వ తేదీన ముహూర్తం నిర్ణయించగా.. కుటుంబ సభ్యులు ఆ ఏర్పాట్లలో ఉండగా.. ఈ దారుణం చోటుచేసుకుంది. సాయిప్రభు మరణించిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
రష్యా సుమారు 50 వేల బలగాలతో సైనిక విన్యాసాలు... టెన్షన్లో యూఎస్
US Says "Concerned: రష్యా చైనా వంటి ఇతర దేశాలతో సైనిక కసరత్తులు నిర్వహించనున్నట్లు ప్రకటించిందని అమెరికా పేర్కొంది. రష్యా నిర్వహించనున్న వోస్టాక్ 20200 డ్రిల్స్‌లో చైనా, భారత్‌తో సహా అనేక ఇతరదేశాల నుంచి సుమారు 50 వేల సైనిక బలగాలు పాల్గొంటాయని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. అంతేకాదు ఈ విన్యాసాలను సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు తూర్పు తీర ప్రాంతాల తోపాటు జపాన్ సముద్ర జలాలల్లోని వివిధ ప్రదేశాల్లో ఈ విన్యాసాలు నిర్వహించనుందని స్పష్టం చేసింది. అలాగే ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశాలు మొదటగా తూర్పు మిటలరీ డిస్ట్రిక్ట్స్‌లోని ఏడు శిక్షణ ప్రాంతాలో కసరత్తులు నిర్వహించిన తదనంతరం ఓఖోత్క్స్, జపాన్లలోని సముద్ర జలాల్లోనూ, తీరప్రాంతాల్లో రక్షణాత్మక్ష ప్రమాదకర విన్యాసాలకు అనుమతిస్తుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొందని వెల్లడించింది. ఈ కసరత్తుల్లో సుమారు 50 వేల మంది సైనికుల తోపాటు దాదాపు 140 విమానాలు, 60 యుద్ధ నౌకలు, గన్బోట్లు తోసహా సహాయక నౌకలు ఉంటాయని మాస్కో పేర్కొంది. ఈ సైనిక విన్యాసాల్లో చైనా, భారత్‌లో సహా లావోస్, మంగోలియా, నికరాగ్వా, సిరియా తోపాలు అనేక మాజీ సోవియట్ దేశాలు పాల్గొంటాయని రష్యా చెబుతోంది. ఈ విషయమై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగిన దేశంతో ఏయే దేశాలు జతగట్టి ఈ విన్యాసాల్లో పాల్గొంటాయోనని భయంగా ఉందని చెప్పారు. ఐతే ఈ విషయాన్ని ఆయా దేశాల స్వంత నిర్ణయానికి వదిలేస్తున్నామని తేల్చి చెప్పారు. ఐతే విన్యాసాలో భారత్ పాల్గొంటుందా లేదా అనే దానిపై న్యూఢిల్లీ నుంచి ఎటువంటి సమాచారం లేదని అన్నారు. కానీ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తూర్ప తీర ప్రాంతాల్లో సైనిక భద్రతను నిర్వహించడానికి, ఆయ ప్రాంతాల్లోని దురాక్రమణ చర్యను తిప్పికొట్టేందుకు ఈ సైనిక డ్రిల్స్ నిర్వహిస్తున్నట్ల చెబుతోంది. ఐతే గతేడాది రష్యాలో జరిగిన జెడ్‌ఏపీఏడీ 2021 సైనిక కసరత్తుల్లో చైనా పాకిస్తాన్ తోపాటు భారత్ కూడా పాల్గొంది. (చదవండి: ప్రపంచ పెద్దన్న అమెరికాకు షాక్ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?) -
ఎక్కువ బరువులు ఎత్తడంకంటే ఇలా చేస్తే కండలు ఆరోగ్యంగా పెరుగుతాయి..
జిమ్‌లలో వ్యాయామం నిదానంగా చేయాలి. బరువులతో ఎక్సర్సైజ్ చేసేవారు త్వరగా కండరాలు పెరగాలనే ఉద్దేశంతో బరువులు త్వరత్వరగా పెంచుకుంటూ పోకూడదు. తక్కువ బరువుతో మొదలుపెట్టి... రిపిటీషన్స్ ఎక్కువగా చేయాలి. బరువులతో వ్యాయామం చేసేవారు బరువును పెంచడం చాలా నెమ్మదిగా, నిదానంగా చేయాలి. మరీ ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవు. హెవీ వెయిట్స్తో కండరం మీద ఎక్కువ భారం పడేలా ఎక్సర్సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే మరింత ప్రోటీన్ అందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయడం మంచిది. ఇలా స్టిమ్యులేషన్ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం సరికాదు. దానికి బదులుగా తమకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే ఎత్తుతూ, కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయాలి. కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో చాలామంది తాము ఎక్సర్సైజ్ చేసేప్పుడు బరువులను తొందర తొందరగా పెంచుకుంటూ పోతారు. బరువు పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్ రిపిటీషన్స్ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. చేస్తున్న ఎక్సర్సైజ్ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు వీలైనంత బరువును మాత్రమే వేసుకోవాలి. ఇలా తక్కువ బరువుతో ఎక్కువ కౌంట్ చేయడం వల్లనే కండరం ఆరోగ్యంగా పెరుగుతుంది. -
మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదా?
మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. కాకపోతే రుతు సమయంలో యువతులు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే... వేటవూంసం, చికెన్, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, గసగసాలు, అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్ సమయంలోనేగాకుండా మామూలుగానూ తీసుకుంటుంటే వారు కోల్పోయే ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది. అయితే... రుతుసవుయంలో వారు ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మందకొడిగా మారి వ్యాయామం చురుగ్గా చేయలేకపోవచ్చు. కేవలం రుతు సమయంలోనే గాక... మిగతా టైమ్‌లో అలాంటి ఆహారం వల్ల చురుగ్గా ఉండలేకపోవచ్చు.. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... యువతులు, మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి. వేళకు పడుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. అప్పుడే మహిళలకు ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుంది. -
జీవితంలో సగభాగం నిద్దురకే...
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు... అని సినీకవి చెప్పిన మాట గతంలో ఓకే కానీ, ప్రస్తుత బిజీ లైఫ్‌కు వర్తించదనేది కాదనలేని వాస్తవం. హడావుడి జీవితం, పోటీ ప్రపంచంలో మనుగడ సాధించేందుకు ప్రతి ఒక్కరూ రేయింబవళ్లు కష్టపడాల్సిందే! గతంలో కాయకష్టం చేసిన శరీరాలను నిద్ర తల్లి వెంటనే జోకొట్టేది, కానీ ప్రస్తుత లైఫ్స్టైల్లో శారీరక కష్టం చాలా తక్కువైంది. టెక్నాలజీ కారణంగా శరీరాలు సుఖమరిగాయి. దీంతో నిద్ర సరిగా రాకపోవడం, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. కారణాలేవైనా, ఎక్కువ కాలం నిద్రలేమితో బాధపడేవారికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి 8 గంటల కనీస నిద్ర అవసరం. చిన్నపిల్లలు, యువతకు 10 గంటల నిద్ర తప్పనిసరి. పైగా కరోనా రాకుండా కాపాడుకోవడానికి బలవర్థక ఆహారం ఎంతముఖ్యమో, కంటినిండా నిద్ర పోవడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. కంటి నిండా నిద్రకు చిట్కాలు దుష్ప్రభావాలనేకం పెద్దవారిలో నిద్రలేమితో జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. నిద్రపోతున్న సమయంలో జ్ఞాపకాలను నిల్వచేసే ముఖ్యమైన మెదడు తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం నుంచి ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌కు దీర్ఘకాలిక జ్ఞాపకాలను బదిలీ చేస్తాయి. నిద్రలేమితో ఈ మొత్తం ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. సరిగా నిద్రలేకపోతే ఆకలి పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. మనిషి ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుంది. సరిపడినంత నిద్రలేకపోవడం వలన ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్రలేమి సమస్య దీర్ఘకాలం కొనసాగితే నిరాశ, నిస్పృహ, ఆందోళన చుట్టుముడుతుంటాయి. ఫలితంగా శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మోతాదులో విడుదల అవుతుంది. ఇది చర్మసంరక్షణకు తోడ్పడే కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేసి చర్మ సౌందర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. కేవలం శారీరక సమస్యలే కాకుండా పలు రకాల మానసిక సమస్యలు కూడా నిద్రలేమితో ఉత్పన్నమవుతాయి. శరీరానికి సరైన నిద్ర ఉంటే అది వివిధ జీవక్రియలను సమన్వయపరుస్తుంది, మంచి నిద్రలేకపోతే జీవక్రియలలో మార్పులు సంభవిస్తాయి, దీంతో వైరస్ల బారిన పడే అవకాశం పెరుగుతుందని లెనోక్స్ హిల్ హాస్పిటల్ సీనియర్ న్యూరో సైకాలజిస్ట్ పిహెచ్డి బ్రిటనీ లెమోండా తెలిపారు. క్రమబద్ధమైన దినచర్య కోవిడ్ అనంతర కాలంలో ఎదురయిన సామాజిక పరిస్థితుల కారణంగా చాలా నెలలు అందరి దినచర్యలు మారిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగస్థుల సమస్యలు పెరిగాయి, కొందరైతే ఉద్యోగాలు కోల్పోయారు, కొందరేమో వర్క్ ఫ్రం హోమ్‌కు పరిమితమయ్యారు. మరోవైపు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితుల్లేక విద్యాసంవత్సరం ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తుండడంతో మరలా మునపటి జీవనశైలికి అలవాటు పడడం కష్టంగా అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యలు కేవలం మన ఒక్కరికే పరిమితం కాదని, అందరూ ఎదుర్కొంటున్న సమస్యలని గుర్తించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులకనుగుణంగా దినచర్యను మార్చుకోవడం కన్నా, క్రమబద్ధమైన దినచర్య అంటే రోజూ ఒకే సమయానికి లేవడం, తినడం, పడుకోవడం వంటివి పాటిస్తే ఒత్తిడి ప్రభావం ఉండదని కొలంబియా యూనివర్సిటీ మనస్తత్వ శాస్త్రవేత్త నవ్యాసింగ్ తెలిపారు. అతి నిద్ర వద్దు అతినిద్రాలోలుడు.. తెలివిలేని మూర్ఖుడు అన్నట్లు కోవిడ్, లాక్డౌన్ కారణంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవడం చాలామందికి అలవాటైంది. కరోనా అనే కాకుండా, కొందరికి అతినిద్ర ఒక అలవాటుగా ఉంటుంది. అయితే ఇలాంటి దీర్ఘకాలిక నిద్ర అనర్ధదాయకమని సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల శరీర సహజసిద్ధ గడియారం (బయలాజికల్ క్లాక్) దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బ్లూ లైట్ వాడొద్దు నేటి తరం ఖాళీ సమయం దొరికితే ఫోన్లు, ల్యాపీల వద్ద సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నారు. యంగ్ జనరేషన్‌తో పాటు పెద్దవారికి కూడా మొబైల్ వాడకం వ్యసనంగా మారింది. నిద్రపోయే ముందుకూడా మొబైల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే బ్లూలైట్ కారణంగా కళ్ళు ఒత్తిడికి లోనవుతాయి. దీంతో కంటి నిండా నిద్ర ఉండదు. అందువల్ల పుస్తకాలు చదవడం, బ్లూలైట్ ప్రభావం తక్కువగా ఉన్న మొబైల్‌ను వాడటం మంచిది. వ్యాయామం మరవద్దు కరోనా కారణంగా చాలా రోజులపాటు వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో ఇంట్లోనే గడిపాం. దీనితో వ్యాయామం చేయడానికి కూడా కుదరలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కనుక కాస్త బద్దకంగా అనిపించినా.... జిమ్‌లో లేదా అందుబాటులో ఉన్న ఫిట్నెస్ సాధానాల ద్వారా రోజూ ఎక్సర్సైజ్ చేయాలి. వ్యాయమం చేయడం వలన శరీరంలోని అన్ని భాగాలకు రక్తసరఫరా జరిగి కొంత అలసట తీరి నిద్రకూడా బాగా పడుతుంది. అయితే పడుకునే ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. దీని వలన నిద్ర సరిగ్గా పట్టదు. నో ఆల్కహాల్ చాలా మంది ఒత్తిడిని, ఆందోళనను అధిగమించడానికి, నిద్ర పట్టడానికి ఆల్కాహల్ తీసుకుంటారు. దీని వలన మంచి నిద్ర పడుతుందని, తర్వాతి రోజు దినచర్య బాగుంటుందని భ్రమపడతారు. కానీ ఒక మోతాదుకు మించి తాగితే, ఆల్కహాల్ వల్ల అదనపు సమస్యలు ఉత్పన్నమవుతాయని, వ్యాధినిరోధక శక్తిపై దుష్ప్రభావం చూపుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే స్లీపింగ్ పిల్స్‌కు అలవాటు పడడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. సో.. ఆరోగ్యం బాగుండాలంటే కంటినిండా సరైన కునుకుండాలి, సరైన నిద్ర ఉండాలంటే శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలి. లేదంటే నిద్రలేమితో స్టార్టయ్యే సమస్యలు ఎలా ముగుస్తాయో ఎవరం చెప్పలేము. బీకేర్‌ఫుల్! -
నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..!
వ్యాయామంతో శారీరక, మానసిక ఒత్తిడి తొలగి ఉల్లాసంగా ఉంటామనే సంగతి మనందరికీ తెలిసిందే! అయినా వ్యాయామం చేయడానికి బద్ధకిస్తాం! ఇందుకు కారణాలనూ వెతుక్కుంటాం! కానీ వ్యాయామాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ చక్కగా ఓ కుక్క క్లాసులు కూడా చెప్పేస్తోంది. నమ్మడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..! అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆస్ట్రేలియన్ షెప్‌యార్డ్ ఎక్సర్సైజులు ఎలా చేయాలో క్లాసులు చెప్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. జనవరి 10న టెస్లా అనే కుక్క స్కిల్స్‌ను తొలిసారిగా పోస్టు చేశారు. ఆ తర్వాత ట్విటర్లో వేల కామెంట్లు రావడంతో మరిన్ని ఫీట్లను పోస్టు చేశారు. ఆస్సీస్ డూయింగ్ థింగ్స్ అనే అకౌంట్లో కుక్క దొర్లుతూ ఎగురుతూ క్లాస్ చెప్తుండటం చూసే వాళ్లందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో ట్విటర్లో 42లక్షల వ్యూయర్స్‌ను దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 92వేల మంది వీక్షించారు. టెస్లా పేరు మీదనే ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్.. దానికి 40వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే అర్థమైపోతోంది కదా అది కూడా ఓ సెలబ్రిటీ అని. View this post on Instagram Craussfit part II. Looking for a gift this holiday season? @fpmovement is the gift that keeps you moving 🏃♀️🤸♀️🏋️♀️ Swipe ➡️ to see the roll 😁 #movingtogether #freepeoplepartner #freepeople . . . #dogsofinstagram #dog #puppy #dogsofinsta #pupsofinstagram #miniaussie #austrailianshepherd #bluemerle #miniaussie #bluemerleaussie #aussiepuppies #americanshepherd #wigglebutt #aussiesofinstagram #miniaussiesofinstagram #dogtraining #aussiesdoingthings @laur_fotsch @crossfitsj @crossfittraining A post shared by Tesla (@teslatheminiaussie) on Nov 14, 2019 at 8:23am PST View this post on Instagram Perfecting the wall stand. 😱💪👏 #teslatricks #crossfit #gymnasticsday . . . #dogsofinstagram #dog #dogsofinsta #pupsofinstagram #miniaussie #austrailianshepherd #bluemerle #miniaussie #bluemerleaussie #aussiepuppies #americanshepherd #wigglebutt #aussiesofinstagram #miniaussiesofinstagram #dogtraining #aussiesdoingthings #dogyoga A post shared by Tesla (@teslatheminiaussie) on Jan 13, 2020 at 5:17pm PST -
నొప్పి మళ్లీ తిరగబెడుతోంది.. ఎందుకు?
దాదాపు ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్ అయ్యి, చీలమండ బెణికింది. అప్పట్లో ప్లాస్టర్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి తిరగబెడుతూ ఉంది. చీలమండ వద్ద వాపు, నొప్పి కనిపిస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది? దయచేసి వివరించండి. మీ కాలు బెణికినప్పుడు చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మణికట్టు వంచినప్పుడల్లా క్లిక్‌మని శబ్దం! నా వయసు 33 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాన్ని కొద్దిగా పక్కకు వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. ఈ నొప్పి కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చెప్పండి. మన మణికట్టు చాలా సంక్లిష్టమైన నిర్మాణం. ఈ మణికట్టులో 15 ఎముకలతో పాటు ఎన్నో లిగమెంట్లు ఉంటాయి. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు మనకా విషయమే తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మన మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం కూడా మనకు సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లుగా సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా అయిఉండవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్–రే పరీక్షలు చేయించుకోండి. సమస్యను బట్టి చికిత్స ఇస్తారు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
సిక్స్‌ప్యాక్ ట్రై చేస్తున్నారా?
తీవ్రమైన యాబ్స్ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహించి వేస్తాయి. అందుకే సిక్స్ ప్యాక్ కోసం శ్రమించే వారి ముఖం, బుగ్గలలోని కొవ్వు పూర్తిగా దహనమైపోయి వారి బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు అవుతుంది. సిక్స్ ప్యాక్స్ అంటూ కడుపుపైన ఉండే ఆరు కండరాలు స్పష్టంగా కనిపించేలా వ్యాయామాలు చేయడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం కడుపు కండరాలకు చాలా ఎక్కువ శ్రమ కలిగేట్లుగా ‘యాబ్స్ ఎక్సర్సైజ్’లు చేస్తుంటారు. మనిషుల్లో ప్రతి ఒక్కరికీ కడుపుపైనా యాబ్స్ కండరాలు ఉంటాయి. అవి ప్రస్ఫుటంగా పైకితేలేందుకు చేసే వ్యాయామాల్లో ఒక జాగ్రత్త పాటించడం మంచిది. అదేమిటో తెలుసుకునే ముందర అసలు మన దేశవాసు ల్లో పొట్ట ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. పొట్ట ఎందుకొస్తుంది అప్పట్లో మన దేశంలో తరచూ కరువులు వస్తుండేవి. ఆహారం దొరకని సమయాల్లో.... తనకు తిండి దొరికినప్పుడే ఆ అదనపు ఆహారాన్నికొవ్వు రూపంలో నిల్వ ఉంచుకునేలా శరీరం తనను తాను సంసిద్ధం చేసుకుంటుంది. జీవులు తమ మనుగడ కోసం అనుసరించే ‘అడాప్టేషన్’ ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుండేది. 17, 18వ శతాబ్దాల్లో తరచూ కరవులు వచ్చే సమయంలో వాటిని అధిగమించి మనుగడ సాధించేందుకు వీలుగా మన దేశవాసుల్లో... (మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశ వాసుల్లో) ఇలా ఒక జన్యుపరివర్తన జరిగింది. ఆ జన్యువు ప్రాబల్యంతో ఒక వయసు తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం మొదలైంది. ఆహారం దొరకని సమయాల్లో ఆ కొవ్వును వినియోగించుకోడానికి వీలుగా ఈ జన్యుపరివర్తన సంభవించిందని దక్షిణ భారత దేశ జన్యుపటలంపై అధ్యయనం చేసిన కొందరి సిద్ధాంతమిది. అయితే ఇప్పుడు హరిత విప్లవం తర్వాత ఆహార ధాన్యాల లభ్యత బాగా పెరిగింది. పైగా స్వాతంత్య్రానంతరం దేశంలోని ఒక చోటి నుంచి మరొక చోటికి రవాణా సౌకర్యాలు విస్తరించాయి. ఆ కారణంగా ఆ ధాన్యాలను ఎక్కడికైనా తరలించడం సులభం కావడంతో మొదట్లోలా కరువుకాటకాలు తగ్గిపోయాయి. కానీ మన దేహంలో పొట్ట వచ్చేందుకు దోహదపడే జన్యువు కారణంగా పొట్ట రావడం మాత్రం ఒక వయసు తర్వాత అలాగే కొనసాగుతూ ఉంది. సిక్స్ ప్యాక్ ఎలా ప్రమాదం? మనం పొట్టపైన కండరాలను పైకి తేలించేందుక తీవ్రమైన యాబ్స్ ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు... అవి కేవలం పొట్టపైన ఉన్న కొవ్వును మాత్రమే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని కొవ్వునూ దహనం చేస్తాయి. మన శరీరంలోని కొవ్వు చాలా ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. ఉదాహరణకు ముఖంలోని చెంపల భాగంలో, భుజాల్లో కొవ్వు పేరుకుంటుంది. అందుకే కొందరిలో మరీ ఎక్కువగా కొవ్వు చేరి ఉండటం వల్ల బుగ్గలు బూరెల్లా, భుజాలూ గుండ్రంగా కనిపిస్తుంటాయి. తీవ్రమైన యాబ్స్ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా లేదా కీలక అవయవాల రక్షణ కోసం ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహిస్తాయి. అందుకే సిక్స్ ప్యాక్ కోసం చాలా తీవ్రంగా శ్రమించే వారి ముఖం, బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు కనిపిస్తాయి. సిక్స్‌ప్యాక్ కోసం వ్యాయామం చేసేవారు ఒక జాగ్రత్త పాటించాలి. తమ ముఖం పూర్తిగా పీక్కుపోయినట్లుగా అయిపోయి... ముఖం ఆకృతి మారిపోయేలా ఉన్న దశలో ఆ వ్యాయామాల్ని ఆపేయాలి. ముఖం అందం తగ్గేంత వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఒకసారి సిక్స్‌ప్యాక్ సాధించాక అది ఎప్పటికీ అలాగే ఉండిపోదు. అదలా ఉండిపోవడం కోసం ఎప్పుడూ యాబ్స్ వ్యాయామాల్ని కొనసాగిస్తూనే ఉండాలి. లేదంటే మన జన్యువుల వల్ల మళ్లీ పొట్ట చుట్టూ కొవ్వు చేరుతూ ఉంటుంది. మీకు మీ ముఖ ఆకర్షణ కూడా ముఖ్యమేనా లేక యాబ్స్ పట్లనే అబ్సెస్ అయి ఉన్నారా అన్నది మీరే తేల్చుకుని, మీ వ్యాయామ తీవ్రతను ఎంచుకోవాలి. -
వెన్నునొప్పి తగ్గడం లేదు... పరిష్కారం చెప్పండి
నా వయసు 32 ఏళ్లు. ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. రోజూ 60 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. అలాగే కొన్ని అకౌంట్స్ కోసం కంప్యూటర్ మీద కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంటాను. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. నాకున్న సమస్య ఏమిటి? పరిష్కారం సూచించండి. ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా చాలామందిలో వెన్నునొప్పులు వస్తున్నాయి. మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. పైగా డ్రైవింగ్‌లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. మన రోడ్ల మీద గతుకులు చాలా సాధారణం. ఇలాంటి నేపథ్యంలో ఇంతింత దూరాలు టూ–వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి. ►మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి. ►కొన్ని సాధారణ వార్మ్అప్ వ్యాయామాలు చేయండి ►వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. -
గుండె ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాకూడదంటే...?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ఇటీవల నాకు గుండెకు రక్తం పరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మందులతోనే చక్కదిద్దవచ్చని (మెడికల్లీ మేనేజబుల్) అన్నారు. నేను కూడా డాక్టర్లు చెప్పినట్టే మందులు వాడాలని నిర్ణయించుకున్నాను. వీటిని కొద్దికాలం వాడితే సరిపోతుందా? జీవితాంతం వాడాలా? ఇవి వాడుతున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సర్జరీ చేయించాల్సిన అవసరం వస్తుందా? నాకు సర్జరీ అంటే చాలా భయం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? – డి. పూర్ణచంద్రరావు, జమ్మలమడుగు మీకు గుండెజబ్బు ఉండి, రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కేవలం మందులు వాడితే సరిపోతుం దని డాక్టర్లు చెప్పారంటే ఆ బ్లాక్స్ అంత ఎక్కువగా లేవనీ అర్థం. లేదా పెద్ద రక్తనాళాలు అన్నీ బాగానే ఉండి గుండెకు రక్తసరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్ ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదేకాకుండా భవిష్యత్తులో జబ్బు పెరగకుండా ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ... ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులు వాడుతూ ఉంటే జబ్బు పెరిగి ఆపరేషన్ అవసరం పడాల్సిరావడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆహార, వ్యాయామ నియమాలు పాటించకుండా, మందులు వాడటంలో నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధ చేస్తూ ఉంటే జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి అస్తమానం ఆపరేషన్ గురించి ఆలోచిస్తూ ఆందోళనపడకుండా ఉండండి. యోగా, వాకింగ్ వంటివి చేస్తూ పైన పేర్కొన్న మందులు తీసుకుంటూ నిర్భయంగా ఉండండి. ఒకవేళ ఇదంతా చేసినా కూడా జబ్బు పెరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే నిర్భయంగా, నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. ఇప్పుడు తక్కువగాటుతో లేదా ఒక్కోసారి అదీ లేకుండా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేయించుకుని పూర్తిగా నార్మల్ జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి గుండెజబ్బుల నివారణ ఎలా? నా వయసు 46 ఏళ్లు. భవిష్యత్తులో గుండెజబ్బులు వస్తాయేమో అని ఆందోళనగా ఉంది. గుండెజబ్బు లను నివారించడానికి ఎలాంటి వ్యాయామాలు మంచివో సూచించండి. – ఎస్.వి. రమణప్రసాద్, కాకినాడ ఆరోగ్యాన్ని కాపాడుకుందుకు, గుండెపోటును నివారించడానికి ఏ వ్యాయామాలైనా మంచివే. అయితే బరువులు ఎత్తుతూ చేసేవి, బాడీబిల్డింగ్ కోసం చేసేవాటి కంటే వాకింగ్, యోగా లాంటివి మీ వయసువారికి మరింత మంచిది. క్రమం తప్పకుండా రోజూ 3 నుంచి 4 కి.మీ వాకింగ్ చేయడం, అలా వారంలో ఐదు రోజులు చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పాళ్లు పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలుం టాయి. దాంతో పాటు గుండె పోటు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను కూడా ఈ వ్యాయామాలు తగ్గిస్తాయి. డాక్టర్ అనూజ్ కపాడియా, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
హెల్త్ టిప్స్
బరువు తగ్గాలనుకునే వాళ్లు అనుకున్నదే తడవుగా ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారు? అంటే ఎంత బరువు తగ్గితే సరిపోతుంది, ఎంత సమయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టత వచ్చాక నియమాలను పాటించడం మొదలుపెట్టాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదు సార్లు పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగానూ కేలరీలు తక్కువగానూ ఉంటాయి. -
లావయ్యానని కామెంట్ చేస్తే..!
అన్నె హతవేకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలోనూ ఆమె పోస్ట్‌లను ఫ్యాన్స్ ఎగబడి ఫాలో అవుతుంటారు. తాజాగా ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె భారీ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంది. సన్నగానే ఉంది కదా? ఈ స్థాయిలో ఎక్సర్సైజ్లు ఎందుకు? అని ఎవ్వరూ ప్రశ్నించకముందే ఆమె చెప్పేసింది, తను ఆ ఎక్సర్సైజ్లు చేస్తోంది బరువు పెరగడానికని! క్రిస్టొఫర్ నోలన్ సినిమాలు ‘ది డార్క్ నైట్ రైజెస్’, ‘ఇంటర్స్టెల్లార్’ సినిమాలతో హాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఎదిగిన హతవే, తాజాగా ఓ సినిమాకు లావు అమ్మాయిగా కనిపించనుంది. అందుకు ఈ ఎక్సర్సైజ్లు చేస్తోంది. ‘‘త్వరలోనే నేను బాగా లావవుతా. నేను లావయ్యానని ఎవరైనా కామెంట్ చేస్తే, బాడీ షేమింగ్‌కు వెళితే, నేనొక్కటేమాట చెబుతా.. నేను కాదు, మీరు లావవుతారు. ఇలా బాడీ షేమింగ్‌కు దిగితే!’’ అంటూ ఆ వీడియోతో పాటు కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్! బాడీ షేమింగ్ ఒక్క సినీ పరిశ్రమ అనే కాకుండా అన్ని చోట్లా ఒక అబ్యూజ్గా మారిపోతున్న రోజుల్లో దాని గురించి ఒక టాప్ హీరోయిన్ మాట్లాడటం మంచి విషయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాకోసం హతవే లావెక్కుతుందన్న విషయం మాత్రం సస్పెన్స్!! -
వింటర్లో వ్యాయామం.. వస్తోంది ఆయాసం!
పల్మునాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38. గతంలో డస్ట్ అలర్జీ ఉండేది. నా ఫ్రెండ్స్ కొందరు వింటర్లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేస్తున్నప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – మనోహర్, పాలకొల్లు వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఒక్కసారిగా ఈ చల్లగాలితో ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙ పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితోపాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే...? నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వండి. – సుకుమార్, ఖమ్మం పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే అది కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్, సికింద్రాబాద్ -
శరీర బరువు ఇలా కూడా పెరుగుతుంది!
సెల్ఫ్‌చెక్ వ్యాయామాలు చేయకపోవటం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవటం వంటివి బరువు పెంచే సాధారణ కారణాలు. కానీ, మనం చేసే ప్రతి పని శరీర బరువును ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోవటం : నిద్రలేమి శరీర బరువుపై ప్రభావం చూపుతుంది. తగినంత నిద్రలేకపోవడంతో శరీరంలో హార్మోన్ల స్థాయిలో మార్పులు కలగటం వలన ఆకలి పెరిగి, అధికంగా తిని బరువు పెరుగుతారు. మానసిక ఒత్తిడి... మందుల ప్రభావం: మానసిక ఒత్తిడికి గురైన సమయంలో అనాలోచితంగా జంక్ ఫుడ్ లేదా అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను తీసుకుంటా . అదేవిధంగా దీర్ఘకాలికంగా ‘యాంటీ డిప్రెసెంట్’లను తీసుకోవడం వలన కూడా శరీర బరువు పెరగవచ్చు. థైరాయిడ్: థైరాయిడ్ గ్రంథి నుండి సరిపోయేంత స్థాయిలో హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల జీవక్రియ ఆలస్యం అవుతుంది. ఫలితంగా శరీర బరువు పెరుగుతుంది. మెనోపాజ్ : మెనోపాజ్ సమయంలో హార్మన్ల అసమతౌల్యం వల్ల బరువు పెరగవచ్చు. దాంతో వయసు పెరిగిన కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి. కండరాల ద్రవ్యరాశి తగ్గుతుంది. ఫలితంగా నడుము చుట్టూ, తొడల ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయి లావవుతారు. ధూమపానం మానేయటం : పొగ తాగటాన్ని ఆపేయటం! అవును, నిజమే. సిగరెట్లో ఉండే నికోటిన్ ఆకలిని తగ్గించి వేస్తుంది. సిగరెట్ మానేయటం వలన ఆకలి పెరిగి, అధికంగా తినే అవకాశం ఉంది. అంతేకాకుండా రుచి గ్రాహకాల పనితీరులో లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం, సిగరెట్ మానటం వలన 4 నుండి 5 కిలోల బరువు పెరుగుతారని వెల్లడించారు. అలాగని స్మోకింగ్ మానడాన్ని మానకండి. -
స్పాండిలైటిస్‌కు...
సర్వైకల్ ఏరియాలో సి1 నుంచి సి7 మధ్యలో ఉన్న డిస్క్ బల్జ్ హెర్నియేటెడ్ డిస్క్, డిస్క్ అరుగుదల వంటివి ఒకప్పుడు వయసు పెరిగిన తర్వాత మాత్రమే వచ్చే సమస్యలు. అయితే ప్రస్తుత జీవనశైలి కారణంగా ఈ తరహా నొప్పులు యుక్తవయసుల్లోనూ సర్వసాధారణంగా మారాయి. నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డిపాజిట్ కావడం దీనికో ప్రధాన కారణం. మెడ భుజాలు గుంజడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. దీనికి పని చేసే మధ్యలో తరచుగా విరామాలు తీసుకోవడం, అటూ ఇటూ నడవడం కొన్ని రిలాక్సింగ్ వ్యాయామాలు చేయడం అవసరం. 1. బ్రహ్మముద్రలు శ్వాస తీసుకుంటూ తలను నెమ్మదిగా పైకి ఎత్తి శ్వాస వదులుతూ తలను కిందకు, గడ్డాన్ని ఛాతీ మీదకు (ఊర్థ్వ అథో ముద్రలు) తీసుకురావాలి. అదే విధంగా శ్వాస తీసుకుంటూ కుడి చెవి కుడి భుజం మీద శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్లీ శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి ఎడమ భుజం మీదకు శ్వాస వదులుతూ మధ్యలోకి (వామ దక్షిణ)... తేవాలి. అలాగే గడ్డం కుడి భుజం మీద మళ్లీ నెమ్మదిగా ఎడమ భుజం మీదకు తీసుకురావాలి. తర్వాత తలను గుండ్రంగా వీలైనంత పెద్ద వృత్తంలో తిప్పాలి. గడ్డం ఛాతీ మీద ఆనించి గడ్డం కుడి భుజం మీదకు తలను వెనుకకు వాలుస్తూ ఎడమ భుజం మీదకు గడ్డం తీసుకువచ్చి తిరిగి ఛాతీ మీదకు తీసుకురావాలి. వీటిని వీలైనంత నిదానంగా కనీసం 3 సార్లు చేయాలి. కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తే లో సుగర్, లో బీపీ లేదా స్పాండిలైటిస్ వలన కనుక ఒక రౌండ్ క్లాక్ వైజ్ గడియారం దిశలో మరో రౌండ్ యాంటి క్లాక్ వైజ్ చేయాలి. 2.ఊర్థ్వ నమనాసన దీనిని నుంచుని లేదా కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేసి బాగా పైకి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ చేతులు రిలాక్స్ చేయాలి. ఇలా 5 నుంచి 6 రిపిటీషన్లు చేయాలి. 3.ఊర్థ్వనమనాసన చాలన చేతులు రెండూ ఇంటర్ లాక్ చేసి పైకి స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ ఎడమ వైపు వదులుతూ మళ్లీ మధ్యలోకి తేవాలి. ఇలా 5 నుంచి 10 రిపిటీషన్లు. ఇలాగే కుడివైపు కూడా చేయాలి. 4. తాలాసన (ఎడమ, కుడి) సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ కుడిచెయ్యి పైకి (పక్క నుంచి) నెమ్మదిగా తీసుకువెళ్లి కుడి భుజం కుడి చెవికి దగ్గరగా ఉంచి చెయ్యి పైకి స్ట్రెచ్ చేస్తూ ఎడమ చెయ్యి నడుం పక్కన కిందకు అరచేయి కిందకు తీసుకువెళుతూ శ్వాస వదులుతూ వీలైనంతగా ఎడమవైపుకి బెండ్ అవ్వాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ కుడి చేయి కిందకు.. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. 5. తాలాసన చాలన శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకువెళ్లి శ్వాస వదులుతూ చేతులు కిందకు డయాగ్నల్‌గా తీసుకురావాలి. మళ్లీ కాలి మడమ తిప్పుతూ వెనుకకు తిరుగుతూ పైకి తీసుకెళ్లాలి. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. 6. కటి చక్రాసన చాలన వేరియంట్ ఎ: కాళ్ల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి ఫ్రీగా వదిలేసిన చేతులను స్వింగ్ చేస్తూ 360డిగ్రీల కోణంలో ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రొటేట్ చేయాలి. వేరియంట్ బి: అదే విధంగా చేతులను మధ్యలో ఉంచి కుడిచేయి ఎడమ భుజం మీదకు, ఎడమ చేయి వెనుక నడుం మీదకు ఉంచుతూ ఎడమ వైపునకు తిరగాలి. ఇదే విధంగా కుడి వైపునకు ఇలా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఒక కాలి మడమను పైకి లేపి రెండవ పాదం డైరెక్షన్‌ను మారుస్తూ చేయాలి. వేరియంట్ సి: ఇదే విధంగా పైనుంచి చేయాలి. పైన పేర్కొన్న ఆసనాలు అన్నీ నిలబడి చేయవచ్చు కనుక ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఈ ఆసనాలు నిదానంగా, చేతులు, శరీరాన్ని ఫ్రీగా వదిలేసి మనస్సుని రిలాక్స్డ్గా ఉంచి చేయాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ పూర్తిగా వదులుతూ చేయడం, చేతుల కదలిక వలన తలలోని భాగాలకు 12 జతల క్రేనియన్ నాడీ వ్యవస్థకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. ఈ వ్యాయామాలు అన్నీ మెదడుకు సంబంధించిన బ్రెయిన్ ఎటెక్సియా, అల్జీమర్స్, సీజర్స్ వంటి సమస్యల పరిష్కారానికి కూడా బాగా ఉపకరిస్తాయి. ఈ ఆసనాలతో పాటు రెగ్యులర్‌గా ఈ క్రింద పేర్కొన్న ఆసనాలు కూడా సాధన చేయడం అవసరం. నిలబడి: త్రికోణాసన, పార్శ్వకోణాసన, కూర్చుని: మార్జాలాసన, అర్థ అథోముఖ శ్వానాసన, బాలాసన/శశాంకాసన, వక్రాసన, మరీచాసన, భరధ్వాజాసన, అర్ధ మచ్చేంద్రాసన, అథోముఖ శ్వానాసన, ఉష్ట్రాసన వెల్లకిలా పడుకుని: మత్సా్యసన, సేతు బంధాసన, శవాసన బోర్లా పడుకుని: నిరాలంబాసన, స్వాలంబ భుజంగాసన, భుజంగాసన, ఊర్థ్వముఖ శ్వానాసన, మకరాసన ఈ ఆసనాలు చేయడంలో అవసరమైతే గోడ, కుర్చీ, ఇటుకరాయి... వంటి వాటి సపోర్ట్ తీసుకుని కూడా చేయవచ్చు. అలాగే తేలికపాటి ప్రాణాయామాలు కూడా నొప్పుల నివారణలో ఉపకరిస్తాయి. – సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి -
బరువులెత్తే వ్యాయామాలతో మతిమరపు దూరం!
పరిపరిశోధన జిమ్‌లో బరువులు ఎత్తుతూ వ్యాయామాలు చేసేవారిలో వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరపు (డిమెన్షియా) చాలా తక్కువ అని చెబుతున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్ మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి వృద్ధాప్యంలోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. యూవనిర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు సగటున 66 ఏళ్లు పైబడిన 338 మంది వృద్ధులను ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వారిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను తెలుసుకున్నారు. -
బరువులెత్తే వ్యాయామాలు అమ్మాయిలకు అవసరం...
సిక్స్‌ప్యాక్ క్వీన్ సోనాలి స్వామి జిమ్‌దగీ ‘‘వయసుతో సంబంధం లేకుండా మహిళలు వర్కవుట్స్ చేసి, ఫిట్‌గా మారవచ్చు. బరువులు మోస్తే మగవాళ్లలా కండలు వస్తాయనేది అపోహ మాత్రమే’’ అంటున్నారు బెంగుళూర్‌కు చెందిన ఫిట్నెస్ మోడల్ సోనాలి స్వామి. పెళ్లయి, పిల్లలు పెద్దయ్యాక 38 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్‌లోకి ప్రవేశించిన సోనాలి... మూడేళ్ల క్రితం బాడీ పవర్ ఇండియా 2014’లో ఫిట్నెస్ మోడల్ టైటిల్ విజేతగా నిలిచారు. బెంగుళూర్ నుంచి ఏకైక మహిళా బాడీబిల్డర్, సిక్స్‌ప్యాక్ క్వీన్‌గా కూడా పాప్యులరైన సోనాలి...ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారారు. వెయిట్ అండ్ షీ! ఎరోబిక్స్, డ్యాన్సింగ్, కార్డియో ఎంతైనా చేస్తారు కాని పురుషుల్లా కనపడతామేమో అని బరువులు ఎత్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలకు అమ్మాయిలు దూరంగా ఉంటారు. నేను 40కిలోల బరువు ఎత్తగలను. నేనేమీ మగవాడిలా కనపడడం లేదు కదా. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలు మజిల్ కోల్పోతుంటారు. అలా కోల్పోవడాన్ని వీలైనంత ఆలస్యం చేయడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తప్పనిసరి. అలాగే శరీరంలో ప్రతి అవయవానికీ, ప్రతి మజిల్కీ వ్యాయామం ఇవ్వాలి. దీనికి బరువులు ఎత్తడమే మార్గం. బాడీబిల్డింగ్ అంటే... కండలు పెంచడం కాదు బాడీ బిల్డింగ్ పట్ల మహిళలు విముఖత చూపనక్కర్లేదు. ఎందుకంటే... దీనిలో విభిన్న రకాల కేటగిరీలు ఉంటాయి. నేను ఫిట్నెస్ మోడల్ కేటగిరీలో చేశాను. బాడీబిల్డింగ్ అంటే ఫిట్, టోన్డ్ లుక్ కూడా. మనం తీసుకుంటున్న శిక్షణ, డైట్, వీటన్నింటినీ బట్టి మార్పు చేర్పులుంటాయి. అలాగే ఫిట్‌నెస్‌కు సంబంధించి షార్ట్‌టైమ్ టార్గెట్స్ వద్దు. పెళ్లి కుదరింది కాబట్టి బరువు తగ్గాలి. లేదా డాక్టర్ చెప్పాడు కాబట్టి తగ్గాలి అనుకోకూడదు. వ్యాయామం అనేది జీవిత కాలం కొనసాగించే అలవాటుగా భావించాలి. కొత్తవాళ్లయితే ప్రారంభంలో కనీసం 30 నిమిషాల వ్యాయామం సరిపోతుంది. అయితే కాస్త అనుభవం వచ్చాక రోజుకు 1గంట వరకూ చేయాలి. ఈ గంటలోనే కార్డియో, వెయిట్ ట్రైనింగ్... అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓపిక పట్టాలి. ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం చూడొద్దు. కుటుంబమే బలం ఉదయం 5గంటలకు నా దినచర్య ప్రారంభం అవుతుంది. పిల్లల్ని స్కూల్‌కి పంపేశాక, నా ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేస్తాను. పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేలోపు నా పర్సనల్ ట్రైనింగ్ వగైరాలన్నీ పూర్తవుతాయి. ఇక సాయంత్రం నుంచి నా టైమ్ అంతా వారికే కేటాయిస్తాను. అలా ఇంటినీ, నా పేషన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటైంది. నా భర్త సంజయ్ ప్రోత్సాహం బాగా లభిస్తోంది. నేను ట్రైనింగ్ సెషన్స్ మిస్సవ్వకుండా, సరైన ఆహారం తీసుకునేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. నా ఆహారంలో వెజిటబుల్స్ అత్యధికంగా ఉంటాయి. రెడ్ మీట్ ఉండదు. అయితే ప్రొటీన్స్ కోసం చికెన్‌ను తరచు తీసుకుంటాను. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని గుర్తించి ఆమె ఫిట్నెస్ విషయంలో కుటుంబం అంతా శ్రద్ధ చూపించాలి. సమన్వయం ఎస్. సత్యబాబు సాక్షి ప్రతినిధి -
ఎక్సర్సైజ్కు టైం లేదు. బరువు తగ్గేదెలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను గృహిణిని. వ్యాయామాలు చేయడానికి టైమ్ ఉండదు. ఈమధ్య బాగా బరువు పెరుగుతున్నాను. వ్యాయామం చేయకుండానే బరువును అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు చెప్పండి. - కృష్ణవేణి, చోడవరం చాలామంది గృహిణులు మీరు చెబుతున్న సమస్యలనే ప్రస్తావిస్తుంటారు. ఇంటిపనుల్లో బిజీగా ఉండి, వేళకు తినకపోవడం, పైగా అన్నం వృథా కాకూడదంటూ మిగిలిపోయినవి తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంటారు. మీరు బరువు పెరగకుండా అదుపు చేసుకునేందుకు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. కొద్దిగా తినే షాపింగ్‌కు వెళ్లకండి... ఏదైనా కొనాల్సిన సమయంలో వచ్చాక తినవచ్చు అనే ఫీలింగ్‌తో ఖాళీ కడుపుతోనే షాపింగ్‌కు చాలా మంది గృహిణులు చేస్తుంటారు. మీరు అలా తినకుండా షాపింగ్‌కు వెళ్లకండి. అలాంటప్పుడు ఆకలి పెరిగి, అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. పైగా బయటి తిండి ఆరోగ్యంగా ఉండదు. షాపింగ్ చేసే సమయంలో వేగంగా నడవడం వల్ల మీరు చురుగ్గా ఉండటంతో పాటు జీవక్రియల వేగం పెరిగి మీకు అనుకోకుండానే వ్యాయామం చేకూరుతుంది. ఎక్కువసార్లు తినండి: తక్కువ మోతాదులో ప్రతి మూడు గంటలోకొకసారి తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం తక్కువ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మోతాదుకు మించి ఆహారం తీసుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ తీవ్రంగా ఆకలయ్యే వరకు ఆగవద్దు. ఉదయం వేళ టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్)ను ఎప్పుడూ మిస్ చేయకండి. మెల్లగా తినండి: ఆహారాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారం తీసుకునేందుకు కొద్దిసేపటి ముందుగా ఒక కప్పు సలాడ్స్‌తో పాటు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండిపోయి తక్కువగా తింటారు. పగటి నిద్ర వద్దు: మధ్యానం పూట అస్సలు నిద్రపోవద్దు. ఇది కూడా తిన్న తర్వాత అస్సలే నిద్రపోవద్దు. అయితే రాత్రివేళ కంటికి నిండుగా కనీసం 7-8 గంటలు నిద్రపోండి. అవకాశం ఉన్నప్పుడల్లా నడవండి: ఫోన్లో మాట్లాడుతున్నప్పుడల్లా అటూఇటూ నడుస్తూ మాట్లాడండి. కానీ అదే సమయంలో నిర్లక్ష్యంగా చూసుకోకుండా, మెట్లపైకి వెళ్లడం చేయకండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్ కౌన్సెలింగ్ మా అమ్మగారికి వయసు 40 ఏళ్లు. ఈమధ్య కొన్ని పరీక్షలు చేయించినప్పుడు ఆమెకు బ్లడ్‌క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు చెప్పండి. - రాధారమణి, శ్రీకాళహస్తి రక్తకణాల ఉత్పత్తి ప్రభావితం కావడం వల్ల బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ వస్తుంది. ఇది ప్రధానంగా బోన్ మ్యార్ (ఎముకమజ్జ /మూలగ)లో ప్రారంభమవుతుంది. ఇక్కడి మూలకణాలు వృద్ధిచెంది... అవి ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్లెట్స్గానూ తయారవుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. అనియంత్రితంగా ఇలా రక్తకణాలు పెరిగిపోవడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. నియంత్రణ లేకుండా పెరిగిన ఈ కణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా పేషెంట్స్ రోగనిరోధక శక్తి కోల్పోతారు. లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పిత్తి అవుతుంటాయి. వీటి వల్ల గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు రావడం కనిపిస్తుంది. వ్యాధి కారక సూక్ష్మజీవులతో పోరాడుతూ ఉండే తెల్లరక్తకణాల పనితీరు దెబ్బతింటుంది. దాంతో అవి తమ విధులను సక్రమంగా నెరవేర్చలేవు. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్రరకణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లకు ఆయాసం కూడా రావచ్చు. ఇతర జబ్బుల్లోనూ ఆ లక్షణాలు ఉండవచ్చు. అందుకే ఆ లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేయాలి. డాక్టర్ శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్ బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
వెన్నునొప్పి నివారణ కోసం...
చిన్న పిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌లో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలి. పిల్లలు స్కూల్ బ్యాగ్‌ను వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు పై భాగంలో (అప్పర్ బ్యాక్) ఉంచేలా చూడాలి. స్కూల్ బ్యాగ్ వీపుపై మోసుకెళ్లకుండా చక్రాలపై రోల్ చేసేది ఉంటే మంచిది. పిల్లలు స్కూల్లోనూ, పెద్దలు పనులు చేసే ప్రదేశంలో ఒంగిపోయినట్లుగా గాక వెన్నును నిటారుగా ఉంచేలా కూర్చోవడం (ఎర్గానమికల్లీ రైట్ పొజిషన్) అలవాటు చేసుకుంటే మంచిది. సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యేలా ఆరుబయట తిరగడంతో పాటు మంచి వ్యాయామాలు చేయడం వల్ల ఎముకలకు సరైన పాళ్లలో క్యాల్షియమ్ అంది అటు పిల్లల్లోనూ, ఇటు పెద్దల్లోనూ ఎముకలు గట్టిపడతాయి. బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది. పెద్దవాళ్లు పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. మందుల బయోకెమికల్ స్వభావం, వాటి హానికరమైన ప్రభావం, రిస్క్ వంటి అంశాలు తెలిసి ఉండే క్వాలిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది. -
ఇండో యుఎస్ ఆర్మీ మాక్ యుద్ద విన్యాసాలు
-
పిల్లల ఆరోగ్యం కోసం... ఈ జాగ్రత్తలు!
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పన్నెండేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరగడంతో పాటు ఊబకాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - నళిని, కందుకూరు ఈమధ్య ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు పత్రికలూ, టీవీల వంటి వాటి ద్వారా అందుతూ ఉన్నాయి. కానీ ఇంకా చాలా మంది అంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. దాంతో పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతో పాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ర్పభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు పన్నెండేళ్ల పాటు జరిగిన అధ్యయనంలో తెలుస్తోంది. 2003లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలు 12.8 శాతం ఉండగా... 2015 నాటికి వారి సంఖ్య 26.6 శాతానికి పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇలా పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం ద్వారా పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌స్టైల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు కాళ్లు పాదాల నుంచి మోకాళ్ల వరకు తిమ్మిర్లుగా ఉంటున్నాయి. నేను నాలుగు నెలలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. కింద కూర్చొని టక్కున పైకి లేవలేకపోతున్నాను. చేతులు కూడా బలహీనమైపోతున్నాయి. ఎన్ని మందులు వాడినా రోజురోజుకీ బలం తగ్గిపోతోంది. చేతులు, కాళ్లు సన్నబడిపోతున్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పగలరు. - రమేశ్, నిడదవోలు మీకు షుగర్, హైబీపీ వంటివి ఉన్నాయా లేదా అన్నది మీ ఉత్తరంలో తెలపలేదు. షుగరు వ్యాధి ఉన్నవారిలో కూడా మీరు చెబుతున్న లక్షణాలు ఉండవచ్చు. షుగరు లేదంటే మీకు క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలీ న్యూరోపతీ (సీఐడీపీ) అనే జబ్బుతో బాధపడుతుండవచ్చు. నరం మీద ఉండే పైతొడుగు ఊడిపోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఇది వచ్చిన వాళ్లకు కాళ్లు, చేతులతో తిమ్మిర్లు ఉండటం, నడుస్తున్నప్పుడు పాదాలకు స్పర్శ తెలియకపోవడం, కళ్లు మూసుకుంటే కింద పడిపోవడం, కింద కూర్చొని పైకి లేవలేకపోవడం, చేతులలోని బరువైన వస్తువులను తలపైకి ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నర్వ్ కండక్షన్ స్టడీ అనే పరీక్ష ద్వారా ఈ జబ్బు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. కొన్ని రక్తపరీక్షల ద్వారా ఏ కారణం వల్ల ఇలా నరాలు దెబ్బతిన్నాయన్న విషయం తెలుసుకోవచ్చు. స్టెరాయిడ్ ఇంజెక్షన్, ప్లాస్మా పెరిసిసి, ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్ ద్వారా ఈ జబ్బును తగ్గించవచ్చు. అయితే ఆ తర్వాత కూడా కొన్ని నెలల నుంచి, సంవత్సరా పాటు టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ జబ్బును దాదాపు నయం చేయవచ్చు. మీరు కొన్ని నెలల నుంచి ఈ జబ్బుతో బాధపడుతున్నారని చెబుతున్నారు కాబట్టి వీలైనంత త్వరగా న్యూరాలజిస్ట్‌కు చూపించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకుంటే ఇది నయమయ్యే అవకాశాలు ఎక్కువ. మా అబ్బాయికి పదేళ్లు. ఆరో ఏడాది నుంచి నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కూర్చొని పైకి లేవలేకపోతున్నాడు. కాళ్ల పిక్కలు లావయ్యాయి. మా అబ్బాయికి జబ్బు నయమయ్యే అవకాశం ఉందా? నాది, మా ఆయనది చాలా దగ్గరి సంబంధం. మేనరికం వల్ల ఈ జబ్బు వచ్చిందంటున్నారు. నిజమేనా? - సుశాంతి, నకిరేకల్లు మీ అబ్బాయి డీఎమ్డీ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. మేనరికం వంటి దగ్గరి సంబంధాలలో పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల, జన్యుపరమైన కారణాలతో ఈ జబ్బు వచ్చిందన్న మాట వాస్తవమే. ఇది చిన్నవయసులోనే ప్రారంభమై, పిల్లలకు పదిహేనేళ్లు వచ్చేసరికి పూర్తిగా బలహీనమయ్యేలా చేస్తుంది. దీనికి సరైన మందులంటూ ఏవీ లేవు. ఈ జబ్బు తీవ్రతను స్టెరాయిడ్స్ వల్ల తగ్గించవచ్చు. అయితే వాటిన సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫిజియోథెరపీ ద్వారా కండరాలు బలహీనం కాకుండా చేయవచ్చు. ఒకసారి వచ్చాక జబ్బును తగ్గించడం సాధ్యం కాదు. మీరు అధైర్యపడకుండా ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నా కుడిచెంప మీద మూడువారాల క్రితం ఒక మొటిమ వచ్చింది. దాన్ని గట్టిగా నొక్కాను. అప్పట్నుంచి దాని పరిమాణం పెరిగి నల్ల మచ్చలా మారింది. చాలా అసహ్యంగా కనిపిస్తోంది. నాకు తగిన చికిత్స సూచించండి. - నవీన్, అనంతపురం మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది ‘యాక్నే వల్గారిస్’అలా అనిపిస్తోంది. దాన్ని గిల్లకండి. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. మీరు కొన్నిరోజులు అజిథ్రోమైసిన్ 500 ఎంజీ వంటి యాంటీబయాటిక్ మాత్రలను మూడురోజులకు ఒకసారి చొప్పున మూడు వారాల పాటు వాడాలి. మీరు క్లిండామైసిన్, అడాపలీన్ కాంబినేషన్ ఉండే జెల్‌ను రోజూ రాత్రివేళ మొటిమపై రాయండి. ఎస్పీఎఫ్ 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌లోషన్‌ను ప్రతి మూడు గంటలకోసారి చొప్పున ప్రతిరోజూ ముఖంపై రాసుకోండి. నేను గత కొన్నేళ్లుగా కళ్లజోడు వాడుతున్నాను. అది ఆనుకునే చోట ముక్కు ఇరువైపులా నల్లటి మచ్చలు వచ్చాయి. కొన్ని క్రీములు కూడా వాడి చూశాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. ముక్కుకు ఇరువైపుల ఉన్న ఈ మచ్చలు తగ్గిపోయే మార్గం చెప్పండి. - ధరణి, విశాఖపట్నం కళ్లజోడును ఎప్పుడూ తీయకుండా, నిత్యం వాడేవారికి, ముక్కుపై అది రాసుకోపోవడం (ఫ్రిక్షన్) వల్లఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అక్కడి చర్మంలో రంగుమార్చే కణాలు ఉత్పత్తి (పిగ్మెంటేషన్) జరిగి, ఇలా నల్లబారడం మామూలే. కొన్నిసార్లు అలా నల్లబడ్డ చోట దురద కూడా రావచ్చు. మీ సమస్య తొలగడానికి ఈ కింది సూచనలు పాటించండి. మీకు వీలైతే కళ్లజోడుకు బదులు కాంటాక్ట్ లెన్స్ వాడండి కోజిక్ యాసిడ్, లికోరిస్, నికోటినెమైడ్ ఉన్న క్రీమును మచ్చ ఉన్న ప్రాంతంలో రాయండి అప్పటికీ ఫలితం కనిపించకపోతే మీకు దగ్గర్లోని డెర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డెర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
మెదడు బలం కాళ్లలోనే...
పరిపరి శోధన తెలివితక్కువ దద్దమ్మలను హేళన చేయడానికి ‘వాళ్లకు మెదడు మోకాల్లో ఉంది’ అంటుంటారు గానీ, మెదడు బలం కాళ్లలోనే ఉందంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. అంటే, కాళ్లు బలంగా ఉంటేనే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. రోజూ నడక, గుంజీలు తీయడం వంటి వ్యాయామాలు చేసేవారికి కాళ్లు బలంగా తయారవుతాయని, అలాంటి వారిలో మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. పదేళ్ల పాటు 324 మంది కవలలపై విస్తృతంగా అధ్యయనం నిర్వహించి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు అంటున్నారు. ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసిన కవలల్లో కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసేవారి మెదడు పనితీరు, అలాంటి వ్యాయామాలు చేయని వారి కంటే మెరుగ్గా ఉందని ‘గ్యారంటాలజీ’ జర్నల్ ద్వారా వారు వెల్లడించారు.